Saturday, August 6, 2022

🌹ఆధ్యాత్మికత🌹

  🌹ఆధ్యాత్మికత🌹 

 ఆధ్యాత్మిక జీవితం అంటే అన్ని పనులు వదిలేసి దైవ చింతనలో మునిగిపోవటం కాదు . గుళ్ళకి వెళ్లి ,తీర్థ యాత్రలు చేసి ,పురాణ ప్రవచనాలు విని , జపతపాలు చేసి మళ్ళీ మామూలుగా అన్ని రకాల ద్వంద భావాలతో ,రాగ ద్వేషాలతో జీవనం సాగించడం ఆధ్యాత్మికత కానే కాదు . 

 వయో వృద్దులు ఒక్కరే చేసేది కాదు . 

 ఆధ్యాత్మికత ఇహానికి ,పరానికి రెంటికీ పని కొచ్చే సూత్రం . 

 నిజాన్ని నమ్మటం ,నిజమైన స్వ ధర్మాన్ని తెలుసుకొని త్రికరణ శుద్దిగా పాటించడం , వయస్సుకి ,స్థితికి అనువైన నాలుగు ఆశ్రమాల నియమాలను అమలు చేయడం ఆధ్యాత్మికత . 

 పుట్టిన పసివాడు తల్లిపాలు త్రాగటం ,20 గంటలు నిదుర పోవటం ఆధ్యాత్మికత . 

 బాల్య వయస్సు లో మంచి ఆహారం ,ఆట పాటలతో ఆహ్లాదంగా గడపటం ఆధ్యాత్మికత . 

 విద్యార్ధి దశలో - శరీర శుభ్రత , వ్యాయామం ,మంచి పోషక ఆహారం తినుట , 

 స్వచ్చమైన గాలిని ప్రాణాయామ పద్దతి లో శ్వాసించుట , 

 తల్లితండ్రులను అతిధి అభ్యాగతులను పూజించుట , 

 గురువుని దైవం వలే నమ్మి విద్య నేర్చు కొనుట ఆధ్యాత్మికత . 

 తోటి మనిషికి , ప్రకృతికి హాని చేయక చేతనైనంత సాయం చేయడం , 

 వస్తూత్పత్తి చేసే వారిని అనగా పంటలు పండించే రైతు ,పరిశ్రమలలో పనిచేసే కార్మికుడు , 

 అలాగే మనలను రక్షించే వారిని,అనగా , సైనికులను , పోలీసులను , గౌరవించి ఆదరించడం ; 

 విజ్ఞానాన్ని పంచే గురువులను ,పరిశొధనలు చేసి కొత్త విషయాలు ఆవిష్కరించే శాస్త్రజ్ఞుల ను అనుసరించడం -ఆధ్యాత్మికత . 

 ప్రతి భాద్యత ,వృత్తి, ప్రవృత్తి అన్నీ కర్తృత్వ భావన లేకుండా భగవత్ కైంకర్యంగా చేయడమే ఆధ్యాత్మికత . 

 మనషి చిన్నప్పటి నుండి ఎలా ఆధ్యాత్మిక జీవనం సాగించాలో గీత చెబుతుంది 

No comments:

Post a Comment