Wednesday, August 10, 2022

సహనం & అంగీకారం

 *సహనం & అంగీకారం*

జీవితంలో అన్నీ, 
అందరూ మనకు అనుకూలంగా ఉండాలని లేదు. 

పూర్వ కర్మానుసారం లభించిన.. 
వాటిని.... 
ఎదుర్కొంటూ, భరిస్తూ, పోరాడుతూ, 
పైకి మౌనంగా ఉంటూ లోపల అలజడికి గురి అవుతూ దానినే సహనంగా భావిస్తూ ఉంటే కనుక... 

రోజురోజుకు బలహీనమవుతూ సంఘర్షణకు, ఒత్తిడికి, అశాంతికి అసహనానికి గురవుతూ... 

నేనే సహించాలా? 
ఇంకా ఎంత సహించాలి? 
సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది? అని వాపోతూ ఉంటాము!

కానీ, 
మనం సహించే కొలదీ మనకు శక్తి అనుభవం అవ్వాలంటే... 
అందుకు సహజ పరిష్కారం... 

మన నియంత్రణలో లేని వాటిని మనస్ఫూర్తిగా అంగీకరిస్తూ ముందుకు వెళ్ళాలి. 

ఇటువంటి సహనం వలన మన నియంత్రణలో లేని విషయాల్లో కూడా పరివర్తన అనేది మొదలవుతుంది.

"నేను సహిస్తున్నాను" అని అనుకుంటూ ఉంటే కనుక.... స్వయం మరింత బలహీనం అవుతూ ఉంటాము!

"నేను అంగీకరిస్తున్నాను" 
అని అనుకుంటే కనుక... 
స్వయం శక్తివంతంగా ఉంటాము!

సేకరణ. మానస సరోవరం 👏 

No comments:

Post a Comment