Sunday, May 21, 2023

******అష్టావక్రుడు సందేశం

 *Life Change Messages Every Day 6pm In Light Workers Group*

🌺 *మహా జ్ఞానం (Messages from 40 masters)* 🌺
🌹 *(మూలం:- C.అరుణ ----అనువాదం:- D.రేవతిదేవి)*🌹
🕉️ *మాస్టర్ -- 25:--- అష్టావక్రుడు సందేశం*🕉️
🌸 *Part --1*🌸

🌿 ఈనాడు భారీ ఎత్తున వినాశనం అనేది ప్రపంచంలో ఒకచోట కాకపోతే మరోచోట జరగటం సర్వ సాధారణమైపోతోంది. ప్రపంచంలో ప్రతీదీ తిరోగతిలో ఉంది. భూమి మీద జీవ రాసులలో చాలా జాతులు అంతరించిపోయే దశకు చేరుకుంటున్నాయి త్వరితంగా. మనుష్యులు స్వార్థంగా తయారవ్వటమే కాకుండా తమ ఇరుగు పొరుగు వారు గానీ, స్నేహితులు గానీ మానసికంగా ఆర్థికంగా ఎలాంటి కష్టాలలో ఉన్నా అసలు పట్టించుకోవటం లేదు.

🏵️ అదేమిటో ఈ మనుష్యులకు ఆధ్యాత్మికంగా ఎదగడానికి సమయం సరిపోవటం లేదు. ప్రతి ఒక్కడూ తీరిక లేకుండా పరిగెడుతున్నారు - వారికి కావలసిందల్లా డబ్బు, డబ్బు, డబ్బు. అదేం చిత్రమో డబ్బును మించింది ఈ ప్రపంచంలో ఏదీ లేకుండా పోయింది. ప్రతి ఒక్కళ్ళు ఆడ గానీ, మగ గానీ పనుందంటూ పరుగులు. కుటుంబానికి ఇంకా తెచ్చిపొయ్యాలని ఆరాటం పాపం. వాళ్ళను చూస్తే నాకు జాలి వేస్తుంది. సంఘంలో *'హెూదా'*, ఆర్థికంగా *'పరపతి’* అంటూ ఆ ముసుగుల్లో తమ అసలు తత్త్వాన్ని చాలా చాలా లోతున పూడ్చి పెట్టేశారు. 

🍀 ప్రతి చోట బలి అయిపోతున్న వాళ్ళు ఎవరంటే చిన్న పిల్లలు, వారి యవ్వనంలోకి అడుగు పెడుతున్న వాళ్ళు. వాళ్ళు ఎంతసేపూ తమ తల్లిదండ్రుల ఇష్టాయిష్టాలకూ, సమయా సమయాలకు అనుగుణంగా సర్దుకుపోతూండాల్సిందే. మనమంతా ఒక వయస్సు వచ్చాక, అంటే కాస్త పెద్ద వాళ్ళమయ్యాక, జీవితంలో సర్దుకుపోవాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు చిన్న పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాల్సి వస్తోంది. పుట్టినప్పటి నుంచే *“టైము”, “తల్లిదండ్రులు అఫీసుకు పరిగెత్తటం”* లాంటివి వాళ్ళకు ప్రతి రోజు అలవాటవుతున్నాయి. *"అమ్మా నాన్న ఇంట్లో ఉండటం”* అనేది వాళ్ళకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది, అది అర్ధం చేసుకోవటం చాలా కష్టమవుతోంది. 

🍁మనలో సహజంగా ఉండే ఆడుకోవటం, ముద్దాడటం, బిడ్డతో గడపటం లాంటివన్నీ ఏమైపోతున్నాయి? కుటుంబ సభ్యులందరితో కలసి కూర్చుని ఆనందించాలనే కోరిక ఎటుపోయింది. ప్రపంచమే చిన్ని చిన్ని ముక్కలైపోతూంటే మనందరం ఏం చేస్తున్నాం? ప్రతి చోటా ఎంతెంత భీభత్సం జరుగుతోందో మీరంతా చూడటం లేదా? దేవి కోసం ఎదురు చూస్తున్నారు మీరు? మీరు ఎందుకీ ప్రపంచంలో పుట్టారు? ఇలా పరుగులు పెట్టడానికేనా? ఎవరైనా సంతోషంగా ఉన్నారా? మీ వరకు మీరైనా సంతోషంగా ఉన్నారా? ఎవరైనా తాము సంతోషంగా ఉన్నామని మనస్సు విప్పి మీకు చెప్పుకున్నారా? లేదు... పందెం కాస్తాను. ఒక్కళ్ళు కూడా సంతోషంగా లేరు. 

🌹 మీరంతా సంతోషంగా లేరు. ఎందుకో తెలుసా? ఈ *"సమాజం కోసం, మీ చుట్టూ ఉండే ఈ బుద్ధిలేని మనుష్యుల కోసం, మీ మీద మీరే రుద్దుకున్న పనికిమాలిన ప్రమాణాల కోసం, మీ అసలు సిసలైన స్వభావాన్ని మీరు గాలికి వదిలేశారు. సరేలెండి. మీ అందరి కోసం నా దగ్గర ఒకానొక మాస్టర్ ప్లాన్ వుంది. అది అవడానికి చిన్నదే అయినా అద్భుతాన్ని సృష్టిస్తుంది. అయితే మీ నుంచి నాకో అభయం కావాలి. అదేమిటంటే ఈ ప్లాన్ ఆచరించటం మొదలు పెట్టాక మధ్యలో ఆపకూడదు. లేదా అసలు దాని జోలికే రావద్దు. దీని కోసం మీకు రోజుకు అయిదు నిమిషాలు మాత్రమే పడుతుంది. మీకు ఇంకా ఎక్కువసేపు గడపాలనిపిస్తే దానివల్ల మీరు మరింత ముందుకు సాగుతారు.

------------------

*Life Change Messages Every Day 6pm In Light Workers Group*

🌺 *మహా జ్ఞానం (Messages from 40 masters)* 🌺
🌹 *(మూలం:- C.అరుణ ----అనువాదం:- D.రేవతిదేవి)*🌹
🕉️ *మాస్టర్ -- 25:--- అష్టావక్రుడు సందేశం*🕉️
🌸 *Part --2*🌸

💠 మీ అందరిలోనూ *"అంతర్భావన"* అనేది ఉంటుందని మీరు ఎప్పుడైనా గమనించారా? 

🔸 1) మీ మనోభావాలను గమనించండి. ఒక్కో పరిస్థితికీ, ఒక్కో పరిసరానికి మీరు ఎలా స్పందిస్తున్నారో గమనించండి, అంతే. 

🔷 2) మనుష్యులనూ, వాళ్ళ భావావేశాలనూ గమనించండి. మీ భావాలకూ, వాళ్ళ భావాలకూ ఏదన్నా తేడా గమనించారా మీరు?చూసుకోండి. ఒకవేళ తేడా ఉందనిపిస్తే మీరు ఎందుకలా వేరే రకంగా ఫీలవుతున్నారో చూసుకోండి. 

🔶3) పిల్లలు మనకు అద్భుతమైన వరాలు. వాళ్ళను ఈ ప్రపంచంలోకి మీరు తెచ్చారని గర్వపడకండి. మీకు పిల్లలుగా పుట్టాలని వాళ్ళే ఎంచుకున్నారన్న సంగతి అర్థం చేసుకోండి. వాళ్ళు మీకంటే ఎంతో ముందున్నారు. వాళ్ళకు ఏమైనా అధ్యాత్మిక ప్రశ్నలు అడగండి - *"నాయనా! ఒక మాట చెప్పు. జంతువులు, మొక్కల జన్మల గురించి ఏమనుకుంటున్నారు?”* లాంటి వన్నమాట. అయితే, దయచేసి మీరు చాలా ఓర్పుగా ఉండండి. వాళ్ళకే మీకంటే బాగా తెలుసునని వాళ్ళకు చెబుతూ వాళ్ళ అంతరాళాలలో వున్న జ్ఞానాన్ని బయటికి లాగడానికి ప్రయత్నం చేయండి.

🌿 మొదట, టీవీ చూస్తూనో, ఆడుకుంటూనో మీ బిడ్డతో కొంత సమయం గడపడం నేర్చుకోండి. వాళ్ళు అందులో నిమగ్నమైపోయి ఉండగా మీరు వాళ్ళ దగ్గరుండండి. ఆ ఆట ఆడటమో ఆ టీవీ చూడటమో పూర్తికానివ్వండి. ఆ బిడ్డను అభిప్రాయం అడగండి. అయితే, మీ ప్రశ్న స్పష్టంగానూ, ఆ బిడ్డ పట్ల ఎలాంటి విమర్శ సంధించకుండానూ ఉండాలి. ఆ బిడ్డను జీవిత నాటకం చూడనివ్వండి. ఎంజాయ్ చేయ నివ్వండి. పుట్టుక మొదలుగా పెరగటం, క్రమంగా వచ్చే శారీరక మార్పులు, జట్టు కట్టడం - శారీరికం గానూ మానసికం గానూ కూడా చివరికి చనిపోవటం వరకు అన్నీ తెలుసుకోనివ్వండి.

🌳 మీరు చేయవలసిన మరొక పని ఏమిటంటే తాను పుట్టిన విధానాన్ని అంటే తన శరీరం, మనస్సులను - ఆ బిడ్డ ప్రేమించేలా చేయాలి. మీ సమయాన్ని వాళ్ళ కోసం కొంత వెచ్చించి ఓర్పుగా ఉండి మీ ప్రేమంతా వాళ్ళ మీద కురిపించండి. వాళ్ళిప్పుడు ఏదైనా చేయలేకపోతే, విఫలమైతే దయచేసి వాళ్ళని విమర్శించి తిట్టకండి. మీరే తన బహిర్ ప్రాణమనీ, తన వైఫల్యాలను పక్కన పెట్టి మీరు తనకు ఏదైనా సరే ఇస్తారనీ ఆ బిడ్డ ఫీలయ్యేలాగా మీరు ప్రవర్తించాలి. ఎటువంటి పరిస్థితులలోనూ ఆ బిడ్డ తన భావాలను మీతో పంచుకునేలా చేసుకోవాలి మీరు. వాళ్ళ పరిస్థిథుల్లో మీరు కూడా వాళ్ళలాగా ఒక బిడ్డగా మారిపోండి. వాళ్ళల్లో ఒకరుగా మాట్లాడండి. మీరు వాళ్ళకి తల్లిదండ్రులుగా పుట్టింది కర్ర పుచ్చుకుని వాళ్ళను చావగొట్టడానికి కాదు. ఉజ్జ్వలమైన రేపటి కోసం వాళ్ళని మెత్తబరచి మలచడానికి. 

🌷 ఇవాళ మీ బిడ్డ స్కూల్లో వెనకబడి ఉండవచ్చు. తరచు ఏదో మానసికంగా ఒత్తిడికి లోనవుతూండవచ్చు. పక్క తడుపు తుండవచ్చు, మాట్లాడకుండా ఎవ్వరితో కలవకుండా ఉండవచ్చు. ఆడుకోకుండా ఉండవచ్చు - అదంతా మీరు తనను సరిగ్గా పట్టించుకోకపోవటం వల్లనే. గంటల తరబడి టీవీ చూస్తూనే కూర్చునే బదులు రోజు మొత్తంలో ఏదో ఒక సమయంలో ఒక గంటసేపు వాళ్ళల్లో ఒకళ్ళుగా గడపండి. 

🌼 కనుక, ఫ్రెండ్స్! మిమ్మల్ని నేను కోరేదేమిటంటే మీ జీవిత కాలంలో మీకు కలిగే ప్రతి భావమూ ముఖ్యమే. దానిని అర్థం చేసుకోండి. ఈనాటి పిల్లలకు ముఖ్యంగా కావలసింది ప్రేమ. మీకు అవసరమైనవి భద్రత, మానసిక సుఖం. అది మీకు సాధ్యపడేది ఎలాగంటే - మీకు ఎలా కూర్చుంటే సుఖంగా హాయిగా ఉంటుందో అలా కూర్చుని, రెండు చేతుల వ్రేళ్ళూ కలుపుకుని, కళ్ళు మూసుకుని, నెమ్మదిగా గాలి పీలుస్తూ వదులుతూ గమనించండి. ఇదే ధ్యానం అంటే! ఒక్క అయిదు నిమిషాల పాటు చేయలేరా మీరంతా దీనిని? చూడండి ఫ్రెండ్స్! ఆఫీసులో కూర్చుని ఉన్నప్పుడు కూడా మీరిది చేయవచ్చు. టాక్సీలో గానీ, రైల్లో గానీ, బస్సులో గానీ ఆఫీసుకు పోతూ కూడా చేయవచ్చు. మీకు ఎక్కడ బుద్ధిపుడితే అక్కడ చేయగలరు. దీనికి రూల్సు అంటూ ఏమీ లేవు.

-----------

*Life Change Messages Every Day 6pm In Light Workers Group*

🌺 *మహా జ్ఞానం (Messages from 40 masters)* 🌺
🌹 *(మూలం:- C.అరుణ ----అనువాదం:- D.రేవతిదేవి)*🌹
🕉️ *మాస్టర్ -- 25:--- అష్టావక్రుడు సందేశం*🕉️
🌸 *Part --3*🌸

☘️ గమనిస్తూ గాలి పీల్చి వదలటం ఎందుకంత ముఖ్యమో ఇప్పుడు మీకు చెబుతాను. చూడండీ. మన చుట్టూ ఉండే ప్రతీదీ చాలా కలుషితమై పోయి ఉంది. మనమంతా విషపుగాలి పీలుస్తున్నాము. దానితో మన శరీరాన్నే కాదు మన ఆలోచనల విధానాన్ని కూడా నాశనం చేసుకుంటున్నాము. అయితే ఇలా గమనిస్తూ గాలి పీల్చటం వల్ల బహు స్వచ్ఛమైన విశ్వ శక్తిని మన శరీరంలోకి ప్రశమించనిస్తున్నాము. ఈ శక్తితో మీరు *“పూజ"* చేసే మాస్టర్స్ అందరూ చేసే అద్భుతాలు మనందరం కూడా చేయగలుగుతాము. ఈ చిన్న ప్రక్రియను అనుసరించటం ద్వారా మీరందరూ కూడా వాళ్ళంత సంతోషంగా ఉండగలుగుతారు. బ్రతికున్న మిగిలిన మాస్టర్స్ నుంచి కూడా మీకు ఎప్పుడూ సహాయం లభిస్తూనే ఉంటుంది. దాని కోసం మీరు చేస్తున్న బహు చిన్న ప్రక్రియ గమనిస్తూ గాలి పీల్చటం, వదలటం.

🌸 అద్భుతాలు అనేవి మొట్ట మొదట మీ వ్యక్తిగత అవగాహనలో జరుగుతాయి. తర్వాత మీ కుటుంబంలో అద్భుతమైన మార్పులూ, సహకారాలూ మీరు గమనిస్తారు. తర్వాత నెమ్మదిగా ఆనందమూ, పరమానందమూ, బ్రహ్మానందమూ మీలోనూ, మీ చుట్టు ప్రక్కలా చోటు చేసుకుంటాయి. ఇదంతా ఈ చిన్ని ప్రక్రియ ద్వారానే. 

🏵️ ధ్యానం అనేది, తపస్సు అనేది, కేవలం సన్యాసులకు మాత్రమేనేమోనని చాలా మంది అనుకోవచ్చు. కానీ అది సరికాదు. ధ్యానం అనేది ప్రతి ఒక్కరి కోసం. మీరు నిత్యము ధ్యానం చేస్తూ ఉన్నందు వల్ల మీ సంసార బంధాల నుంచీ, ఉద్యోగ బాధ్యతల నుంచీ మీరు విడిపోవలసిన అవసరం లేదు. ఈ రెండు పనులూ ఆప్యాయంగా, మనస్ఫూర్తిగా చేయండి. కానీ రోజూ అయిదు నిమిషాల పాటు ధ్యానం చేయండి. మీకు దానిలో ఉత్సాహం కలిగితే సమయాన్ని ఇంకొంచెం పెంచుకోండి. ఎందుకంటే మీరెంత ఎక్కువగా చేస్తే అనతి కాలంలోనే మీరు అంత సంతోషంగా చైతన్యవంతంగా తయారవుతారు. 

💠 కనుక ఫ్రెండ్స్! మిమ్మల్ని నేను రెండు కోరికలు కోరుతున్నాను. 

🔸1) మీ బిడ్డను ప్రేమించండి. మీకు ఎన్ని ఒత్తిడులున్నా సరే కొంచెం సేపు వాళ్ళతో గడపండి. 

🔹2) ధ్యానం చేయండి. ధ్యానం మిమ్మల్ని మీ జీవిత గమ్యానికి చేర్చుతుంది. అంతే. 

🍀 ఏ ధ్యాని కోసం కూడా నా దగ్గర వ్యక్తిగతమైన సందేశం ఏమీ లేదు. మీ జీవితాన్ని చూడండి. అందులో మీకు ఎదురయ్యే ప్రతీదీ నేర్చుకోండి. ముందుగా దేనినీ ఊహించ వద్దు. ఆశించ వద్దు. మీలో చాలా మందికి ధ్యానం పిచ్చిపట్టుకుంది. దానిలో సగం సమయాన్ని ఆత్మ విశ్లేషణ, ఆత్మ పరిశీలన, పుస్తక పఠనాలకు వినియోగించండి. మీ బృందంలో చాలా మంది జ్ఞానాభివృద్ధి పట్ల నాకు చాలా చాలా  అసంతృప్తి ఉంది. ప్రతి బృందంలో ఎంతలేదన్నా 80% మందికి నిజమైన జ్ఞానం లేదు. కేవలం 20% మంది మాత్రమే చక్కని జ్ఞానంతో ఉన్నారు. మంచి ధ్యాన మాస్టర్లు - అవగాహనలో నా స్థాయికి సరిపోయే వాళ్ళు వాళ్ళను చూసి నేను గర్వపడుతున్నాను. మీరు మీ మాస్టర్ ని అడిగి వాళ్ళెవరో తెలుసుకుని వాళ్ళను చూసి నేర్చుకోండి. దయచేసి ఈ సందేశాన్ని ప్రతి బృందంలోని అందరు ధ్యానులకూ అందించండి. ఆయనకు తెలుసు అని ఎవరికి అవసరమో, ఎవరికి అవసరం లేదో.

🍁 గుడ్ లక్. అరుణా! మూర్తీ(అరుణ భర్త)! మీ బృందంలో చాలా మందిలో లేని అవగాహన, జ్ఞానం మీలో ఉన్నందుకు శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ జీవిత గమ్యాన్ని అర్ధం చేసుకునేలా చేయండి. బై అరుణా! నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తాను.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

🌳 *మహా జ్ఞానం పుస్తకం* మరియు *ఇతర ఆధ్యాత్మిక పుస్తకాలు* కావాలి అనుకునేవాళ్ళు *9032596493* no కి whatsapp కి msg చేయగలరు.

No comments:

Post a Comment