Sunday, May 7, 2023

 1...కామ,, క్రోధ ,,మోహ ,,లోభ ,,మద ,,మాస్తార్యాలు జయిస్తేనే మోక్షం వస్తుంది....?

2.... enlightenment కర్మపరిధిలోనిదా లేక కర్మకు సంబంధం లేదా...?

కామ,, క్రోధ,, మోహ,, లోభ,, మద,, మాస్తార్యాలు జయిస్తేనే మోక్షం వస్తుందా...? ఇది అసత్యం...అరిషడ్వర్గాలను మోక్షానికి సంబంధం లేదు..
మోక్షం అనేది ఒక దాన్ని జయిస్తేనో,,,,లేదా ఓడిస్తేనో వచ్చేది కాదు...

️ ""యోగం అంటే విషయ లోలత్వమూ కాదు... విషయ రహితమూ కాదు... అది విషయాతీతము..""

అరిషడ్వర్గాలన్నీ విషయాలే...కానీ యోగం అంటే 
విషయము లేకపోవడమూ కాదు విషయంలో ఉండడమూ
కాదు...విషయాయంలో మేల్కొని వుండడం...విషయానికి అతీతంగా వుండడం...

దీన్నే   ️,,""పద్మపత్ర మిభాంశస "" అన్నాడు కృష్ణుడు

తామరాకు  నీళ్ళల్లోనే వుంటుంది నీళ్లకు అంటదు..
సంసారం అంటేనే అరిషడ్వర్గాలు....అవి లేకుండా సంసారం ఎక్కడ వుంది...?

కొలను అంటేనే నీళ్ళు...నీళ్ళు లేకుండా కొలను ఎక్కడుంది...?  .ఆ కొలను లోనే కదా తామరాకు వుండేది..మరి తామరాకు నీళ్ళల్లో వున్నా నీళ్లకు అంటిందా .? లేదు....

అలాగే అన్ని విషయాల్లో ఉంటున్నా  ఏ విషయానికి అంటకుండా వుండడం నేర్చుకోవాలి..దీన్నే
మోక్షం అంటారు...

కామం లేకపోతే ఎలా..? క్రోధం లేకపోతే ఎలా..? మదం లేకపోతే ఎలా..? ఇలా అన్నీ తగు పాళ్ళల్లో వుండాల్సిందే...లేకపోతే జీవితం నిస్తేజం అవుతుంది..
సరైన కామం వుండాలి...సరైన కోపం వుండాలి..సరైన మదం వుండాలి...ఇలా అన్నీ వుండాలి...అన్నీ సమపాళ్లలో వుంచుకుంటూనే అవి ""నేను ""కాదు అన్న స్పృహలో జీవించాలి...

మీరు ఒక ఎర్ర లైటు కిందికి వెళితే మీరు మొత్తం ఎర్రగా మారుతారు...మారినంత మాత్రాన మీరు ఎర్రగా వున్నాట్టా..? లేదా మీరు ఎరుపు అయిపోయినట్టా..?
ఆ ఎర్ర లైట్ కింద వుండడం వల్లా ఎర్రగా వున్నట్టు కనబడినా మీరు అసలుగా ఎరుపు కాదు...

అలాగే కోపం కిందికి మీ చైతన్యం వెళ్ళినా...మీరు కోపం కాదు...కామం కిందికి వెళ్ళినా మీరు కామం కాదు... మాత్సర్యం కిందికి వెళ్ళినా మీరు మాత్సర్యం కాదు..
ఈ సత్యాన్ని సదా జాగృతి లో వుంచుకుంటే మనం ఏ అరిషడ్వ్గాలలో వున్నా వాటికి ఏ మాత్రం అంటనట్టే..

తామరాకు నిలవాలంటే నీళ్ళు కావాలి...కానీ నీళ్లకు అంటదు....

అలాగే  ఆత్మ,, ఈ  శరీరాన్ని కొంత కాలం ,,కొంత కారణం కోసం  నిలవాలంటే అరిషడ్వ్గాలు కావాలి....కానీ అరిశడ్వర్గాలకు అంటకుండా వుండాలి..ఆ తామరాకు లాగా...

కాబట్టి ,,,సత్యం ఏమిటంటే ,,,,మెల్కున్నామా..? లేదా..? 
అన్నదే ముఖ్యం...

️వున్నది ఒక్కటే ఒక్కటి....స్వప్నం 
వున్నది ఒక్కటే ఒక్కటి...మెలకువ

మన జీవితంలోకి ఏది వచ్చినా..మనం ఎందులోకి వెళ్ళినా ,,.దానికి ప్రభావితం అయితే ,,,అదే మనం అయిపోతే...దాన్ని స్వప్నం అంటారు...

మన జీవితంలోకి ఎది వచ్చినా..మనం  ఎందులోకి వెళ్ళినా...దానికి ప్రభావితం కాకుండా,,,అదే మనం అవ్వకుండా వుంటే దాన్ని మెలకువ అంటాం...,

ధర్మవ్యాధుడు మాంసపు వ్యాపారి...కానీ మహా ముక్తిలో జీవించాడు కదా...!

స్వప్నమే,,,,మాయ
మెలకువే....మోక్షం...

తెలిస్తే ,,నీళ్లకు నీళ్ళే,,పాలకు పాలే..తెలియక పోతే మాయపాలే..,

దేవుడూ...,

No comments:

Post a Comment