Tuesday, May 9, 2023

:::::: తెలుసు కోవడం :::::::

 *::::::: తెలుసు కోవడం :::::::*
       మనస్సు   ఎప్పుడూ క్రొత్తగా తెలుసు కోవడానికి ఇష్ట పడుతుంది. అయితే మనస్సుకి తెలియడం అంటే తెలిసిన దానితో పోల్చడం, లేదా అంతకు ముందే తెలిసిన దాని సరసన చేర్చడం, అనే ఈ రెండు పనులు చేస్తూ తెలుసుకోవడానికి తనకు తానుగా  అడ్డు పడుతుంది.
     నిజమైన తెలుసుకోవడం ఎలా వుంటుంది? తెలుసు కోవడం అంటే
 1) ప్రతి క్షణం అనుభూతి చెందుతూ వుండటం.
2)పోల్చడం , కొలవడం, తీర్పు చెప్పడం, వాచీకరణ(verbalisation) మొదలగు నవి చేయకుండా వుండటం.
 3)వర్తమాన క్షణంలో పొందుతూ వున్న అనుభూతి తో సహా కాలంతో పాటు కొనసాగడం.
4) జ్ఞాపకంగా మార్చక పోవడం.
5)నేను తెలుసు కుంటున్నాను అన్న భావన జొరబడకుండా వుండటం 
6) అనుభూతి చెందుతూ వున్న విషయంతో తాదాత్మ్యం చెందక పోవడం 

*షణ్ముఖానంద 98666 99774*

No comments:

Post a Comment