Wednesday, May 31, 2023

సమస్యకు భయపడితే బంగారం లాంటి అవకాశం కోల్పోయినట్లే!..!!

 🎻🌹🙏 సమస్యకు భయపడితే బంగారం లాంటి అవకాశం కోల్పోయినట్లే!..!!

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

🌿ఒకసారి ఒక రాజుగారు రాత్రి ... తెల్లవారు జామున మారువేషంలో వచ్చి రాజమార్గంపై ఎవ్వరికీ తెలియకుండా ఒక పెద్ద బండరాయిని పెట్టారు. తెల్లారేదాకా ఆగి, తరువాత దగ్గరలోని చెట్టుచాటున నక్కి ఏం జరుగుతుందో గమనిస్తున్నారు.

🌸బడాబడా వ్యాపారులు వచ్చారు. రాయిని పట్టించుకోలేదు. పక్కనుంచి వెళ్లిపోయారు.

🌿"రాజుగారి పరిపాలన అధ్వాన్నంగా ఉంది. లేకపోతే రోడ్డు మీద అడ్డంగా బండరాయి ఉండటం ఏమిటి? దాన్ని ఇంత వరకూ తీయించకపోవడం ఏమిటి?' అంటూ తిట్టుకున్నారు.

🌸ఉన్నతాధికారులు అదే దారిన వెళ్లారు. బండరాయిని చూసి "ఎవరక్కడ.... ఇదెవరు చేశారు? వాడెవడో పట్టి కారాగారంలో పడేయండి" అని హుకుం జారీ చేశారు.

🌿అందరూ వస్తున్నారు.... వెళ్తున్నారు. తోచిన నాలుగు మాటలు అంటూ వెళ్లిపోతున్నారు. చివరికి ఒక రైతన్న వచ్చాడు.

🌸అతను బండి దిగి, బండరాయి దగ్గరకు వచ్చాడు. ధోతీ పైకి ఎగకట్టి, శక్తినంతా ఉపయోగించి ఆ రాయిని రోడ్డు పక్కకి జరిపేశాడు.

🌿ఆ బండరాయి కింద ఒక బంగారు నాణాల మూట కనిపించింది. దానిని తీసుకుని రాజాస్థానానికి వెళ్ళి రాజుగారికి సమర్పించి, జరిగిన విషయం చెప్పాడు.

🌸 నిజానికి అది రాజుగారు దాచిందే. రాజుగారు మొదట ఆశ్చర్యపోయాడు. అతని పద్ధతికి, నిజాయితీకి ముగ్ధుడైపోయాడు. సభలో విషయమంతా వివరించాడు. 

🌿అతనిని ఘనంగా సత్కరించి, ఆ సంచిలోని బంగారు నాణేలకు మరికొన్ని కలిపి అతనికి బహూకరించాడు.
తిట్టుకోవడమో లేక ఇతరులకు పురమాయించడమో కాదు.

🌸 సవాలో లేక సమస్యో వచ్చినప్పుడు... భయపడిగానీ, నిర్లక్ష్యంతో గానీ వదిలేయకూడదు. దాని పరిష్కారానికి స్వయంగా పూనుకోవాలి.

🌿సమస్య అనే బండరాయి కింద అవకాశమనే బంగారు మూట ఉండొచ్చేమో!_💰💰..స్వస్తీ..🚩🌞🙏🌹🎻

🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

No comments:

Post a Comment