Friday, March 15, 2024

మౌనమే జ్ఞానం

 మౌనమే జ్ఞానం

!  ఆధ్యాత్మిక  రంగంలో ఒక గురువు  ఉంటాడని,  లేక ఉండాలని ఆయన చుట్టూతా కొందరు  శిష్యలు గుమిగూడి ఉంటే ,  ఇక  ఆగువుగారు ఏదో ప్రభోదిస్తుంటాడన్నది-- మనకు సాధారణంగా  అగుపంచే దృశ్యం. శ్రీరామకృష్ణులూ, శ్రీరమణులు, శ్రీ సత్యసాయిబాబావారలూ ఇలా ప్రభోదించక పోలేదు. కానీ  ఇట్లా వాక్కుతో  చేసే ప్రబోధాలకన్నా మౌనంలో వీరు  చేసిన ప్రబోధమే ఎక్కువ. ముఖ్యంగా  భగవాన్ రమణులు  మౌన ప్రబోధాన్ని గురించే  ప్రబోధించారు.! 

! ఇట్లా మౌనాన్ని  ఒక  సాధనంగా  వారు  చెప్పవలసిన అవసరం ఏమి  కలిగినది?
  ఏమార్గాన్ని  అనుసరించినా అంతిమ  లక్ష్యం అయిన '  ఆత్మసిద్ధిని'  పొంటం ఖాయం. కానీ  ఆయామార్గాలు  బహు శ్రమను  కల్గిస్తాయి. ఒక్కొక్కప్పుడు  లక్ష్యంమీద అవిశ్వాసాన్ని కల్గించ వచ్చును. ఈ ప్రమాదం నుండి తప్పించడానికే  భగవాన్ రమణులు ఏమార్గాన్ని కాదనలేదు  -- కానీ  అత్యంత ఋజుమార్గంగా ( సూటి అయిన సరళమయిన  మార్గంగా) ఈ మౌనాన్ని  చూపారు.

శ్రీరమణులది  కోహం ( నేనెవ్వరు)  అన్న విచారణా మార్గం కదా ఈమౌనం అన్న పేరు
కొత్తగా ఎక్కడ నుంచి వచ్చింది? అని. అడగవచ్చు. కోహం- మౌనం రెండూ  ఒక్కటే . కోహం నాలికతోనో,  మనస్సుతోనో చేసే జపం కాదు., కాకూడదు. అందువల్ల  జప భ్రాంతిని పోగొట్టడం  కోసం  మౌనం అని అనాల్సి వస్తున్నది. ప్రబోధించటం అంటే  వేదికలెక్కి ఉపన్యాసాలివ్వటం కాదు.

అలాంటి ఉపన్యాసాలకు  ఒక, గంటో, గంటన్నరో విని, దులుపు కొని  వెళ్ళిపోతారు.
' ఉపన్యాసంవారిని ఏవిధంగానూ ప్రభావితం  చేయదు' ఇంకొకడు  ఒక ముక్త పురుషుని ముందు  జ్ఞాని ముందు కాసేపు కూర్చుంటారు. 
అంతే--  ఆమాత్రం తోనే  జ్ఞాని సన్నిధి అతని జీవిత దృక్పధాన్నే  మార్చేస్తుంది.

ఈ రెంటిలో ఏది ఉత్తమమైనదో చూడమంటారు  భగవాన్!!

"భగవంతుడు, చైతన్యం, మనసు, దేహం ఇవన్నీ క్రమ రూపాంతరాలేనా ?"

భగవంతుడు మనలో చైతన్యంగా, ఆ చైతన్యమే మనలో మనసుగా, ఆ మనసే ఈ దేహంగా రూపుదిద్దుకున్నాయి ! మనసుకి ఒకవైపు ఉన్న దైవం స్థిరాస్తి. అది యుగాలైనా మారదు ! బాహ్యమైన ఈ దేహం చరాస్తి ! జన్మజన్మకి మారిపోతూనే ఉంటుంది !! ఒక జన్మలోనే శిశువుగా ఉన్నప్పటి దేహం వృద్ధాప్యం వరకు ఉండదు. 
నిద్రలో లభించిన శాంతి ద్వారా శక్తిని పొందిన మనసు, మెలకువ రాగానే దైనందిక కార్యక్రమాల కోసం ఆ శక్తిని వినియోగించుకుంటుంది. కానీ ఈ విషయాన్ని గుర్తించే సున్నితత్వం దానికి లేకపోయింది. 
నీటితో స్నానంచేసి రాగానే తిరిగి మట్టిని గుమ్మరించుకునే గజస్నానం లాగానే, మనం రోజు నిద్రలో పొందిన శాంతిని మెలకువలో కోల్పోతున్నాం. 
శాంతిని శాశ్వతం చేసుకునేందుకు సాధన చెయ్యాలి. మనసుకు బాహ్యంలో ఉన్న ఈ దేహం ఎంత స్పష్టంగా తెలుస్తుందో, అంత స్పష్టంగా తనలోని దైవాన్ని తెలుసుకునే వరకు మనస్సుకు సాధన అవసరం !

'దైవానికి, దేహానికి మనసే వారధి !'

No comments:

Post a Comment