Friday, March 15, 2024

*****ఇదే మన జన్మరాహిత్యం

 *ఇదే మన జన్మరాహిత్యం*

1  నీ మనస్సుకు సన్మానాలు కావాలి.

2  నీ మనస్సుకు భోగ విలాసాలు కావాలి అప్పు చేసిన సరే.

3  నీ మనస్సుకు ఎవరో నీ దేహాన్ని గుర్తించడం కావాలి..

4  నీ  మనస్సు ఎవరైనా పొగుడితే ఆనందిస్తుంది.

5  నీ మనస్సు కోరిక తీరగానే మొఖం చాటేచేస్తుంది
మళ్లీ అటు  చూడనన్నా చూడది.

6  .నీ మనస్సు నిరంతరం క్రొత్త దాన్ని కోరుకుంటుంది.

7  జైల్లో ఉన్నవారంతా మనసు చెప్పినట్లు చేసినవారే.

8  హాస్పిటల్లో ఉన్నవారంతా మనస్సు ఏది తినమంటే అది తిన్నావారే.  ఏది తాగమంటే  తాగినవారే.

9  మీరు మనస్సు చెప్పినట్లు చేస్తున్నారా.  లేక మీరు చెప్పినట్లు మనస్సు చేస్తుందా.

10  మీరు మనస్సును గెలిస్తే ఋషులవుతారు
ఒకవేళ మనసే మిమ్మల్ని గెలిస్తే మీరు ఏమౌతారో.

11  నీ మనసే బంధానికి మోక్షానికి కారణం.

12  జీవుడు అన్ని ఉంటే సుఖంగా  
ఉంటాను అంటాడు.

13  ఆత్మ అన్ని విడిచి పెడితే సుఖంగా ఉంటాను అంటుంది.

14  మనసు ఏది పట్టుకున్న బంధమే. మనసు అన్ని విడిచిపెట్టడం మోక్షం.

15  నీ జీవితమంతా అయితే ఇంకొకరిలా ఉండడం లేకుంటే ఇంకొకరికి నచ్చే విధంగా ఉండడం.
నీవు నీలాగా మాత్రం ఉండవు.

16  నీ మనసు ఎప్పుడు నిన్ను ఖాళీగా ఉండనివ్వదు ఎప్పుడు ఏదో ఒకటి చేయమని ప్రోత్సహిస్తుంది.

17  మీరు మీ సమస్యలు ఇతరులకు చెప్పాలని చూడకండి ఎందుకంటే వారికే  అనేక సమస్యలు ఉన్నాయి.

18  ఏదైనా తగిలించుకునే వాడు జీవుడు. అన్నిటినీ వదిలించే వాడు ఈశ్వరుడు.

19  మీరు నిరంతరం మనస్సును గెలిపించేందుకు  మీరు ఓడిపోతున్నారు.

20  మీ మనస్సు ఏది కోరితే అది క్షణాల్లో తెచ్చి పెడుతున్నారు ఒక సర్వర్ లాగా.

21  మీ మనస్సు ముందు పోయి మిమ్మల్ని వెనకాల రమ్మంటుంది ఎక్కడికైనా సరే మీరు ఏ మాత్రం ఆలోచించకుండా మనసు చెప్పినట్టు చేస్తున్నారు.

22  నీ మనస్సు నీతోని దొంగతనం చేపిస్తుంది వ్యభిచారం చేపిస్తుంది అబద్ధం అడిపిస్తుంది చేయకూడని పనులు చేయిస్తోంది చివరికి జైల్లో పెట్టిస్తుంది.

23  నీ మనస్సు నీతోని  అన్ని చేయిస్తుంది ఆది చేపించిన పనులన్నీ రివర్స్ అయినప్పుడు నిన్ను ఆత్మహత్యచేసుకొమ్మటుంది  దానికి కూడా మీరు వెనకడరు.

24  మీ జీవితాలన్నీ మనసుకు వదిలేశారు ఇక అది చేయించిందే  ఆట పాట కష్టం సుఖం నష్టం దుఃఖం చావు.

25  చంచలమైన మనస్సుకే జ్ఞాన బోధ అవసరముంటుంది.

26  మనస్సు స్థిరం ఐతే మీరు ధ్యానానికి రెడీ అయినట్లే.

27  మీకు ఇతరుల  నుండి పనులు జరగాలంటే ఎదుటివారి మనసులో ఏముందో కనిపెట్టండి  మనిషితో  పని లేదు మనస్సుతోనే పని.

28  మీరు ఎదుటివారి మనసును వశం చేసుకుంటే మనిషితో
పని లేదు.

20  ముందు మనస్సు విరక్తి చెంది చనిపోతేనే  మనిషి ఆత్మహత్య చేసుకుంటున్నారు.

30  మనిషి మాట్లాడేది నిజం కాదు ఆ మనిషి మనస్సులో ఏముందో  అదే నిజం.

31  మనిషి ని నమ్మకండి వారి మనస్సునే నమ్మండి.

32  పిచ్చి వారు మనస్సు చెప్పినట్లే తు.చ తప్పకుండా చేస్తూ ఉంటారు.

33  పోయిన జన్మలోని విపరీతమైన ఒక కోరిక ఉంటే ఆ కోరిక ఈ జన్మలోతీరగానే మరణిస్తున్నారు
ధనం కావచ్చు. పదవి కావచ్చు. గృహము కావచ్చు.ఇంకా ఏదైనా కావచ్చు.

34  మళ్లీ జన్మించడానికి ఈ జన్మలో ఒక కోరికతో చనిపోయి ఆ కోరిక తీర్చుకోవడానికి మళ్లీ జన్మ తీసుకుంటున్నారు.

35  అహంకారిని ఎవరు ఏమి అనే అవసరం లేదు ఎందుకంటే వారి ఆకారమే వారిని నాశనం చేస్తుంది.

36  మూర్ఖుడిని ఎవరు ఏమి చేసే అవసరం లేదు ఎందుకంటే వాడి మూర్ఖత్వమే వారిని నాశనం చేస్తుంది కనుక.

37  శారీరక సుఖాలు అనుభవించే వారిని చూసి మీరు బాధపడకండి వారి సుఖాలు వారి రోగాలుగా మరి హింసిస్తున్న ప్పుడు మాకు సుఖాలు లేనిదే నయం అనిపించే టైం వస్తుంది.

*25 సంవత్సరముల వరకు  గురుకుల వాసము.  25 నుండి 50 సంవత్సరముల వరకు గృహస్తు సంసార  జీవనం గడపాలి.*

*50 నుండి 75 సంవత్సరముల వరకు వానప్రస్త జీవనం గడపాలి.  75 సంవత్సరాల నుండి సన్యాసం తీసుకుని జీవనం గడపాలి.*

 కానీ మనిషి పుట్టినప్పటినుండి చనిపోయే వరకు సంసార జీవనం గడుపుతున్నారు.

   

No comments:

Post a Comment