[6/29, 12:57] +91 79819 72004: *🤘నేటి సుభాషితం🤘*
*చెబితే మర్చిపోతాను. బోధిస్తేగుర్తుపెట్టుకుంటాను. నన్నూభాగస్వామిని చేస్తే(ఇన్వాల్వ్) నేర్చుకుం టాను'.*
*--బెంజిమిన్ ఫ్రాంక్లిన్*
[6/29, 12:57] +91 79819 72004: *💎నేటి ఆణిముత్యం💎*
నీళ్ళమునగనేల? నిధులబెట్టగనేల?
మొనసి వేల్పులకును మ్రొక్కనేల?
కపటకల్మషములు కడుపులోనుండగా
విశ్వదాభిరామ వినురవేమ!
*భావం:-*
కడుపులో కపటము, కల్మషము పెట్టుకుని దానధర్మాలకని డబ్బు నిల్వచేసి, పుణ్య స్నానాలు చేసి, దేవునికి మొక్కినంత మాత్రాన ప్రయోజనము ఉండదు. ఎటువంటి చెడు ఆలోచనలు లేని మంచి మనసుతో దేవుని తలచుకుంటే చాలు.
[6/29, 12:58] +91 79819 72004: *👭 నేటి చిన్నారిగీతం 👫*
*🌾అన్నదాతలు🎋*
బాలల్లారా రారండి
పల్లెటూరును చూద్దాము
పంట పొలాలకు వెళదాము
రైతుల కష్టం చూద్దాము
రైతులు పొలము దున్నేరు
చాలుకు విత్తనమేసేరు
చంటిపాపలా పెంచేరు
పైరును చూసి మురిసేరు
చీడ పీడలను చంపేరు
కలుపు మొక్కలు పీకేరు
నాలుగు నెలలు కష్టపడేరు.
బంగరు పంటలు పండించేరు.
ఎండకు ఎండి వానకు తడిసి
మనందరి ఆకలి తీర్చడానికి
తిండి గింజలను పండిస్తారు.
మనకు అన్నదాతలవుతారు.
సండే పొలము పోదాము
చేలో పనులను చేద్దాము
పని విలువ తెల్సుకుందాము
రైతులను గౌరవిద్దాము
*•రచన : ఆవుల చక్రపాణి యాదవ్,99633 50973*
[6/29, 12:58] +91 79819 72004: *🗣నేటి జాతీయం🤔*
*చేతులు కట్టుకోవటం*
విధేయతతో ప్రవర్తించటం, అణిగి ఉండటం. పని లేక పోవటం. ( పని లేక పోవడం::: అనే అర్థంలో ఈ జాతీయాన్ని ఇలా వాడుతారు. అలా చేతులు కట్టుకుని కూర్చోక పోతె ... వచ్చి వాళ్లకు సాయం చేయవచ్చు గదా )
[6/29, 12:58] +91 79819 72004: *🤠 నేటి సామెత 🌸*
*అంతంత కోడికి అర్థశేరు మసాలా*
ఒక వస్తువును పొందుటకు దాని యొక్క వాస్తవమయిన విలువ కన్నా ఎక్కువ ఖర్చుచేసి ఆ వస్తువును సొంతం చేసుకొనేవాడిని ఉద్దేశించి ఈ సామెతను వాడతారు.
[6/29, 12:58] +91 79819 72004: 🧡🤍💚🔻🧡🤍💚
*పక్షపాతి - అరవ విస్సు*
శ్యామ్ మాస్టారు పెదలంక గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో గత 5సం" పనిచేస్తూ అన్నిరంగాలలో పాఠశాలను తీర్చిదిద్దారు. ఆయన ఒక యూనియన్ లో చురుకుగా పాల్లోని, టీచర్స్ తలలోనాలుక . ఒకసారి ఆయన పాఠశాలకు కొత్తగా వచ్చిన విద్యాశాఖాధికారి భాస్కరరావు వచ్చారు . ఆయన మరో యూనియన్ కు నాయకుడు . "సర్ గత నాలుగు సంవత్సరాలుగా మా పాఠశాలకు నవోదయ కు విద్యార్ధులు ఎంపికవుతున్నారండీ " "అలాగా " "ఈమధ్య జరిగిన డ్రాయింగ్ పోటీలలో మా విద్యార్ధి జిల్లాలో ప్రథమ స్థానం పొందాడండీ "" " హి హి హి అలాగా " అన్నాడు భాస్కరరావు శ్యామ్ ఏం అర్థం కావడంలేదు కనీసం అభినందనలు కూడి చెప్పడం లేదేంటి అని మనసులో అనుకుంటూనంనే " సర్ గతంలో 50మంది విద్యార్ధులుండేవారండీ అందరూ డోర్ టు డోర్ తిరిగి 150వరకు రోల్ పెంచామండీ " " మాస్టారు మీరు ఏం చెప్పినా వింటానండీ ! నమ్మను -ప్రత్యక్షంగా నేను చూస్తేనే నమ్ముతా " అన్నాడు భాస్చరరావు " మీరే కదండీ ప్రత్యక్షంగా అన్నీచూసారు " "ఐనా నమ్మనండీ నా కళ్ళెదురుగా జరిగితేనే నమ్ముతానండీ " శ్యామ్ కు విషయం అర్ధం అయ్యింది ఇతను కులం వస్త్రాలను ధరించి, యూనియన్ కళ్ళజోడుతో చూస్తున్నాడని " అలాగా సర్ ! అంటే ఒలింపిక్స్ లో రన్నింగ్ లో గోల్డ్ మెడల్ పొందినవాడు కూడా వచ్చి ఆ మెడల్ చూపించినా నమ్మరన్నమాట " "అవును " అని నాలుక కరచుకున్నాడు " ఓహో ! మీ ముందు పరుగు పెడితేనే నమ్ముతారన్నమాట సంతోషం మీలాంటి అధికారులే విద్యావ్యవస్థకు భ్రష్టు పట్టడానికి కారణం సర్ " అన్నాడు శ్యామ్ తలవంచుకుని వెళ్ళిపోయాడు భాస్కరరావు సిగ్గుతో కాదు -ఎలా దెబ్బ కొట్టాలా ! అని కష్టపడేవారిని దేవుడూ కొట్టలేడు .
*అంతర్జాల సేకరణ : 𝐒𝐨𝐧𝐭𝐞𝐥𝐚 𝐃𝐡𝐚𝐧𝐮𝐧𝐣𝐚𝐲𝐚*
[6/29, 12:58] +91 79819 72004: *✍🏽 నేటి కథ ✍🏻*
*🐁🐀ఎలుకలు - ఏనుగులు🦣🐘*
*రచన: ఎస్. త్రివేణి, ఎనిమిదవ తరగతి, ప్రకృతిబడి, చెన్నేకొత్త పల్లి, అనంతపురం జిల్లా.*
అనగనగా ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలో చాలా రకాల జంతువులు నివసిస్తూ ఉండేవి. ఆ అడవిలో పారే ఒక ఏటి గట్టున పాడుబడిన దేవాలయం ఒకటి ఉండేది. ఆ దేవాలయపు శిథిలాలలో ఒక పెద్ద ఎలుకల గుంపు నివసిస్తూ ఉండేది. అడవిలో ఎలుకలకు తినడానికి కావలసిన రకరకాల గింజలు, విత్తనాలు, కాయలు దొరికేవి. వాటిని కడుపారా తింటూ, అడవిలోని చెట్ల నీడలలో తమ పిల్లలతోపాటు ఆడుతూ, పాడుతూ ఆ ఎలుకల గుంపు చాలా సంతోషంగా కాలం గడిపేది.
ఒక ఎండాకాలంపూట, మధ్యాహ్న సమయంలో, దప్పిక గొన్న ఏనుగుల గుంపొకటి, ఎలుకలు నివాసముండే దేవాలయపు శిథిలాలగుండా, ఏటి వైపుకి నడచి వెళ్ళింది. ఏనుగుల గుంపు రాకను గమనించిన ఎలుకలు కొన్ని, ముందుగానే అక్కడి నుండి పారిపోయాయి. పారిపోలేని పిల్ల ఎలుకలు ఏనుగుల కాళ్ల కిందా, ఏనుగులు వెళ్ళిన కారణంగా పడిపోయిన రాళ్ల కిందా పడి, నలిగి చచ్చిపోయాయి. కొన్ని ఎలుకలకేమో తోకలు తెగిపోయాయి. కొన్నింటికి కాళ్లు విరిగాయి. మరి కొన్నింటికి చేతులు పోయాయి. కొన్నింటికి వాంతులు కూడా అయ్యాయి. మొత్తం మీద ఒక్కసారిగా జరిగిన ఆ సంఘటన ఎలుకల గుంపును కల్లోల పరిచింది.
ఈ విషయమై చర్చించేందుకుగాను ఎలుకల రాజు ఒక సమావేశం ఏర్పాటుచేశాడు. భర్తలను, పిల్లలను పోగొట్టుకున్న ఆడ ఎలుకలు, భార్యలను పోగొట్టుకున్న మగ ఎలుకలు, తల్లిదండ్రులను పోగొట్టుకొన్న పిల్ల ఎలుకలు, గాయాలపాలైపోయిన ఎలుకలు, సమావేశానికి నడవలేక నడుస్తూ ఆలస్యంగా వస్తున్న ఎలుకలు, ఆపదలో ఉన్న తమ మిత్రులకు పరిచర్యలు చేస్తున్న ఎలుకలు, ప్రమాదం నుండి తప్పించుకున్న ఎలుకలు, ఇలా రకరకాల సమస్యలతో ఉన్న ఎలుకల గుంపుతో సమావేశ ప్రాంగణం మొత్తం నిండిపోయింది.
రాళ్ళు మీదపడ్డప్పుడు తన ముందు పళ్ళను పోగొట్టుకున్న ఎలుకల రాజు సమావేశానికి ఆలస్యంగా హాజరయ్యాడు. మాట్లాడలేని పరిస్థితిలోకూడా ఆ రాజు సమావేశాన్ని తన ఉపన్యాసంతో ప్రారంభించాడు ఇలా:
"మిత్రులారా! ఏనుగుల కారణంగా మనకు తీవ్రమైన నష్టం జరిగింది. ఇలాంటి సంఘటన మరోసారి జరిగితే ఇక మనమెవరమూ మిగలమేమో! ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఉండాలంటే మనం ప్రస్తుత నివాసాన్ని ఖాళీ చేసి అయినా వెళ్ళిపోవాలి, లేకపోతే ఏనుగులైనా ఇక్కడికి రాకుండా చూసుకోవాలి" అన్నది.
"మనమెందుకు ఖాళీ చెయ్యడం? ఏనుగులే ఇక్కడికి రాకుండా చేస్తే సరిపోతుంది" అని చెప్పిందో చిట్టెలుక, తెగిపోయిన తన తోకను తలచుకుంటూ.
"కానీ ఏనుగుల్ని రాకుండా చేయటం ఎలా?" అని ప్రశ్నించింది మరో పిల్ల ఎలుక.
"వెళ్లి ఏనుగులకు మన కష్టాన్ని చెప్పుకుదాం" అన్నది ఒక ముసలి ఎలుక.
"అమ్మో! ఏనుగుల దగ్గరకి వెళ్ళి మాట్లాడటమా? ఎవరు చేస్తారు, ఆ పనిని?" అన్నదో కుర్ర ఎలుక భయంతో వణుకుతూ.
"ఎవరో ఎందుకు? స్వయంగా మేమే వెళతాం" అని చెప్పింది రాజు ఎలుక.
అంతలోనే నీళ్లు తాగడంకోసం ఏనుగుల గుంపు ఏటిగట్టుకు చేరుకున్నది. ఎలుకలన్నీ భయంతో కకావికలయ్యాయి. కొన్నిమాత్రం అక్కడే పొదల చాటున దాక్కున్నాయి. ఆలోగా ఏనుగుల గుంపు మడుగులోకి దిగి స్నానం చేయడం మొదలెట్టింది. అప్పుడు ఎలుకల రాజు ఏటి గట్టుకు పోయి నిలబడి, ధైర్యంగా ఏనుగుల రాజుతో అన్నది "గజోత్తమా! మీరు దేవాలయ శిథిలాల దారిన వచ్చిన కారణంగా మాకు అపారనష్టం వాటిల్లింది. ఆ దారిన కాకుండా మీరు మరో దారిన ఏటికి రావచ్చుకదా?" అని అడిగింది.
ఒక్క నిమిషం అలోచించిన ఏనుగులరాజు, ఎలుక మాటలకు బదులిస్తూ "మీరు చెప్పింది నిజమే. మేము పాడుబడ్డ శిథిలాల దారిన వచ్చినా ఒకటే; మరో దారిన వచ్చినా ఒకటే. భవిష్యత్తులో మరెప్పుడూ మీకు ఇబ్బంది కలిగించం. నిశ్చింతగా జీవించండి" అని చెప్పింది. అందుకు కృతజ్ఞతలు చెప్పి ఎలుకల రాజు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఎలుకలన్నీకూడా సంతోషంతో పండగ చేసుకున్నాయి.
కొన్నాళ్ళు గడిచాయి. అడవిలోని ఏనుగులను పట్టుకోవడానికి కొందరు వేటగాళ్లు గోతులు త్రవ్వి, వలలు పన్నారు. చాలా ఏనుగులు వలల్లో చిక్కుకొన్నాయి. దొరికిన ఏనుగులను పెద్ద పెద్ద తాళ్లతో కట్టేశారు వేటగాళ్ళు. అయితే, అప్పటికే చీకటిపడ్డది. చీకటిలో ఏనుగులను కదిలించటం కష్టం. కనుక తెల్లవారాక వద్దామని వాళ్లు బసలకు వెళ్ళిపోయారు. ఏనుగుల అరుపులు విన్న ఎలుక ఒకటి అక్కడికి పోయి చూసింది. పరుగున వెళ్ళి తన మిత్రులందరినీ సాయానికి తోలుకొచ్చింది. ఎలుకలన్నీ కలసి తాళ్లను కొరికి పారేశాయి. ఏనుగులను పెద్ద ప్రమాదం నుండి కాపాడాయి. ఏనుగులు ఎలుకలకు కృతజ్ఞతలు చెప్పుకొన్నాయి.
చిన్న చిన్న ప్రాణులుకూడా గొప్ప సాయం చేయగలవు.
[6/29, 12:58] +91 79819 72004: *☑️ తెలుసుకుందాం ✅*
*🛑ఫ్రిజ్ తలుపు తెరిస్తే గది చల్లబడుతుందా?*
❇️రెఫ్రిజరేటర్ తలుపును తెరిచి ఉంచితే గది చల్లబడదు సరి కదా అంతకు ముందు కన్నా వేడెక్కుతుంది. రెఫ్రిజరేటర్లో సులభంగా ఆవిరయ్యే ఫ్రియాన్ అనే ద్రవ పదార్థాన్ని బోలుగా ఉండే సన్నని తీగ చుట్టల ద్వారా ప్రవహింపచేస్తారు. ఈ ద్రవాన్ని 'రెఫ్రిజరెంట్' అంటారు. ఈ ద్రవం ఫ్రిజ్లో ఉండే పదార్థాల వేడిని గ్రహించి ఆవిరిగా మారుతుంది. ఫ్రిజ్లో చల్లదనాన్ని కలుగచేస్తుంది. ఆవిరిగా మారే ఫ్రియాన్ తిరిగి ఫ్రిజ్లో ఉండే కండెన్సర్లో పీడనానికి గురయి, మళ్లీ ద్రవంగా మారుతుంది. ఇది తిరిగి ద్రవరూపాన్ని పొందేటపుడు అది అంతకు మునుపు ఫ్రిజ్లో గ్రహించిన వేడి ఫ్రిజ్ వెనుక భాగం నుంచి బయటకుపోతుంది. ఇపుడు ఫ్రిజ్ తలుపును తీసి ఉంచితే ఈ వేడి ఫ్రిజ్ వెనుక భాగం నుంచి కాకుండా విశాలంగా ఉన్న ముందు భాగం నుంచి బయటకు రావడంతో గది వేడెక్కుతుంది.
No comments:
Post a Comment