*🚩 ┈┉┅━❀ ॐ ❀━┅┉┈ 🚩*
*అనగనగా...*
దేవుడు ఒకడి భక్తికి మెచ్చి “ నీకు ఏవరం కావాలో అడుగు” అన్నాడు.
ఆ భక్తుడు “స్వామీ! నువ్వు నన్ను కాపాడుతూ, ఎప్పుడూ నాతోనే ఉండాలి” అన్నాడు.
“ భక్తుడిని రక్షించడమే భగవంతుడి పని, తప్పక నీతోనే ఉంటాను “ అని మాట ఇచ్చాడు.
భక్తుడు పొంగిపోయాడు.
ఒకసారి సముద్ర తీరంలో భక్తుడు నడుస్తూండగా, ఒక పులి అతని వెంటపడింది. భక్తుడు భయంతో పరుగులు పెట్టాడు. అంతవరకూ భక్తునితో, భగవంతుడు కూడా నడుస్తున్నట్లుగా ఇసుకలో కాలి గుర్తులు కనిపించేవి. పులి తరమడం మొదలెట్టాక భగవంతుడి కాలి గుర్తులు మాయమైపోయాయి. కొంతసేపటికి పులి వెళ్లిపోయింది. అప్పుడు భగవంతుని కాలి గుర్తులు కనిపించడం మొదలుపెట్టాయి. “ ఇదేం అన్యాయం స్వామీ! పులి నన్ను తరిమినంతసేపూ నీ కాలిగుర్తులు మాయమైపోయాయి. నా కాలిగుర్తులు మాత్రమే కనిపించాయి. ఎక్కడికి పారిపోయావు “ అని అడిగాడు. దానికి సమాధానంగా భగవంతుడు “ నువ్వు నీకాలి గుర్తులు అనుకునేవి నీ కాలి గుర్తులు కావు, ఆ గుర్తులు నావి, అప్పుడు పులినుండి రక్షించడానికి రెండుచేతులతో నిన్ను ఎత్తుకున్నాను” అని నవ్వుతూ చెప్పాడు.అది భగవత్ తత్వం.
*🚩 ┈┉┅━❀ ॐ ❀━┅┉┈ 🚩*
No comments:
Post a Comment