*ప్రపంచంలో ఐదు రకాలుగా బంధాలు నిర్వీర్యం అవుతున్నాయి.*
*#మొదటి_రకం.. భార్యకైనా.. భర్తకైనా..*
*తప్పు చేస్తే తల్లిదండ్రులు మన పిల్లే కదా,మన పిల్లాడే కదా అని మనసుకి ఎలా సర్దిచెప్పుకుంటారో..,,*
*మనకు ఎలా సర్ది చెప్తారో..,,*
*ఆ తప్పులను ఎలా సరిదిద్దుతారో..,,*
*అలానే ఉండాలి. జన్మనిచ్చిన తల్లిదండ్రులు*
*certain period వరకే మనతో ఉంటారు.*
*వాళ్ళు ఎల్ల కాలం మనతో ఉండలేక*
*పిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తారు.*
*మనకి ఒక కుటుంబం,బాధ్యత తెలిసేలా*
*ఒక ప్రణాళిక ప్రకారం జరిపిస్తారు.కానీ మనమేమో చిన్న చిన్న విషయాలను*
*పెద్దవిగా చేసి సర్దుకోలేక,భరించే ఓపిక లేక హత్యలు,ఆత్మహత్యల వరకు తెచ్చుకుంటున్నాం.*
*#రెండవ_రకం కొన్ని బంధాలు ఎలా ఉంటాయంటే..,,*
*తప్పు ఒకరి వైపే ఉంటుంది.*
*ఇంకొకరు వారి తప్పులను భరిస్తూ,క్షమిస్తూ..,,*
*బంధాన్ని నిలుపుకోడానికి అన్నీ అడుగులు తామే వేస్తూ బంధాన్ని కాపాడుకుంటూ ఉంటారు.*
*అది ఎంత వరకు!?ఎప్పటి వరకు!?*
*అన్నీ అడుగులు మనమే వేయాలంటే కష్టం కదా!*
*ఎదుటివారు కనీసం ఒక్క అడుగు వేసి..,,*
*అర్ధం చేసుకుంటే మనం వేసే తొమ్మిది అడుగులు పెద్ద భారం అనిపించవు.*
*అలా జరగనప్పుడే అవతలి మనిషిలో బంధంపై అసంతృప్తి,అసహనం,అనాశక్తి పెరిగిపోయి*
*ఫలితంగా కోపం...*
*మెల్ల మెల్లగా కోపం అసహ్యంగా మారి..,,*
*చంపడం,చావడం,విడిపోవడం వంటి*
*దారుణాలకు బీజం వేస్తున్నారు.*
*#మూడవ_రకం..*
*వ్యామోహం.. ధనాశ.. మితిమీరిన సాంకేతికత..*
*రీల్స్ పిచ్చి..కామ పిచ్చి..ఫ్యాషన్ పిచ్చితో..*
*పర పురుషుడు స్త్రీ పై మోజుతో కొందరు*
*తాము మనుషులమనే సంగతి పూర్తిగా మరచిపోయి*
*అనేక దారుణాలకు పాల్పడుతున్నారు.*
*మొగుళ్ళని పెళ్ళాలు..పెళ్ళాలని మొగుళ్ళు చంపేసి*
*డ్రమ్ముల్లో,ఫ్రిడ్జ్* *ల్లో,బీరువాల్లో,సూట్‌కేసుల్లో పెట్టి పార్సెల్ చేస్తున్న వింత* *సంఘటనలు దేశంలో ఇప్పుడు ట్రెండ్ గా మారింది.*
*పెళ్ళి అంటేనే అబ్బాయి అమ్మాయి లో ఒక ఫోబియా ఏర్పడింది.*
*#నాలుగవ_రకం*
*ఇందులో భార్యాభర్తలకు ఎటువంటి విభేదాలు ఉండవు.*
*అమ్మాయి తల్లిదండ్రులు వాళ్ళ కాపురంలో*
*జోక్యం చేసుకోవడం..,,*
*అబ్బాయి తల్లిదండ్రులు అమ్మాయిని*
*సరిగ్గా take care చేయకపోవడం..,,*
*రాబంధుల వంటి బంధువులు చిన్న చిన్న విషయాలను పెద్దవిగా చేసి*
*వారిరువురి మధ్య గొడవలు సృష్టించడం వల్ల..,,*
*అవి చిలికి చిలికి గాలి వానలా ఒకరికొకరు*
*పంతాలకు పోయి ఆఖరికి కొట్టుకోవడం,*
*తిట్టుకోవడం, వీలైతే ప్రాణాలు తీలుకోడానికి కూడా*
*వెనుకాడనంత లోతుగా వెళ్తారు.*
*#ఐదవ_రకం*
*ఇందులో మాత్రం 100 కి 100% మగాడి తప్పే ఉంటుంది.*
*కష్టపడి పనిచేయడు, ఏ జాబ్ లో నిలకడ ఉండదు.*
*వ్యాపారాలు అంటూ భార్య ఆస్తి మొత్తం ఊదేస్తాడు.*
*Life ని మాత్రం అప్పులు చేసైనా సరే luxury*
*గడపడానికి ఆశక్తి చూపుతాడు. మందు, జూదం,సిగిరేట్ లేని అలవాట్లు ఉండవు.*
*ఇంట్లో భార్య, పిల్లల బాధ్యత ఉండదు.*
*వీటికి తోడు ఇలాంటి వెధవలకు అనుమానం కూడా ఉంటుంది.*
*పాపం భార్య తల్లిదండ్రుల కోసమో,సమాజం కోసమో*
*పిల్లల కోసమో భరిస్తూ వస్తుంది.*
*ఏదో ఒకరోజు సహనం కోల్పోయి చంపడమో, చావడమో..,,*
*లేకపోతే వాణ్ణి వదిలేసి ఒంటరిగా పిల్లలకోసం బ్రతుకుతుంది.*
*ఈ ఐదు రకాలలో #రెండవ_రకం,#ఐదవ_రకం చాలా బాధకారమైనది.*
*ఒకరు చేసిన తప్పుకి ఇంకొకరు జీవితకాలం శిక్ష అనుభవించడం.*
*ఏదేమైనా పెళ్ళిచేసుకుంటే వదిలేయకూడదు*
*ఒకవేళ వదిలేసే ఉద్దేశ్యం ఉంటే పెళ్లిచేసుకోకూడదు.*
*నిజంగా అవతలి వారు తప్పు చేసినా*
*క్షమించే గుణం ఉండాలి.*
*ఎందుకంటే బంధం ఇద్దరిది కదా!*
No comments:
Post a Comment