బద్దకాలు దశ విధాలు (వాటికి పరిష్కారాలు):
1. అయోమయం
“నాకు ఏం చేయాలో తెలియడం లేదు.”
పరిష్కారం: ఒక తేలికపాటి పని ఎంచుకోండి.
అనవసర ఆలోచనలు కాకుండా, పని చేయడం ద్వారా స్పష్టత వస్తుంది.
2. భయం
“నేను ఈ పని చేయలేను.”
పరిష్కారం: భయాన్ని అధిగమించిన సమయాలను గుర్తు చేసుకోండి. చిన్న
చర్య ద్వారా ధైర్యం పెరుగుతుంది.
3. అస్థిరమైన మనస్తత్వం
“నేను దీనికి సరిపోనని అనుకుంటున్నాను.”
పరిష్కారం:
ఎదుగుదల ఎప్పుడూ మనం ఇబ్బందిని దాటినప్పుడు మాత్రమే జరుగుతుంది.
4. అలసట
“నాకు అలసట గా ఉంది, శక్తి లేదు.”
పరిష్కారం:
ముందు తక్కువ శ్రమతో చేసే పనిని ఎంచుకోండి.
చిన్న విజయం మీ శక్తిని మళ్లీ పెంచుతుంది.
5. ఆసక్తి లోపం
“ఏం ఆసక్తి ఉందో కూడా తెలియడం లేదు.”
పరిష్కారం:
మీరు ఉత్సాహంగా ఉన్న అంశాలను మళ్లీ గుర్తించండి.
ఆ ఆసక్తిని మీ ప్రస్తుత లక్ష్యాలకు అనుసంధానించండి.
6. పశ్చాత్తాపం
“ఇప్పుటీకే ఆలస్యమైంది.”
పరిష్కారం:
మీరు వెనుకబడలేదని గుర్తించుకోండి.
ప్రతి రోజూ మీకు కొత్త అవకాశాలను అందిస్తుంది.
7. స్వభావ సమస్య
“నేను సజావుగా ఉండే వ్యక్తిని కాదు”
పరిష్కారం:
అది మీ శాశ్వత స్వభావం కాదు.
అది కేవలం ఒక అలవాటు మాత్రమే.
అలవాట్లు మారిపోతాయి, గట్టిగా అనుకుంటే
8. ఒత్తిడి
“నాకు పని చాలా ఎక్కువగా ఉంది.”
పరిష్కారం:
ఒకే పనిపై మాత్రమే దృష్టి పెట్టండి.
సరళతలోనే పురోగతి ఉంటుంది.
9. దృష్టి భంగం (ఫోకస్ లేకపోవడం)
“నేను కాసేపు ఫోన్ చూడాలి…”
పరిష్కారం:
ఆకర్షణలపై పరిమితులను విధించుకోండి.
స్పష్టమైన ఉద్దేశ్యం, మనసుకు నియంత్రణ కల్పిస్తుంది.
10. సౌలభ్యం కోరుకోవడం
“ఇక్కడే బాగుంది.”
పరిష్కారం:
మన వృద్ధి సౌకర్యాల్లో ఉండదు,
తదుపరి అవకాశాలను పొందడానికి అసౌకర్యాన్ని కూడా స్వీకరించండి.
వీటిని ప్రతిరోజూ 1% మెరుగుదల కోసం కృషి చేయండి.
ఇలా, మీరు ఏ రకం అలసట అనే బద్ధకంలో ఉన్నారో తెలుసుకొని, దానికి సరైన పరిష్కారాన్ని వెతకండి
No comments:
Post a Comment