స్వాతంత్రం తర్వాత సినిమా రంగం ‘‘భారతీయత’’ కోల్పోయింది : నంద కుమార్
స్వాతంత్రానికి ముందు సినిమాలో వున్న భారతీయత, స్వాతంత్రం సిద్ధించిన తర్వాత సినిమా రంగం భారతీయతను కోల్పోయిందని ప్రజ్ఞా ప్రవాహ్ అఖిల భారతీయ సంయోజక్ నందకుమార్ అన్నారు. దాదాసాహెబ్ ఫాల్కేతో సహా 1947 కి ముందు నిర్మించిన సినిమాలు విదేశీ చిత్రాల నుంచి ప్రేరణ పొంది వుండొచ్చు కానీ... మన సంస్కృతికి అనుగుణంగానే స్వీకరించారని వివరించారు. ఇందుకు చాలా చిత్రాలను ఉదాహరణగా స్వీకరించవచ్చన్నారు.
ఫాల్కే లాంటి వారు సినిమాలో భారతీయతను ఎలా చొప్పించాలో, ఎలా వ్యక్తం చేయాలో బాగా ఆలోచించేవారని అన్నారు. నేటి కాలంలో బలమైన సాంస్కృతిక గుర్తింపు వున్న సినిమాలు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయని, ఆర్థిక విజయాన్ని కూడా పొందుతున్నాయన్న విషయాన్ని దాదాసాహెబ్ గమనించారన్నారు.
కొందరు భారతీయత అన్న అంశం అత్యంత సంకుచిత భావం వున్న అంశంగా చిత్రీకరిస్తున్నారని, అలాంటి అపోహలను కూడా వ్యాప్తి చేస్తున్నారని మండిపడ్డారు. భారతీయత అంటే అన్నింటినీ స్వీకరించడం అని వివరించారు. ప్రపంచంలోని మంచితనాన్ని స్వాగతించాలన్న విషయాన్ని భారతీయులు ఎప్పుడూ విశ్వసిస్తూనే వుంటారన్నారు. ఈ నేల మన తల్లి అని మన వేదాలు ప్రకటించాయని నంద కుమార్ పేర్కొన్నారు. మన తల్లి భారతమాత అని అన్నారు. అయినా.. కొందరు భారత మాతను పూజించొద్దంటూ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
అయితే.. కేరళలో భారతీయత నేపథ్యమున్న సినిమాలను ప్రదర్శించవద్దన్న ఆదేశం వుందని వెల్లడించారు. దీనిని పెడచెవిన పెడుతూ ప్రదర్శించినట్లయితే.. ఆ థియేటర్లను ధ్వంసం చేసే ప్రమాదం వుందని హెచ్చరించారు.
No comments:
Post a Comment