మనలో చాలామంది నేనొక్కడిని
ఏమి చేయగలను అంటూ ఉంటారు.
ఎప్పుడయినా మొదలు పెట్టేది ఒక్కరే!
మొదటి అడుగే వేయి మైళ్ళ ప్రయాణానికి నాంది. మనం ఏదయినా మొదలుపెట్టగానే,
కొంతమంది విమర్శిస్తారు, నిరుత్సాహ పరుస్తారు, వెనక్కు లాగుతారు, దూరంగా వెళతారు, కొంతమంది వెన్ను తట్టి ప్రోత్సాహస్తారు. తరువాత నెమ్మదిగా పరిశీలిస్తారు, విజయం సాధించాగానే అభినందిస్తారు, వెన్ను తడతారు, మేమున్నామంటూ వెంట నడుస్తారు.
ఇలా మొదలు వెన్ను తట్టి నిలబడ్డవారు
మన మనసులో స్థానం సంపాదిస్తారు.
అయితే విమర్శించిన ప్రతివారు శత్రువులు కారు. అందులో మన మంచి కోరేవారూ ఉంటారు. రెచ్చగొట్టి ముందుకు పంపేవారూ ఉంటారు. వెన్ను తట్టడమే కాదు,
వెన్నుపోటు పొడిచేవరూ ఉంటారు.
వీరందరిని తట్టుకుని సముద్రం ఆవలి ఒడ్డుకు చేరుకొని, తిరిగి వీరి దరికి చేరడమే ధీరుల లక్షణం.విమర్శలకు పారిపోవడం పిరికివాళ్ళ లక్షణం.
చరిత్రలో విజయం సాధించిన సంఘటనలు
ఎక్కడ చూసినా, మొదలు పెట్టింది ఒక్కరే!
ఛత్రపతి శివాజి, రాణి రుద్రమదేవి, రాణాప్రతాప్, గాంధీ, అబ్రహం లింకన్, మండేలా, అల్లూరి, గురజాడ, వీరేశలింగం, శ్రీ శ్రీ, ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ నుండి నేటి మోడీ వరకు.
నువ్వు పని చేసే సంస్థ నిన్ను చూసి పెరిగేట్టుగా చేయచ్చు.నీ ప్రవర్తన చూసి నీతో స్నేహం, కిరాణా కొట్టు, దేవుని గుడి, పాఠశాల, పత్రిక...
ఇలా ఏ రంగము తీసుకున్నా వ్యక్తి యొక్క కృషి, విజయం అనేకమందికి మార్గదర్శకము అవుతుంది. వ్యక్తి శక్తిగా మారాలి. అదే ఒక వ్యవస్థగా మారుతుంది. కొన్ని వేలమందికి స్ఫూర్తిగా నిలుస్తుంది. కావలిసిందల్లా ఓపిక, సహనం, నిరంతర శ్రమ, క్రమశిక్షణ.
చరిత్రను అనుకరించడం కాదు,
చరిత్ర సృష్టించుదాం మిత్రులారా !
సేకరణ మీ రామిరెడ్డి మానస సరోవరం 👍👏
No comments:
Post a Comment