Thursday, June 12, 2025






 🧘‍♂️🧘‍♂️ *సత్సాంగత్యం:* 🧘‍♂️🧘‍♂️

*సజ్జన సాంగత్యం, సత్సంభాషణం, సత్కర్మాచరణం ఇవే మనలోని ధార్మిక ప్రవృత్తిని దృఢంగా తయారు చేస్తాయి.*

*మంచి స్నేహితులు ఉంటే ఎంతటి దూరమైన ప్రయాణం కూడా దగ్గరే అనిపిస్తుంది. అలాగే సజ్జన సాంగత్యం వల్ల జీవన ప్రయాణం ఆహ్లాదంగా ఉంటుంది.* 

*సజ్జన సాంగత్యం అనేది సుగంధ పరిమళ ద్రవ్యాల వంటిది. వీటి వద్దకు వెళితే చాలు, ముట్టుకున్నా, ముట్టుకోక పోయినా సువాసన మనకు అంటుకుంటుంది.*

*అందుకే మానవ జన్మ పొందిన మనం నిరంతరం సజ్జన సాంగత్యం కలిగి ఉండాలి.*         
                       
🪷🙏🏻🪷🙏🏻🪷

No comments:

Post a Comment