ఎలుక రాతిది అయితే పూజిస్తాం,
ముషిక రాజా అంటూ కీర్తిస్తాం,
అదే ఎలుక ప్రాణాలతో మన ఇంట్లో తిరుగుతూ ఉంటే తరిమేస్తాం.
పాము రాతిది అయితే నాగరాజా అంటూ పూజలు చేస్తాం, పాలు పోస్తాం..
అదే పాము ప్రాణాలతో ఉంటే కొట్టి చంపేస్తాం .
తల్లిదండ్రులు ఫోటోల్లో ఉంటే దండవేసి దండం పెడతాం,
ప్రాణాలతో ఉంటే వృద్ధాశ్రమంలో ఒదిలేస్తం ..
బ్రతికున్నప్పుడు పట్టేడన్నం పెట్టడానికి ఒంతులుసుకుంటాం,
చనిపోయాక పంచభక్ష్య పరమన్నాలు ఫోటోల ముందు పెట్టి తిను, తిను అంటూ ఏడుస్తాం...
కాదు, కాదు నటిస్తాం..
తోడబుట్టినోడు చనిపోతే ఈ రోజు దినం ఖర్చు నాది అని ఒకరు,
పాడే ఖర్చు నాది అని ఇంకొకడు పోటీపడతారు..
అదే తోడబుట్టినోడు హాస్పిటల్ లో ఉన్నప్పుడు
ఈ రోజు హాస్పిటల్ బిల్లు నాది,
నేను భరిస్తా అని ఒక్కడూ అనడు..
చనిపోయిన వాడికి ( శవానికి ) భుజాన్ని అందించడానికి పోటీ పడతాం,
బ్రతికి ఉన్న వాడికి చేయూతను మాత్రం ఇవ్వం .
రాయిలో దైవత్వం వుందని తెలుసుకున్నాం .
కానీ మనిషి లో మానవత్వాన్ని గుర్తించలేక పోతున్నాం .
జీవం లేనివాటిపై భక్తి ఎందుకు..?
ప్రాణంతో ఉంటే ద్వేషం ఎందుకు..?
నాకైతే అర్ధం కావడం లేదు..
సాటివాడిపై ప్రేమని పంచలేని నువ్వు దేవుడిని ఏం పూజిస్తావ్ నేస్తమా.....
దేవుడు ఆలయంలోనే ఉంటాడనుకునేవాడు మూర్ఖుడు..
వాడు ఏనాటికీ దైవాన్ని చూడలేడు, ఆయన కృపకి పాత్రులు కాలేడు...
ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టడం,
ఆ పరమాత్ముడికి నైవేద్యం నివేదించడం కన్నా ఎన్నో రెట్లు గొప్పదని గ్రహించండి..
సాటివారిలో ఆ దేవుడ్ని చూడండి ప్లీజ్ 🙏🏻..
ఇట్లు
మీ
కొండు. అనంతరావు,
శ్రీ చైతన్య విద్యా సంస్థలు,
మియాపూర్ - హైదరాబాద్
9652526858.
🙏🏻🌹🌹🌹శుభరాత్రి 🌹🌹🌹🙏🏻
No comments:
Post a Comment