Monday, June 16, 2025

*    హరి  ఓం  ,                                                                                                                                          *ఓ.. మనిషి.. రాకడ ఎందుకు..? పోకడ ఎందుకు*..? 

           *రాకడ పోకడ యొక్క మర్మము తెలుసుకొని మసులుకో... ఇంతకు.. నీదనేది ఏముంది ఈ లోకాన..?*

            *ఒక్కోసారి నాకు నేనే.. నాలోనే నేను.. నా మనసుకు ఇలా చెప్పుకుంటూ ఉంటాను.*

           *శవయాత్రలో.. పాల్గొంటూ.. రకరకాలుగా వారి గురించి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉంటారు కదా! అదేనండి..*

           *ఇలా చేయకుంటే ఇంకా బ్రతికి ఉంటుండే అని అంటూ ఉంటారు. కానీ, తాను మాత్రం బ్రతికే ఉంటాననే భ్రమను మాత్రం వీడడు.*

               *ఏదో ఒక రోజు నేను కూడా ఇలా శవంగా  మారేదే ఉంది.. చివరికి వెళ్ళవలసిందే.. అనేది  మాత్రం అనుకోరు ఏంటో ఈ విడ్డూరం..*

           *ఓ మనిషి..నాది, నాది అంటూ వెంపర్లాడుతుంటావు... ఇది నాదే..అది నాదే.. ఇదంతా నా కష్టార్జితమే అని విర్రవీగుతావు. ఇంతకు నీదనేది ఏముంది ఈ లోకంలో..?*

            *నీ దేహమే ఒక అద్దె కొంప.. ఏదో ఒక రోజు  ఈ దేహం అనే కొంపను  ఖాళీ చేయక తప్పదు.*

             *నీవే శాశ్వతం కానప్పుడు.. నీ దేహమే బూడిద పాలవుతుంది అని తెలుసుకున్నప్పుడు. నీ కష్టార్జితము అనుకున్న..నీ ఆస్తి ఎక్కడుంటుంది..?*

             *నీ కుటుంబ పరివారము, బంధువులు,  స్నేహితులు, ఆత్మీయులు,  శ్రేయోభిలాషులను చూసి.. ఇంతమంది ఉండగా నాకేమీ లోటు అని సంబర పడతావు కదా!*

         *ఇంతకు నీ పరివారం, బంధుగణం, స్నేహితులు అందరూ నీ చుట్టారా.. ఉండగానే మాయమైపోతావు... నీవనుకున్న వీరందరూ నిన్ను రక్షించారా..?*

          *అద్దెకు తీసుకున్న ఇల్లు యొక్క గడువు ముగిస్తే.. వెంటనే ఖాళీ చెయ్ అంటాడు ఇంటి యజమాని కదా! అలాగే..నాది, నాది అన్న నీ దేహమే నీ మాట వినకుండా నిన్ను బయటకు గెంటేస్తుంది.*

        *అలాంటిది  ఓ.. మనిషి.. కాస్త ఆలోచించు.. ఈ దేహం పై మమకారం ఎలా..?  దేహాభిమానాన్ని వదిలి, మనిషిలాగా మానవత్వంతో  ప్రవర్తించు, మానవత్వాన్ని నర నరాల్లో జీర్ణించుకో..*

           *వారేంటీ , గ్యారెంటీ లేని ఈ దేహాన్ని చూసిమొహమేల..?*

          *అందుకే..నీ ముందున్న భోగాలన్నీ కేవలం నీవు ఉన్నంతవరకు  అనుభవించడానికి మాత్రమే!*

          *ఈరోజు నీది అన్నది రేపు వేరొకడి సొంతం. నీ ముందున్నదంతా మాయేసుమా... ఇదంతా స్వప్నం లాంటిది... క్షణిక సుఖములాంటిది..*

            *స్వప్నంలో ఎన్నో రకాల రాజభోగాలను చవిచూస్తావు, అనుభవిస్తావు. తీరా..కళ్ళు తెరవగానే అన్నీ మాయమవుతాయి.. కదా!*

           *అదేవిధంగా  ఈ లోకంలో నీది అనేది ఏదీ లేదు అంతా నీ భ్రమనే.. అనేది జగద్గురు శంకరాచార్యులు.. సర్వ మానవాళికి హితం పలికారు.*

           *నిజానిజాలు గ్రహించు, మాయ నుండి బయటపడు. మాయల వలలో చిక్కి సతమతం అవ్వకముందే.. జ్ఞానాన్ని గ్రహించు.*

           *ఆధ్యాత్మిక భావాలను అలవర్చుకో.. వీటన్నిటికీ శాశ్వత పరిష్కారం దైవాన్ని తెలుసుకోవడమే..*

            *కేవలం నీ వనుకున్నదే నిజం అనుకుంటే....ప్రపంచాన్ని పాలించిన చక్రవర్తులేరి..? వారే.. సర్వమనుకున్న నీ ఆత్మీయులేరీ..? నీ తాత ముత్తాత లేరి..?*

             *ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచి వెళ్లిన వారే కదా!అలాంటప్పుడు ఏదీ శాశ్వతం. తెలుసుకుంటే.. అంతా ఆశాశ్వతం..*

          *ఇంతకు నీవు ఎన్నాళ్ళు ఉంటావు..? ఏదైనా అగ్రిమెంటు,  లేదా ఇంతకాలం ఉంటా..అనే బాండు ఏదైనా నీ వద్ద ఉందా!  శశిరంగా శాశ్వతంగా ఉంటావా..?*

            *అందుకే.. గర్వము, అహంకారము, చిన్న పెద్ద అనే భేదాన్ని వదిలి ఉన్నంత వరకు అందరికి ప్రేమను పంచు..  ప్రేమతో పలకరించు.ఇదే నీవు మనిషిగా పుట్టినందుకు అంతిమకర్తవ్యం.*

               *ఎందుకంటే, ఏ పిలుపు  ఆఖరిదో.. ఏది చివరిదో.. చెప్పిరాదు. అందుకే నీ పాత్రను అద్భుతంగా పోషించు.. పదిమంది మెచ్చేలా. పదిమందికి నచ్చేలా.. శాశ్వతంగా ప్రతి హృదయంలో జీవించు.*  .............

Sekarana

No comments:

Post a Comment