*27 జూన్ 2026*
*ఈ రోజు ఆలోచన*
సత్యాన్వేషణ మీ దినసరి ఆధ్యాత్మిక క్రమశిక్షణ కావాలి. ప్రతి క్షణం ఈ ప్రధాన కర్తవ్యం కోసమే వినియోగించాలి. తపస్సు మీ బుద్ధిని శుద్ధి చేసినప్పుడు మాత్రమే సత్యం మీ జ్ఞానంలో ప్రతిబింబిస్తుంది.
తపస్సు అంటే ఉన్నతమైన ఉద్దేశాలతో చేసే అన్ని కర్మలు; ఆత్మ కోసం తపించే అన్ని చేష్టలు; గతంలో చేసిన తప్పులకు పశ్చాత్తాపపడటం; సద్గుణం, ఆత్మనిగ్రహం పట్ల దృఢ సంకల్పం; మరియు జయాపజయాలలో సమత్వాన్ని దృఢంగా పాటించడం. తపం అంటే తాపం, దహించడం, తీవ్రత, కృషి యొక్క నిష్ఠ. తపస్సే వైరాగ్యాన్ని, క్రమశిక్షణను పెంపొందిస్తుంది.
ప్రస్తుతం దారి తప్పించే ప్రలోభాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి ఈ క్రమశిక్షణ అత్యవసరం. ఈ కలియుగంలో, మానవుని మనస్సును చీకటి కమ్ముకుంటున్నప్పుడు, అడుగులు వేయడానికి దారి చూపే ఏ చిన్న దీపమైనా స్వాగతించదగినదే. అందుకే మీరు సత్కర్మ, సదాచారం మరియు సత్ప్రవర్తనను ఆశ్రయించమని నేను సలహా ఇస్తున్నాను. అంటే మంచి పనులు, మంచి నడవడిక మరియు మంచి దృక్పథం. దాని ద్వారా మీరు భగవంతుని నిత్య సాన్నిధ్యంలో స్థిరపడగలరు.
మీరు ఉన్నతమైన మాటలను "వినడానికి" అంటే శ్రవణం చేయడానికి కూడా కృషి చేయాలి. ఆత్మ ప్రబోధించే వాటిని మననం చేసుకోవాలి. ఆ తర్వాత, వాటి సత్యాన్ని గుర్తించినప్పుడు, గాఢమైన భక్తితో దానిని నిధిధ్యాసనం చేయాలి, అంటే ధ్యానించాలి.
ఇతర కార్యకలాపాలన్నీ ద్వితీయమైనవే. ఇది మాత్రమే ఉన్నతిని కలిగించేది; ఇది మాత్రమే ప్రయోజనకరమైనది.
- దివ్య ఉపన్యాసం, నవంబర్ 23, 1965
No comments:
Post a Comment