Thursday, July 2, 2026

నీ DEPRESSIONకి అసలు కారణం నీ కష్టాలు కాదు. నీ DIVIDED MINDSET | 2 BOWLS STORY || PRATIKULA VEDAM

నీ DEPRESSIONకి అసలు కారణం నీ కష్టాలు కాదు. నీ DIVIDED MINDSET | 2 BOWLS STORY || PRATIKULA VEDAM

Author Name:PRATIKULA VEDAM

Youtube Channel Url:https://www.youtube.com/@pratikulavedam

Youtube Video URL:https://www.youtube.com/watch?v=YrM4hsZH6r8



Transcript:
(00:00) ఒక ఊర్లో ఇద్దరు వ్యక్తులు ఉండేవారు. ఇద్దరికీ రోజు ఒకే రకమైన భోజనం దొరికేది. అందులో కొంచెం తీపు ఉండేది కొంచెం చేదు ఉండేది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మొదటి వాడి దగ్గర రెండు గిన్నెలు ఉన్నాయి రెండో వాడి దగ్గర ఒక్కటే గిన్నె ఉంది. ఆ రెండు గిన్నెలు ఉన్నవాడు మహా తెలివైనోడిలాగా ఫీల్ అయిపోయి తన దగ్గర ఉన్న రెండు గిన్నెలని వాడి ఆ ఫుడ్ లో తీపిగా ఉన్నదాన్ని ఒక గిన్నెలోకి చేదుగా ఉన్నదాన్ని ఇంకో గిన్నెలోకి సెపరేట్ చేసేవాడు.
(00:29) ఎందుకంటే వాడికి కేవలం రుచి ముఖ్యం. కానీ ఒక్కటి గిన్నె ఉన్న రెండోవాడు మాత్రం తన దగ్గర ఉన్న ఒక్క గిన్నెలోనే తీపిని చేదుని కలిపేసి ఏదవస్తే అది అని ప్రశాంతంగా తినేసేవాడు. వాడికి రుచి గురించి పట్టింపే లేదు. వాడికి కావలసింది కేవలం పోషణ మాత్రమే అయితే కాలం గడుస్తున్న కొద్ది ఇద్దరు ఒకే ఫుడ్ తింటున్నారు కానీ విడదీసి తింటున్న మొదటివాడు రోజు రోజుకి కృషించిపోయి ప్రాణాలు కోల్పోయే స్థితికి వచ్చాడు.
(00:53) కానీ అన్ని కలుపుకొని తింటున్న రెండోవాడు మాత్రం రోజు రోజుకి మరింత బలంగా ఆరోగ్యంగా తయారవుతుండేవాడు. ఇదంతా చూస్తూ చనిపోవడానికి రెడీగా ఉన్న మొదటి వాడికి పిచ్చెక్కిపోయి ఆ రెండో వాడిని ఇలా అడిగాడు. ఒరేయ్ ఇద్దరం ఒకే తిండి తింటున్నాం కదా మరి నువ్వేమో ఇంత స్ట్రాంగ్ గా మారినప్పుడు నేనెందుకు పేషెంట్ లా మారిపోయాను అని.
(01:13) అప్పుడు ఆ రెండోవాడు ఏమన్నాడో తెలుసా? ఒరేయ్ నీకున్న ప్రాబ్లమ నువ్వు తింటున్న ఆహారం కాదు. నీ ప్రాబ్లం వల్ల నీ దగ్గర ఉన్న ఆ రెండు గిన్నెలు నువ్వు ఫుడ్ ని ఫుడ్ లా చూడట్లేదు నీ నాలుకకి ఏది నచ్చుతుందో ఏది నచ్చదో అని తీపిని చేదుని విడగొట్టావు. నీ ఫోకస్ అంతా టేస్ట్ మీదే ఉండిపోయింది కానీ ఆ ఆహారంలో ఉన్న ప్రాణం మీద లేదు కానీ నా దగ్గర ఒక్కటే గిన్నె ఉంది.
(01:37) నాకు ఏది ఇచ్చినా నేను దాన్ని కేవలం ఆహారంగానే చూశాను. రుచి అనే బ్రమలో పడకుండా నా బ్రతుక్కి దాన్ని ఒక ఇంధనంగా మాత్రమే చూశాను. అందుకే అది నాకు పూర్తి బలాన్ని ఇచ్చింది. అండ్ నువ్వేమో రుచికి బానిసై చచ్చిపోతున్నావ్. ఇదంతా విన్న మొదటివాడు జ్ఞానోదయమై ఆ నీరసించిన శరీరంలో ఉన్న చివరి బలాన్ని కూడ తీసుకొని తన దగ్గర ఉన్న రెండు గిన్నెల్లో ఒక గిన్నెని నేలకేసి పగలగొట్టి మిగిలిన ఆ ఒక్క గిన్నెలోనే తన స్నేహితుడు ఇచ్చిన ఆహారాన్ని కృతజ్ఞతతో స్వీకరించి మళ్ళీ సంపూర్ణంగా మారి తన ప్రాణాలని ఆరోగ్యంగా నిలబెట్టుకున్నాడు.
(02:10) ఈ కథ మన జీవితానికి ఎంత డైరెక్ట్ గా కనెక్ట్ అయిందో తెలుసా ఈ కథలో రెండు గిన్నెలు ఏంటి ఇత్తడి గిన్నెలు స్టీల్ గిన్నెలు కాదు ఒక గిన్నె నీ మైండ్ అయితే ఇంకో గిన్నె నీ చదువు ఈ సమాజం నీ ఈగో నీకు ఎక్కిస్తున్న పనికి మాలిన ఇన్ఫర్మేషన్ మనందరి దగ్గర ఈ రెండు గిన్నెలు ఉన్నాయి. ఒక గిన్నె పేరు గుడ్ ఇంకో గిన్నె పేరు బ్యాడ్ ఒక గిన్నె పేరు సక్సెస్ ఇంకో గిన్నె పేరు ఫెయిల్యూర్ ఒక గిన్నె పేరు సుఖం ఇంకో గిన్నె పేరు దుఃఖం.
(02:36) మనకు జీవితం అనేది ఒక ముడి పదార్థంలో వస్తది. అందులో అన్ని కలిసి ఉంటాయి. కానీ మనం ఏం చేస్తాం మన భయంకరమైన మేదస్సును వాడి దాన్ని విడగొడతాం. నాకు ప్రేమ కావాలి గాని బాధ్యత వద్దు నాకు జీతం కావాలి గాని శ్రమ వద్దు నాకు గెలుపు కావాలి గానీ ఓటం వద్దు నాకు పగలు కావాలి గానీ రాత్రి వద్దు ఊపిరి పీలుస్తాను కానీ బయట వదలను అంటే ఎలా అయితే ప్రాణం పోతుందో తీపి కావాలి చేతు వద్దు అంటే జీవితం కూడా అలానే నాశనం అయపోతుంది.
(03:01) నువ్వు బతుకుని బతుకులా స్వీకరించట్లేదు. నీ ఈగోకి నచ్చిన ఒక ఫ్యాంటసీని సృష్టించుకోవాలి అనుకుంటున్నావ్. నువ్వు రియాలిటీని ముక్కలు చేస్తున్నావ్ ఆ మొదటివాడు తీపిని చేదిని వేరు చేసి రుచికి మాత్రమే ప్రాధాన్యం ఇచ్చి ఎలా అయితే ప్రాణం మీదకి తెచ్చుకున్నాడో జీవితంలో సుఖాన్ని కష్టాన్ని విడగొట్టి చూస్తూ నువ్వు కూడా నీ జీవితం యొక్క అర్థాన్నే చంపేస్తున్నావ్.
(03:24) ఈ డివైడింగ్ మైండ్సెట్ వల్ల ఏం జరుగుతుందో తెలుసా నీ లోపల నువ్వు రెండుగా చీలిపోయి నీకు నువ్వే ఒక యుద్ధభూమిలాగా మారిపోతున్నావ్. నీలో ఒక సగమేమో సక్సెస్ అనే కథలు పరిగెడతది. ఇంకో సగమేమో ఫెయిల్యూర్ వస్తుందేమో అని భయంతో ఏడుస్తుంటది. మనిషి ఎప్పుడు ఎందుకు డిప్రెస్డ్ గా ఉంటాడో తెలుసా కష్టాలు రావడం వల్ల కాదు కష్టానికి చేదు అనే ఒక ముద్ర వేసి దాన్ని రిజెక్ట్ చేయడానికి ఉపయోగిస్తున్న శక్తి వృధ అయిపోవడం వల్లే మనిషి అలిసిపోతున్నాడు.
(03:48) నువ్వు ఒక ఫెయిల్యూర్ ని ఫేస్ చేసినప్పుడు అది కేవలం ఒక అనుభవం అది అప్పటికప్పుడు వస్తుంది వెళ్ళిపోతుంది. కానీ నీ రెండు గిన్నెల బుద్ధి ఏం చేస్తుందంటే దాన్ని తీసుకెళ్లి బ్యాట్ అనే గిన్నెలో వేసి దాన్ని ఒక శత్రువులా చూస్తుంది. ఎప్పుడైతే నువ్వు దాన్ని వ్యతిరేకించడం రెసిస్ట్ చేయడం మొదలుపెట్టావో అక్కడ సంఘర్షణ మొదలవుతుంది. ఆ సంఘర్షణే నీ ప్రాణశక్తిని పీల్చేస్తుంది.
(04:13) మన కథలో మొదటి వాడికి ఇదే జరిగింది. వాడు చచ్చిపోయింది తిండి లేక కాదు ప్రతి ముద్దలోనూ ఇది తీపి ఇది చేదు అని లెక్కలు వేస్తూ భయపడుతూ ఆలోచిస్తూ అలసిపోయి బలహీనమయ్యాడు. అసలు ఈ ఎక్సిస్టెన్స్ లో ఏది దేనికి ఆపోజిట్ కాదు ప్రతిది ఒకదాని మీద ఒకటి కాంప్లిమెంటరీగా డిపెండ్ అయ్యే ఉంటాయి. చీకటి లేకపోతే వెలుగుకి అర్థం లేదు, మరణం లేకపోతే పుట్టుకకి అర్థం లేదు.
(04:36) చేదు అనేదే తీపిని అనుభవించడానికి ఒక బేస్ మాత్రమే. ఈ రెండూ వేరు వేరు కాదు. ఇప్పుడు ఒక నానానికి రెండు వైపులు ఉంటాయి కానీ నువ్వు నాకు బొమ్మే కావాలి బొరుసు వద్దు అని నానాన్ని సగానికి కోస్తే ఆ నానానికి మార్కెట్లో చిల్లి గవ్వ కూడా విలువ ఉండదు నీ జీవితం కూడా అంతే కానీ మన ఈగోకి ఇది నచ్చదు దానికి అన్నీ కంఫర్ట్ గా ఉండాలి. ఎక్కడ ఏ చిన్న కష్టం వచ్చినా గిల్లా గిల్లా కొట్టేసుకుంటది.
(05:02) అందుకే మనం రిలీజియన్ ని దేవుణని కూడా రెండుగా చీల్చేసాం. మనకి మంచి చేసేవాడు దేవుడు చెడు చేసేవాడు దెయ్యం. మనం స్వర్గాన్ని ఆశిస్తాం నరకాన్ని చూసి భయపడతాం. ఈ పిచ్చితనమే మనిషిని బానిసగా మార్చేసింది. ఎప్పుడైతే నువ్వు విభజించడం ఆపేస్తావో అప్పుడు మాత్రమే నువ్వు పరిపూర్ణమైన మనిషిగా మారుతావు. యుగ యుగాలుగా బుద్ధుడు రమణ మహర్షి కృష్ణుడు లాంటి వాళ్ళు చెప్పింది ఇదే ద్వంద్వాలకు అతీతంగా బ్రతకండి అని మరి ఇప్పుడు ఏం చేయాలి మన కథలో ఆ మొదటివాడు చేసిన పనే చేయాలి.
(05:30) నీ రెండు గిన్నెని నేలకట్టు అంటే అర్థం ఏంటి? రేపటి నుంచి నీ జీవితంలోకి ఏది వచ్చినా దానికి మంచి చెడు అని లేబుల్స్ వేయడం ఆపు ఒకరోజు నీకు అవమానం జరిగిందనుకో దాన్ని దుఃఖమని గిన్నెలో వేయకు మరి ఏం చేయాలి ఓకే ఇది నా ఈగోని దెబ్బ తీసింది నాలో ఉన్న అహంకారాన్ని కరిగించడానికి ఇది ఒక అవకాశం అని తీసుకో అలాగే ఒకరోజు విపరీతమైన డబ్బు సక్సెస్ వచ్చిందనుకో దాన్ని సుఖం అనే గిన్నెలో వేసి ఎగిరి గంతులు వేయకుండా ఇది ఒక మత్తు ఇందులో పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి అని ఆస్వదించు నీ దగ్గర ఎప్పుడు ఒక్కటే గిన్నె ఉండాలి.
(06:05) ఆ గిన్నె పేరే నీ ఎరుక ఎవేర్నెస్ ఆ గిన్నెలోకి చేదు వచ్చినా తీపి వచ్చినా కలిపే ఉంచు ఎప్పుడైతే నువ్వు జీవితాన్ని జీవితంగా యదాతదంగా యక్సెప్ట్ చేస్తావో అప్పుడు మాత్రమే నీ లోపల ఉన్న విభజన మాయమైపోతుంది. నీ విజన్ క్లియర్ అవుతుంది ఏ పరిస్థితి వచ్చినా నిన్ను కదల్చలేదు.

No comments:

Post a Comment