Monday, November 16, 2026

Kedarnath temple in 1860 కేదార్నాథ్ ఆలయం వందల ఏళ్ల క్రితం

Kedarnath temple in 1860 కేదార్నాథ్ ఆలయం వందల ఏళ్ల క్రితం

Author Name:Oldphoto bioscope

Youtube Channel Url:https://www.youtube.com/@Oldphotobioscope

Youtube Video URL:https://www.youtube.com/watch?v=pRjRDP_GQp4





Title: Kedarnath temple in 1860 కేదార్నాథ్ ఆలయం వందల ఏళ్ల క్రితం

Author Name: Oldphoto bioscope

Description: Kedarnath temple

Transcript:
(00:04) [సంగీతం] 1860లో కలకత్తా నుండి కేదార్నాథ్కు వెళ్ళినటువంటి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా యొక్క టీమ్ ఫోటో ఇది. ఆ కాలం నాటి ఆంగ్లేయుల బృందం ఉత్తరాఖండ్ హిమాలయ ప్రాంతాలకు చేరుకున్న తర్వాత కేదార్నాథ్ దేవాలయాన్ని ఫోటోలు తీశారు. ఆ కాలంలో కేదార్నాథ్ దేవాలయం చుట్టూ ఉన్న పరిస్థితులను రికార్డ్ చేశారు. ఇందులో మీరు చూసే ఫోటోస్ మాక్సిమం ఆ కాలంలో తీసినవే.
(00:33) వెల్కమ్ టు ఓల్డ్ ఫోటో బయోస్కోప్. పాత ఛాయాచిత్రాలు గత కాలపు మధుర జ్ఞాపకాలు ఆనాటి చరిత్రకు సజీవ సాక్షాలు. కేదార్నాథ్ ఆలయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హిమాలయ పర్వత శ్రేణులలో ఉన్న పరమశివుని పవిత్ర జ్యోతిర్లింగ [సంగీతం] క్షేత్రం. ద్వాపర యుగంలో పాండవుల చే నిర్మించబడిన ఈ ఆలయాన్ని ఎనిమిదివ శతాబ్దంలో ఆదిశంకరాచార్యుల వారు పునరుద్ధరించారు.
(01:00) పురాణ గాధ ప్రకారం మహాభారత యుద్ధంలో తమ బంధువులను వధించిన పాపం నుండి విముక్తి పొందేందుకు పాండవులు వేదవ్యాసుని సలహా మేరకు శివుని దర్శనం కోసం బయలుదేరుతారు. పాండవుల పట్ల ఆగ్రహంతో ఉన్న శివుడు వారికి కనిపించకుండా తప్పించుకుంటూ గుప్త కాశీ వద్ద నంది రూపం ధరించి భూమిలోకి వెళ్ళిపోతాడు. భూమిలోకి కుంగిపోతున్న నంది మూపురాన్ని భీమసేనుడు గట్టిగా పట్టుకోగా ఆ నంది మూపుర భాగం కేదార్నాథ్లో త్రిభుజాకార శివలింగంగా వెలిసింది.
(01:33) శివుని మిగిలిన శరీర భాగాలు తుంగనాథ్, రుద్రనాథ్, మధ్యమహేశ్వర్, కల్పేశ్వర్ ప్రాంతాలలో పంచ కేదారాలుగా ప్రసిద్ధి చెందాయి. పాండవుల భక్తికి మెచ్చిన శివుడు వారికి దర్శనమిచ్చి పాప విముక్తి ప్రసాదించాడు. ఆ తర్వాత పాండవులు ఇక్కడ ఆలయాన్ని నిర్మించి పూజలు జరిపారు. పురాణ గాధల ప్రకారం సంక్షిప్తంగా కేదార్నాథ్ దేవాలయ చారిత్రక ప్రాశస్త్యం ఇది.
(02:00) ఇక ఎనిమిదవ శతాబ్దంలో ఆదిశంకరాచാര്യులు హిమాలయ యాత్ర చేస్తూ ఈ పవిత్ర క్షేతਰਾన్ని తిరిగి కనుగొని పాండవులు నిర్మించిన పాత ఆలయ సమీపంలోనే ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని నిర్మింపజేశారు. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఎనిమిదవ శతాబ్దం నుండి 11వ శతాబ్దం మధ్య కాలంలో స్థానిక కత్యూరి వంశపు రాజులు మరియు మాల్వ పాలకుడు రాజా భోజ్ ఈ ఆలయ అభివృద్ధికి నిర్మాణానికి విశేషంగా కృషి చేశారు.
(02:29) ఈ ఆలయాన్ని ప్రాచీన ఉత్తర భారత నాగరా శైలి మరియు స్థానిక కత్యూరి నిర్మాణ పద్ధతుల సమ్మేళనంతో నిర్మించారు. సుమారు ఆరు అడుగుల ఎత్తైన రాతి వేదికపై ఈ ఆలయం కొలువై ఉంటుంది. ఈ ఆలయ నిర్మాణంలో సిమెంట్ లేదా సున్నం వంటి ఎలాంటి బైండింగ్ పదార్థాలను ఆ కాలంలో వాడలేదు. బూడిద రంగు భారీ బండరాళ్లను ఒక దానిలో ఒకటి చొచ్చుకుపోయేలా అంటే అస్లార్ మేషనరీ పద్ధతిలో ఇంటర్ లాకింగ్ సిస్టం ద్వారా అమర్చారు.
(03:00) దీనివల్ల భూకంపాలు మరియు మంచు తుఫానులను తట్టుకునే శక్తి దీనికి లభించింది. ఆలయంలో ప్రధానంగా గర్భ గృహం మరియు మండపం ఉంటాయి. గర్భ గృహంలో త్రిభుజాకారంలో ఉండే సహజ సిద్ధమైన శివలింగం కొలువై ఉంటుంది. మండపం గోడలపై పాండవులు, శ్రీకృష్ణుడు, పార్వతీ దేవి మరియు వీరభద్రుని విగ్రహాలు చెక్కబడి ఉంటాయి. ఎనిమిదవ శతాబ్దంలో ఆది శంకరాచార్యులు పునరుద్ధరణ తర్వాత మధ్య యుగం నుండి బ్రిటిష్ కాలం వరకు గర్వాల్ రాజులు, రావల్ పూజారులు మరియు యాత్రికుల ద్వారా ఈ ఆలయం నిరంతర పూజలు అందుకుంటూనే ఉంది.
(03:34) ఆది శంకరాచార్యులు కేదార్నాథ్ ఆలయంలో వైదిక ధర్మాచరణను పునరుద్ధరిస్తూ ఉత్తర దక్షిణ భారతదేశాల ఆధ్యాత్మిక సమైక్యతకు నిదర్శనంగా దక్షిణ భారతదేశంలోని అర్చకులను ఉత్తర భారతదేశంలోని ఈ కేదార్నాథ్ ఆలయంలో నియమించారు. కేదార్నాథ్ ఆలయ ప్రధాన అర్చకుడిని రావల్ అని పిలుస్తారు. శంకరాచార్యుల నియమం ప్రకారం ఈ రావల్ పదవిని కర్ణాటకకు చెందిన వీరశైవ జంగమ సంప్రదాయ పండితులు మాత్రమే నిర్వహిస్తారు.
(04:04) ప్రధాన అర్చకుడు, ప్రధాన రావాలని పిలిచే వీరు వీరి యొక్క ఆధ్వర్యంలో ఆయన సహాయక పూజారులు గర్భ గృహంలో నిత్య పూజలు [సంగీతం] నిర్వహిస్తారు. ఏర్పరిచిన సంప్రదాయం ప్రకారం ఈ ఆలయంలో పూజా విధానాలు మరియు మంత్రాలు తరతరాలుగా ఒకే క్రమంలో కన్నడ మరియు సంస్కృత భాషలలో కొనసాగుతూ ఉన్నాయి. ఈ ఆలయములోని పరమేశ్వరునికి వేకువజామున మహాభిషేకం అనంతరం రుద్రాభిషేకం మరియు శృంగార దర్శనం వంటి ఆచారాలను శంకరాచార్యుల వారు క్రమబద్ధీకరించారు.
(04:38) యజుర్వేదంలోని నమకం, చమకం మంత్రాలతో పాలు, పెరుగు, నెయ్యి, తేనె, గంగాజలం మరియు బిల్వ పత్రాలతో శివలింగానికి అభిషేకం చేసే పద్ధతిని ఆయన కరారు చేశారు. ఇతర జ్యోతిర్లింగ క్షేత్రాలకు భిన్నంగా కేదార్నాథ్లో భక్తులు స్వయంగా గర్భ గృహంలోకి వెళ్లి శివలింగాన్ని తాకి నెయ్యితో అభిషేకం చేసుకునే [సంగీతం] సంప్రదాయాన్ని కూడా ఆలయ నియమావళిలో భాగంగా ఉంచారు శంకరాచార్యులు.
(05:05) శీతాకాలంలో అధికమైన హిమపాతం కారణంగా ఆలయం మూసివేసినప్పుడు వైదిక పూజలకు ఆటంకం కలగకుండా శంకరాచార్యులు ఒక నిర్దిష్ట విధానాన్ని ఏర్పరిచారు. అక్షయ తృతీయ నాడు ఆలయ తలుపులు తెరవడం, కార్తీక మాసంలో మూసివేయడం ఆచారంగా మారింది. శీతాకాలంలో కేదార్నాథ్ ఉత్సవ విగ్రహాన్ని రావల్ పర్యవేక్షణలో ఊరేగింపుగా ఉఖీమట్లోని ఓంకారేశ్వర ఆలయానికి తరలించి అక్కడ ఆరు నెలల పాటు అదే వైదిక నియమాలతో నిత్య పూజలు జరిగేలా ఆయన నియమించారు.
(05:37) దేవాలయ ప్రధాన అర్చకుడు కఠినమైన బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఆ దేవాలయ పూజలు చేసే అంత కాలం ఆ జన్మ బ్రహ్మచర్యం వహించాలని కఠినమైన నిబంధనలు రూపొందించారు ఆదిశంకరాచార్యులు. ఇక కేదార్నాథ్ ఆలయం 14వ శతాబ్దం నుండి 17వ శతాబ్దం వరకు దాదాపు 400 ఏళ్ల పాటు సంభవించిన చిన్న మంచు యుగం లిటిల్ ఐస్ ఏజ్ వల్ల ఈ ఆలయం మంచు కింద కూరుకుపోయింది.
(06:06) ఆ తర్వాత మంచు కరగడంతో ఆలయం మళ్ళీ పూర్తి [సంగీతం] స్థాయిలో కనిపించింది. డెహ్రాడూన్ లోని వాడియా ఇన్సిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ శాస్త్రవేత్తలు ఆలయ గోడలపై లైకెనోమెట్రీ అనే శాస్త్రీయ పద్ధతి ద్వారా పరిశోధనలు జరిపారు. ఈ పరిశోధనల ప్రకారం 14వ శతాబ్దం నుండి 17వ శతాబ్దం వరకు సుమారు 1300 నుండి 1700 మధ్య హిమాలయాల్లో లిటిల్ ఐస్ ఏజ్ సంభవించింది.
(06:35) ఆ కాలంలో కేదార్నాథ్ ప్రాంతం మొత్తం దట్టమైన హిమ నీనాదాలు మరియు మంచు కింద పూర్తిగా కూరుకుపోయింది. మంచు కరిగి ఆలయం మళ్ళీ బయటపడిన తర్వాత మంచు ఒరిపిడి వల్ల ఆలయ రాళ్లపై ఏర్పడిన గీతలు మరియు రంగు మార్పులను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ఆనవాళ్లు ఆలయం సుమారు 400 ఏళ్ల పాటు మంచు గర్భంలో [సంగీతం] సురక్షితంగా ఉందనే విషయాన్ని నిర్ధారించాయి.
(07:00) కేదార్నాథ్ ఆలయ నిర్మాణ శైలి మరియు 400 ఏళ్ల పాటు మంచు కింద కూరుకుపోయిన [సంగీతం] శాస్త్రీయ ఆధారాలు అద్భుതമായ దేవాలయ ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తాయి. 1815లో జరిగిన ఆంగ్లో నేపాల్ యుద్ధం తర్వాత గర్వాల్ ప్రాంతం బ్రిటిష్ నియంత్రణలోకి వచ్చింది. ఆ సమయంలో బ్రిటిష్ సర్వేయర్లు మరియు యాత్రికులు హిమాలయ ప్రాంతాలను మ్యాపింగ్ చేస్తూ కేదార్నాథ్ ఆలయ వివరాలను అధికారిక రికార్డుల్లో నమోదు చేశారు.
(07:29) బ్రిటిష్ కాలంలో 1828 నాటి స్కెచ్ లు మరియు 1882లో తీసిన అత్యంత పురాతన ఫోటోగ్రాఫ్ ద్వారా ఈ ఆలయం అప్పటి రూపాన్ని ప్రపంచానికి పరిచయం చేయబడింది. సముద్ర మట్టానికి సుమారు 3583 మీటర్లు అంటే 11,755 అడుగుల ఎత్తులో మందాకిని నది ఒడ్డున బూడిద రంగు భారీ రాళ్లతో ఈ ఆలయాన్ని నిర్మించడం, రాళ్లను ఒకదానితో ఒకటి అనుసంధానించే ప్రాచీన సాంకేతికను ఉపయోగించడం ఆ కాలంలో భారతీయ శిల్పుల కళా చాతుర్యానికి సాంకేతిక ప్రతిభకు నిదర్శనం.
(08:09) 2013 జూన్ లో ఉత్తరాఖండ్లో సంభవించిన ఆకస్మిక వరదల్లో కేదార్నాథ్ పట్టణం మొత్తం తుడిచిపెట్టుకు పోయింది. వరద ప్రవాహంతో పాటు కొట్టుకు వచ్చిన ఒక భారీ బండరాయి ఆలయానికి సరిగ్గా వెనక భాగంలో ఆగిపోయి నీటి ఉధృతిని రెండు పాయలుగా చీల్చి ఆలయానికి ఏ మాత్రం నష్టం కలగకుండా కాపాడింది. భక్తులు ఈ రాయిని భీమశిలగా పూజిస్తున్నారు.
(08:35) హిందూ పురాణాల ప్రకారం పాండవుల కంటే ముందే విష్ణుమూర్తి అవతారాలైన నరనారాయణలు బద్రీకాశ్రమంలో తపస్సు చేస్తూ శివుడిని ప్రార్థించారని ప్రతీతి. వారి భక్తికి మెచ్చిన పరమశివుడు కేదార్నాథ్లో జ్యోతిర్లింగ రూపంలో శాశ్వతంగా కొలువుండటానికి అంగీకరించాడని స్కంద పురాణ కథనాలు చెప్తున్నాయి. మంచు ఆలయంపై పేరుకుపోకుండా కిందకు జారిపోయేలా మండపంపై పిరమిడ్ ఆకారపు వాలు పైకప్పులను గర్భ గృహంపై ఉత్తర భారత నాగర శైలి శిఖరాలను నిర్మించారు.
(09:07) హిమపాతం మరియు వరద నీటి ప్రవాహం నుండి ఆలయాని రక్షించడానికి సుమారు ఆరు అడుగుల ఎత్తైన రాతి వేదికను నిర్మించి దానిపై ఆరు అడుగుల మందపాటి గోడలతో గర్భ గృహాన్ని రూపొందించారు. భూకంప తీవ్రత ఎక్కువగా ఉండే హిమాలయ జోన్లో రాళ్లు కదలకుండా ఉండేందుకు పెద్ద రాతి పలకల లోపలి భాగాల్లో ఇనుప కొక్కెలు మరియు [సంగీతం] ఐరన్ క్లాంప్స్ అమర్చారు. దీనివల్ల ఆలయ గోడలకు ఫ్లెక్సిబిలిటీ స్థితిస్థాపకత లభించి భారీ కుదుపులను తట్టుకోగలిగాయి.
(09:38) స్థానికంగా లభించే బూడిద రంగు భారీ బండరాళ్లను అత్యంత ఖచ్చితమైన కొలతలతో చెక్కి ఒకదానిలో ఒకటి సెట్ అయిపోయేలా పేర్చారు. ఆనాటి ప్రాచీన భారతీయ ఆలయ సంప్రదాయం ప్రకారం ఆలయ నిర్మాణాన్ని దైవకార్యంగా భావించిన కత్తూరి కాలం నాటి శిల్పులు తమ వ్యక్తిగత పేర్లను శిలలపై చెక్కలేదు. చారిత్రక శాసనాల్లో రాజుల పేర్లు మాత్రమే కనిపిస్తాయి తప్ప శిల్పుల పేర్లు నమోదు కాలేదు.
(10:06) కత్తూరి శిల్పులు శిల్పశాస్త్రం మరియు వాస్తుశాస్త్రంలో నిష్ణాతులు. వీరు కఠినమైన స్థానిక నైస్ మరియు గ్రానైట్ రాళ్లను మలచి గుప్త మరియు పతిహార సోలంకీ కళా రీతుల ప్రభావంతో అద్భుతమైన శిల్పాలను [సంగీతం] చెక్కారు. కేదార్నాథ్ ప్రాంతంలోని మంచు వాతావరణానికి తగ్గట్టు ఆలయ బాహ్య గోడలపై ఎలాంటి శిల్పాలను చెక్కలేదు ఆనాటి శిల్పులు.
(10:32) భారత పురావస్తు శాఖ ప్రచురించిన ఎపిగ్రాఫియా ఇండికా ప్రకారం మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ వద్ద లభించిన ఒక శిలా శాసనం కేదారేశ్వర ఆలయ నిర్మాణ ఘనతను మాల్వా పరమార వంశపు రాజు భోజుడికి ఆపాదించింది. మరికొన్ని చారిత్రక పరిశోధన ప్రకారం కూడా మాల్వా పరమార వంశానికి చెందిన త్రిభువన నారాయణ అనే రాజు ఈ రాతి కట్టడాన్ని నిర్మించాడని శాసనాలు సూచిస్తూ ఉన్నాయి.
(10:59) కేదార్నాథ్ ఆలయ గర్భగృహానికి దారి తీసే రాతి మెట్లపై ప్రాచీన పాళీ మరియు గుప్తుల కాలం నాటి బ్రాహ్మీ లిపిని పోలిన అక్షరాలు చెక్కబడి ఉన్నాయి. ప్రముఖ చరిత్రకారుడు రాహుల్ సాంకృత్యాయన్ ఈ శాసనాల గురించి తన రచనల్లో ప్రస్తావించారు. కొన్ని శాసనాలు మసి మరియు శతాబ్దాల నాటి దుమ్ము కింద కప్పబడి ఉండటం వల్ల వాటి పూర్తి పాఠాన్ని డీకోడ్ చేసే [సంగీతం] ప్రక్రియ ఇంకా కొనసాగుతూ ఉంది.
(11:24) ఏడవ శతాబ్దం నుండి 11వ శతాబ్దం వరకు ఈ ప్రాంతాన్ని పాలించిన కత్యూరి రాజులు లలిత సూరదేవ, భూదేవ వంటి రాజులు హిమాలయ ప్రాంతంలోని ఈ దేవాలయ అభివృద్ధికి కృషి చేసినట్లు తెలుస్తూ ఉంది. 12వ శతాబ్దానికి చెందిన కుమారపాల చరిత్ర అనే చారిత్రక గ్రంథం ప్రకారం గుజరాత్కు చెందిన సోలంకీ రాజు కుమారపాలుడు ఈ ఆలయానికి అదనపు నిర్మాణాలు నిర్మించాడని తెలుస్తూ ఉంది.
(11:52) 18వ శతాబ్దంలో మరాఠా రాణి అహల్యాబాయి హోల్కర్ కేదార్నాథ్ ఆలయాని పునరుద్ధరించి ఆలయ ప్రాంగణంలో మరికొన్ని నిర్మాణాలు చేయించినట్లు చారిత్రక రికార్డులు చెబుతూ ఉన్నాయి. ఇక పాండవుల మునిమనవడైన జనమేజయ మహారాజు కేదార్నాథ్ ప్రాంతానికి భూదానం చేసినట్లు కొన్ని తామ్ర శాసనాలు, కథనాలు కూడా ప్రచారంలో లో ఇలా వందల వేల సంవత్సరాలుగా భారతదేశంలోని ఉత్తరాఖండ్ ప్రాంతంలో హిమాలయ సానువుల్లో కేదార్నాథ్ దేవాలయం ప్రముఖ సైవ జ్యోతిర్లింగ క్షేత్రంగా భాసిల్లుతూ ఉంది.
(12:23) [సంగీతం] కేదార్నాథ్ ఆలయ సంక్షిప్త చరిత్రతో పాటు అలనాటి ఈ కేదార్నాథ్ దేవాలయ పాత ఛాయాచిత్రాలు మిమ్మల్ని అలరించాయని భావిస్తూ వీడియో నచ్చిన వారు లైక్స్ ఇచ్చి అందరికీ షేర్ చేస్తారని [సంగీతం] మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ నేను మీ రాజు ఓల్డ్ ఫోటో బయోస్కోప్ జై హింద్. [సంగీతం]

No comments:

Post a Comment