Sunday, November 1, 2026

గదిలో కాంతిలా మాయమైన మహా యోగి! సైన్స్ కు దొరకని రహస్యం 😱 | The Yogi Who Turned Into Light - Vallalar

గదిలో కాంతిలా మాయమైన మహా యోగి! సైన్స్ కు దొరకని రహస్యం 😱 | The Yogi Who Turned Into Light - Vallalar

Author Name:Voice of MAHEEDHAR

Youtube Channel Url:https://www.youtube.com/@VoiceOfMaheedhar

Youtube Video URL:https://www.youtube.com/watch?v=qxw8Dla5o7c





Title: గదిలో కాంతిలా మాయమైన మహా యోగి! సైన్స్ కు దొరకని రహస్యం 😱 | The Yogi Who Turned Into Light - Vallalar

Author Name: Voice of MAHEEDHAR

Description: గదిలో కాంతిలా మాయమైన మహా యోగి! సైన్స్ కు దొరకని రహస్యం 😱 | The Yogi Who Turned Into Light - Vallalar: The Quantum Yogi | Voice of Maheedhar Planet Leaf (MPL) Videos Exclusive...

Join this channel to support me and get access to perks:
https://www.youtube.com/mplanetleaf/join

OUR OTHER CHANNELS:

►FOLLOW US ON AUDI9 (Website) :- https://www.audi9.com
►SUBSCRIBE TO MPLANETLEAF (Channel) :-    / mplanetleaf  
►SUBSCRIBE TO FACTSHIVE (Channel) :-    / factshive  
►SUBSCRIBE TO SMB AUDIOBOOK (Channel) :-    / smbab  
►SUBSCRIBE TO WHATSAPP (Channel) :- https://whatsapp.com/channel/0029VaAU...

SOCIAL MEDIA:

►SUBSCRIBE TO WHATSAPP (Group) :- https://goo.gl/Y3Sa7S
►SUBSCRIBE ON FACEBOOK (Page) :- https://goo.gl/CBhgyP
►SUBSCRIBE ON TELEGRAM (Channel) :- https://goo.gl/ZTwU1K
►SUBSCRIBE ON TELEGRAM (Group) :- https://t.me/mplsd

What happens when the ultimate state of human evolution meets modern quantum physics? Can a human body made of flesh and blood completely dematerialize and turn into pure light? 😱

Welcome to 'Voice of Maheedhar'! In this video, we dive deep into the mind-bending true story of one of the greatest Tamil Yogis, Vallalar (Jothi Ramalinga Swamy). Long before Albert Einstein proposed his E=mc² formula or scientists at CERN began studying sub-atomic particles, this great sage practically demonstrated the ultimate power of Sanatana Dharma.

🔍 What you will discover in this video:

The mysterious childhood of Ramalinga Swamy and the Chidambaram secret.

How did he light lamps with ordinary water instead of oil?

The 7 veils of ignorance at the Vadalur 'Sathya Gnana Sabhai'.

The sacred fire he lit for feeding the hungry that has been burning non-stop for 150 years!

The hidden science, astronomy, and nuclear physics in his 6,000 poems called 'Thiruvarutpa'.

0:00 భౌతిక దేహం కాంతిగా మారడం సాధ్యమేనా?
3:06 జ్యోతి రామలింగస్వామి బాల్యం మరియు ఆధ్యాత్మిక ప్రస్థానం
7:54 సత్య జ్ఞాన సభ మరియు ఏడు రంగుల తెరల రహస్యం
10:21 అష్టసిద్ధులు మరియు యోగ శాస్త్రంలోని రహస్యాలు
11:42 బ్రిటిష్ అధికారుల కళ్ళెదుటే జరిగిన అదృశ్యం

The Climax: The shocking 1874 incident where he locked himself in a room, and when British Collector J.H. Garstin broke it open, his physical body had vanished into thin air!

Is it the 'Rainbow Body', Quantum Tunneling, or the 'Pranava Deham' described in ancient Hindu texts? Watch till the end to uncover the greatest scientific and spiritual mystery of India!

🔔 Don't forget to LIKE, SHARE, and SUBSCRIBE to 'Voice of Maheedhar' for more untold mysteries and the hidden science of Sanatana Dharma!

#Vallalar #RamalingaSwamy #VoiceOfMaheedhar #Guru #Vadalur #Yogi #SanatanaDharma #IndianMysteries #QuantumPhysics #SpiritualScience #YogiMiracles #Hinduism #UntoldHistory #saint #IndianSaint #TeluguDocumentary #AncientIndianScience #MysterySolved

Vallalar history in Telugu, Jothi Ramalinga Swamy miracles, Vadalur Vallalar dematerialization, the yogi who became light, Sanatana Dharma advanced science, modern science vs ancient wisdom, E=mc2 and spirituality, Voice of Maheedhar latest video, unknown mysteries of India, British records of Indian yogis, lighting lamp with water miracle, Arutperunjothi explanation, Tamil saints history, quantum physics in Hinduism, mysteries of human body, Sathya Gnana Sabhai Vadalur, spiritual science in Telugu, unexplained mysteries in India, Telugu informative videos, history of Hindu saints.

Transcript:
(00:01) నమస్తే వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ మహీధర్ సైన్స్ మనిషి సాధించిన అద్భుతమైన విజయం పదార్థం శక్తిగా మారుతుందని [గొంతు సవరించుకోవడం] శక్తి పదార్థంగా మారుతుందని ఆధునిక భౌతిక శాస్త్రం చెబుతోంది. కానీ కేవలం తన యోగశక్తితో రక్త మాంసాలు ఉన్న ఒక భౌతిక శరీరాన్ని [సంగీతం] అచ్చమైన కాంతిగా, ఒక దివ్యమైన జ్యోతిగా మార్చుకోగలగడం వాస్తవంగా సాధ్యమేనా? ఒక గదిలోకి వెళ్లి తలుపులు మూసుకుని ఎలాంటి ఆధారాలు లేకుండా గాలిలో కాంతిలా [సంగీతం] కలిసిపోవడం ఎలా సాధ్యపడింది? ఆధునిక సైన్స్ కు సైతం అంతు చిక్కని ఈ అద్భుతం ఈ గడ్డ మీద మన దక్షిణ భారతదేశంలోనే జరిగింది. [సంగీతం]
(00:45) ఈ అనంత విశ్వం ఎలా పుట్టింది? పదార్థం అసలు ఎలా పని చేస్తుంది? ఈ రహస్యాలను చేదించడానికి నేటి ఆధునిక శాస్త్రవేత్తలు జెనీవాలోని సన్ లాంటి ప్రయోగశాలల్లో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి కణాలను డీ కొట్టిస్తున్నారు. [సంగీతం] పదార్థాన్ని శక్తిగా మార్చడానికి భారీ యంత్రాలను వాడుతున్నారు. [సంగీతం] కానీ వేలాది సంవత్సరాల క్రితమే మన సనాతన ధర్మం ఎలాంటి ఆధునిక యంత్రాల అవసరం లేకుండా కేవలం ఈ మానవ దేహాన్ని ఒక ప్రయోగశాలగా మార్చుకుని సృష్టి రహస్యాలను అన్వేషించింది.
(01:22) ఒకసారి ఆలోచించండి. పంచభూతాలతో తయారైన ఈ భౌతిక దేహాన్ని ఎముకలు గండరాలు రక్తంతో కూడిన ఈ శరీరాన్ని కేవలం తన యోగశక్తితో ఆవిరి చేసి స్వచ్ఛమైన కాంతి కణాలుగా మార్చడం ఎలా సాధ్యం? ఇది కేవలం హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాలలో గ్రాఫిక్స్ ద్వారా మాత్రమే సాధ్యమని మనం అనుకుంటాం. కానీ ఇది ఎప్పుడూ [సంగీతం] జరిగిన పుక్కిటి పురాణం కాదు.
(01:51) కేవలం 150 ఏళ్ల క్రితం ఆధునిక సాంకేతికతకు బీజాలు పడుతున్న కాలంలో సాక్షాత్తు బ్రిటిష్ అధికారుల కళ్ళెదుటే డాక్యుమెంట్ చేయబడిన ఒక చారిత్రక వైజ్ఞానిక సత్యం. సనాతన ధర్మం మానవ పరిణామానికి పెట్టిన ఆఖరి మెట్టు పేరు మోక్షం. అంటే జనన మరణాల చక్రం నుండి విముక్తి పొందడం. ఎందరో గొప్ప యోగులు వృద్ధాప్యం రాగానే తమ ప్రాణాలను వదిలేసి ఆత్మను పరమాత్మలో కలుపుతారు.
(02:19) వారి భౌతిక దేహం మాత్రం ఇక్కడే మట్టిలో కలిసిపోతుంది. [సంగీతం] కానీ తన మట్టి దేహాన్ని ఇక్కడే వదిలేయకుండా ఆ కణాలను సైతం దైవికమైన జ్యోతిలో లీనం చేసిన మహా యోగి గురించి వింటే నేటి క్వాంటం ఫిజిక్స్ కూడా తలవంచక తప్పదు. ఆయనే భగవంతుడిని అచ్చమైన కాంతి రూపంలో దర్శించిన ఓ మహాయోగి ఈరోజు మనం భౌతిక శాస్త్ర నియమాలను దాటి సనాతన ధర్మం చెప్పే పరమాత్మ తత్వాన్ని స్వయంగా నిరూపించిన ఒక గొప్ప తమిళ యోగీశ్వరుడు వడలూరు వళ్ళలార్ రామలింగ స్వామి లేదా జ్యోతి రామలింగస్వామి అద్భుత జీవితం ఆయన జ్యోతిగా మారిన రహస్యం గురించి సాధ్యమైనంత వివరంగా తెలుసుకుందాము.
(03:00) [సంగీతం] వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను. వాయిస్ ఆఫ్ మహీధర్ కాలం 1823 అక్టోబర్ 5 తమిళనాడులోని చిదంబరం సమీపంలో ఉన్న మరుదూరు అనే చిన్న గ్రామంలో రామయ్య పెళ్లై చిన్నమ్మాయి దంపతులకు ఐదవ సంతానంగా జన్మించారు రామలింగం. పుట్టుకతోనే ఆయనలో ఒక దివ్యత్వం [సంగీతం] ఉట్టిపడేది.
(03:32) ఆయనకు ఐదు నెలల వయసు ఉన్నప్పుడు తల్లిదండ్రులు చిదంబరం నటరాజస్వామి దేవాలయానికి తీసుకు వెళ్ళారు. అక్కడ పూజారి గర్భగుడిలోని తెరను తొలగించి దీపారాధన చూపిస్తున్నప్పుడు ఆ పసికందు రామలింగం పగలబడి నవ్వడం ప్రారంభించారు. [సంగీతం] ఆ నవ్వులో అనంతమైన శివతత్వం దాగి ఉంది. ఆ క్షణంలోనే ఆ శిశువుకు చిదంబర రహస్యం అంటే భగవంతుడు నిరాకారుడు కాంతి స్వరూపుడు అనే సత్యం అర్థమైందని చెబుతారు.
(04:03) [సంగీతం] తండ్రి చిన్న వయసులోనే మరణించడంతో కుటుంబం చెన్నై అప్పటి మద్రాసుకు వలస వెళ్ళింది. అన్నయ్య [సంగీతం] సభాపతి పెళ్లై ఒక గొప్ప పండితుడు హరికథా కాలక్షేపం చేసేవారు. కానీ రామలింగానికి చదువు మీద కన్నా ఆధ్యాత్మికత మీద ధ్యానం మీద ఎక్కువ ఆసక్తి ఉండేది. చదువు పట్ల ఆసక్తి చూపని తమ్ముడిని దారిలో పెట్టాలని అన్నయ్య సభాపతి ఆయనను ఇంట్లోనుంచి బయటకి పంపివేశారు.
(04:32) [సంగీతం] అయినా సరే రామలింగం తిండి నిద్ర మానేసి చెన్నై కందస్వామి అంటే మురుగన్ గుడిలో ధ్యానంలో మునిగిపోయారు. అప్పటికీ ఆయనకు తొమ్మిదేళ్ళు మాత్రమే. ఒకరోజు అన్నయ్యకు జబ్బు చేసి హరికథ చెప్పడానికి వెళ్ళలేని పరిస్థితి రాగా ఆ బాధ్యతను రామలింగం తీసుకున్నారు. కేవలం తొమ్మిదఏళ్ల వయసులో జ్ఞాన సంబంధాలు రచించిన దైవగీతాలకు ఆయన చెప్పిన అద్భుతమైన వ్యాఖ్యానం విన్న పండితులు అతను సామాన్యమైన బాలుడు కాదు పుట్టుకతోని జ్ఞానం పొందిన సిద్ధుడని గ్రహించారు.
(05:07) ఆ తర్వాత ఆయన తనకోసం ఇంట్లో ఒక ప్రత్యేక గదిని అడిగి తీసుకొని లోపల ఒక అద్దం పెట్టుకొని ఆ అద్దం ముందు దీపం వెలిగించి ఆ దీపాన్ని శివుడిగా మురుగన్గా భావిస్తూ రోజుల తరబడి ధ్యానంలో గడిపేవారు. ఆ అద్దంలో ఆయనకు సాక్షాత్తు ఆ పరమశివుడి దర్శనం లభించిందని చరిత్ర చెబుతోంది. ఆధ్యాత్మిక సాధనలో తాను పొందిన అనుభూతులను దర్శించిన సత్యాలను రామలింగ స్వామి అద్భుతమైన కవితలుగా మలిచారు.
(05:37) ఆ కవితా సంపుటిని తిరువరుట్ప అంటే దైవిక కృపాగీతాలు అని పిలుస్తారు. ఆయన సుమారు 6వేల పద్యాలు రాశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే [సంగీతం] అవి కేవలం భక్తి గీతాలు కావు. అందులో అనుభౌతిక శాస్త్రం ఖగోళ శాస్త్రం మరియు ప్లాంట్ బాటనీకి సంబంధించిన ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. విశ్వం ఎలా ఏర్పడింది అణువుల నిర్మాణం ఎలా ఉంటుంది? మానవ శరీరంలోని సూక్ష్మ నాడులు ఎలా పనిచేస్తాయి [సంగీతం] అనే విషయాలను ఎలాంటి సూక్ష్మదర్శిని అంటే మైక్రోస్కోప్ లేని ఆ కాలంలోనే తన గ్రంథాలలో అత్యంత ఖచ్చితంగా రాశారు రామలింగ స్వామి.
(06:18) ఒక చదువుకొని బాలుడు విశ్వ రహస్యాలను గ్రంథస్థం చేయడం ఆనాటి మేధావులను సైతం విస్మయానికి గురిచేసింది. ఇక్కడ మనం సనాతన ధర్మం చెప్పే ఒక గొప్ప నిగూఢ సత్యాన్ని అర్థం చేసుకోవాలి. ఉపనిషత్తులు భగవంతుడిని కాంతి స్వరూపంగా వర్ణించాయి. శ్వేతాస్వతర ఉపనిషత్తు నతత్ర సూర్యోభాతిన చంద్ర తారకం అంటుంది. అంటే ఆ పరమాత్మ ఉన్నచోట సూర్యుడు చంద్రుడు నక్షత్రాల వెలుగు కూడా సరిపోదు.
(06:51) ఆయనే అన్నింటికీ వెలుగునిచ్చే మహాజ్యోతి భగవద్గీతలో 13వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు జ్యోతిషామపిత జ్యోతిస్తమసః పరముచ్యతే అని చెప్పాడు. [సంగీతం] అంటే జ్యోతులకు కూడా జ్యోతి చీకటికి అతీతమైనవాడు ఆ పరమాత్మ. వేలాది సంవత్సరాల క్రితం మన ఋషులు దర్శించిన ఈ సత్యాన్ని రామలింగ స్వామి తన జీవిత కాలంలో ప్రాక్టికల్ గా చేసి చూపించారు.
(07:20) [సంగీతం] విగ్రహారాధన నుండి మొదలైన ఆయన ప్రయాణం నిరాకారమైన కాంతిమయమైన పరబ్రహ్మ ఉపాసన వైపు సాగింది. దానికి ఆయన పెట్టిన పేరు అరు పెరుంజ్యోతి అంటే సువిశాలమైన దైవిక కృపాకాంతి లేదా సుప్రీం గ్రేస్ లైట్ మరి ఆ దైవిక కాంతిని మనం ఎలా దర్శించగలము సనాతన ధర్మంలో మాయ గురించి మనిషిని కప్పి ఉంచే పంచకోశాల గురించి ఎలాగైతే చెప్పబడిందో రామలింగ స్వామి దానిని అత్యంత సామాన్యులకు కూడా అర్థమయ్యేలా ఒక అద్భుతమైన విధానాన్ని ప్రవేశపెట్టారు.
(07:56) వడలూరులో ఆయన స్వయంగా డిజైన్ చేసి నిర్మించిన సత్య జ్ఞాన సభ ఒక తామరపువ్వు ఆకారంలో ఉంటుంది. అక్కడ గర్భగుడిలో ఉండే జ్యోతిని ఏడు రంగుల తెరలు కప్పి ఉంచుతాయి. నలుపు, నీలం, ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, తెలుపు మరియు మిశ్రమ రంగు. ఈ ఏడు తెరలు మనిషిలోని అజ్ఞానానికి కామక్రోధాలకు అహంకారానికి ప్రతీకలు. మనిషి తనలోని ఈ ఏడు అజ్ఞానపు పొరలను తొలగించుకున్నప్పుడే లోపల ఉన్న ఆత్మజ్యోతి దర్శనం ఇస్తుందని ఆయన సైంటిఫిక్ గా ప్రాక్టికల్ గా చూపించారు.
(08:33) రామలింగ స్వామి బోధనలలో అత్యంత కీలకమైనది జీవకారుణ్యం అంటే ప్రతి జీవి పట్ల దయ కలిగి ఉండటం వాడి పైరై కండపోదెల్లాం వాడినేన్ అంటే వాడిపోయిన మొక్కను చూసినప్పుడల్లా నా హృదయం కూడా వాడిపోతుందని ఆయన చెప్పిన మాటలు ఆయనలోని అపారమైన కరుణకు అర్థం పడతాయి. ఆకలితో ఉన్న జీవికి అన్నం పెట్టడమే అతిపెద్ద యోగ సాధన అని ఆయన నమ్మారు. అందుకే 1867 లో వడలూరులో సత్యధర్మశాలయ అనే ఒక అన్నదాన కేంద్రాన్ని స్థాపించారు.
(09:10) అక్కడ ఆయన స్వయంగా వెలిగించిన పొయ్యి గత 150 ఏళ్లుగా అంటే ఈరోజుకి కూడా ఆరకుండా నిరంతరం మండుతూనే ఉంది. ప్రతిరోజు వేలాది మందికి అక్కడ ఉచితంగా అన్నదానం జరుగుతూనే ఉంది. ఆకలి అనే అగ్నిని చల్లార్చడానికి ఆయన వెలిగించిన కరుణ అనే అగ్ని అది అష్టసిద్ధులు సాధించిన యోగికి అణువుల అమెరికను మార్చగలిగే శక్తి ఉంటుంది. ఒకసారి రామలింగ స్వామి కరుంగులి అనే గ్రామంలో ఉన్నప్పుడు రాత్రిపూట దీపాలు వెలిగించడానికి ఇంట్లో నూనె అయిపోయింది.
(09:44) [సంగీతం] ఆ సమయంలో స్వామి వారు ఏమాత్రం చలించకుండా మట్టి ప్రమిదలలో నీళ్లు పోసి దీపాలు వెలిగించమని చెప్పారు. శిష్యులు ఆశ్చర్యపడుతూనే ప్రమిదలలో నీళ్లు పోసి ఒత్తులు వెలిగించారు. ఆశ్చర్యం ఆ నీటితోనే ఆ దీపాలు రాత్రంతా దిదీప్యమానంగా వెలిగాయి. ఆధునిక సైన్స్ దృష్టిలో చూస్తే హైడ్రోజన్ ఆక్సిజన్ తో కూడిన నీటి అణువుల నిర్మాణాన్ని ఆయన కేవలం తన సంకల్ప శక్తితో ఇంధనంగా మార్చేశారు.
(10:16) [సంగీతం] మ్యాటర్ ని కంట్రోల్ చేసే మహావిద్య ఆయనకు కరతలామలకం అని ఈ సంఘటన నిరూపిస్తోంది. రామలింగ స్వామి కేవలం ఒక సంఘ సంస్కర్త మాత్రమే కాదు సనాతన ధర్మం యోగశాస్త్రంలో చెప్పబడిన అష్టసిద్ధులను పొందిన మహాయోగి పతంజలి యోగ సూత్రాలలో కాయ సంపత్ గురించి వివరించబడింది. యోగ సాధన ద్వారా పంచభూతాలతో నిర్మితమైన ఈ భౌతిక శరీరాన్ని యోగులు ఎలా మార్చుకోగలరో అందులో స్పష్టంగా ఉంది.
(10:49) [సంగీతం] వాయుధారణ తేజోధారణ ద్వారా శరీరాన్ని కాంతివంతంగా ఏ వ్యాధి దరిచేరని విధంగా ఎలా చేసుకోవచ్చో యోగశాస్త్రం చెబుతోంది. రామలింగ స్వామి ఈ యోగ విద్యలో అగ్రగణ్యుడు వయసు పెరుగుతున్న ఆయన శరీరంలో మార్పులు రాలేదు. ఆయన ఛాయా చిత్రం తీయడానికి అప్పట్లో ఎంతో మంది ప్రయత్నించారు. కెమెరామన్లు వచ్చి ఆయన ఫోటో తీస్తే కేవలం ఆయన వేసుకున్న తెల్లటి వస్త్రాలు మాత్రమే కనిపించేవి.
(11:20) ఫోటోలో ఆయన శరీరం కనిపించేది కాదు. [సంగీతం] ఎందుకంటే ఆయన దేహం అప్పటికే మాంసకృత్తులతో కాకుండా దైవికమైన కాంతి కణాలతో నిండిపోయి ఉంది. ఇది ఆధునిక సైన్స్ కు ఫోటోగ్రఫీకి అంతుచిక్కని మహా రహస్యం సనాతన ధర్మం చెప్పే జ్ఞానదేహం లేదా ప్రణవ దేహం అంటే ఇదే ఇక చివరకు ఆ మహాద్భుతమైన రోజు రానే వచ్చింది. అది 1874 జనవరి 30 వడలూరు సమీపంలోని మెట్టుకుప్పం అనే గ్రామంలో సిద్ధివగం అనే ఒక చిన్న పూరి గుడిసలో ఆయన నివసించేవారు.
(11:58) ఆ రోజు రాత్రి తన శిష్యులను భక్తులను అందరిని పిలిచారు. నేను ఇప్పుడు ఈ గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంటాను. కొంతకాలం వరకు ఎవరు తలుపులు తెరవవద్దు. ఒకవేళ ఎవరైనా బలవంతంగా తెరిచినా లోపల ఏమి కనిపించదు. [సంగీతం] శూన్యం మాత్రమే ఉంటుంది. నేను భగవంతుని మహాకాంతిలో అరుపెరుంజ్యోతిలో శాశ్వతంగా కలిసిపోతాను అని చెప్పారు. ఒక చిన్న దీపాన్ని వెలిగించి బయట పెట్టి దాన్ని నిరంతరం ఆరాధించమని చెప్పి గదిలోకి వెళ్లి తలుపులు మూసుకొని లోపల గడియ పెట్టుకున్నారు.
(12:34) [సంగీతం] కొన్ని నెలలు గడిచాయి. ఈ వార్త అప్పటి బ్రిటిష్ అధికారుల చెవినబడింది. ఇదంతా ఏదో మోసమని లోపల బహుశా ఆయన చనిపోయి ఉంటారని అనుమానించారు. [సంగీతం] మే 1874 లో సౌతార్కాడ్ జిల్లా కలెక్టర్ జేహెచ్ గర్స్టిన్ తన పోలీసు బలగాలతో అక్కడికి చేరుకున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో ఆ గది తలుపులు పగులగొట్టించారు. లోపలంతా వెతికారు.
(13:04) ఏముంటుంది అక్కడ ఏమీ లేదు ఒక రక్త మాంసాలు ఉన్న మనిషి ఏమైపోయాడు చనిపోతే అస్తిపంజరం ఉండాలి కదా కనీసం ఆయన వేసుకున్న బట్టలు కూడా లేవు. ఆ గదిలో నుండి వేరే దారి ఏమైనా ఉందా అని గోడలు నేల అంతా త్రవ్వించి చూశారు. అక్కడ ఎలాంటి స్వరంగం లేదు దారి లేదు. ఒక భౌతిక శరీరం గాలిలో కాంతిలా కరిగిపోయింది. కంగుతిన్న బ్రిటిష్ కలెక్టర్ మద్రాస్ ప్రెసిడెన్సీకి ఇచ్చిన అధికారిక గజెట్ లో రామలింగం అనే యోగి తన గదిలో అదృశ్యమయ్యాడు.
(13:39) ఆయన కోసం వెతికిన ఎలాంటి ఆధారాలు దొరకలేదు అని రికార్డ్ చేశారు. ఆ గెజెట్ కాపీ నేటికి ప్రభుత్వ ఆర్కైవ్స్ లో ఉంది. ఇప్పుడు సైన్స్ పరంగా ఆలోచిద్దాము. ఆల్బర్ట్ ఐన్స్టైన్ చెప్పిన e = mc స్క్వర్ సూత్రం ప్రకారం పదార్థాన్ని శక్తిగా మార్చవచ్చు కానీ ఒక మనిషి దేహాన్ని పూర్తిగా శక్తిగా కాంతిగా మార్చాలంటే ఊహించలేనంత ఉష్ణోగ్రత అణు విస్ఫోటనం లాంటి ప్రక్రియ జరగాలి.
(14:11) మరి ఆ చిన్న గదిలో అలాంటి పేలుడు జరగలేదు. కనీసం ఒక చిన్న ఆకు కూడా కాలిన ఆనవాళ్ళు లేవు. క్వాంటం ఫిజిక్స్ ఇప్పుడు వివరిస్తున్న క్వాంటం టనలింగ్ లేదా సబ్ అటామిక్ స్థాయిలో కణాల మార్పు గురించి మన యోగులు వేల ఏళ్ల క్రితమే సాధన చేసి చూపించారు. తన అణువుల ఫ్రీక్వెన్సీని కాంతి ఫ్రీక్వెన్సీతో సమానంగా పెంచి దేహాన్ని కాంతి దేహంగా మార్చుకోవడం యోగ విద్యలో పరాకాష్ట.
(14:39) బౌద్ధంలో దీనిని రెయిన్బో బాడీ అంటారు. సనాతన ధర్మం దీనిని జ్యోతిర్లింగ తత్వం అంటుంది. [సంగీతం] ఇదే వాయువులో వాయువుగా వెలుగులో వెలుగుగా ఆ పరమాత్మతో ఏకం కావడం వడలూరు వళ్ళలా రామలింగ స్వామి జీవితం మనకు ఒక అద్భుతమైన సందేశాన్ని ఇస్తుంది. భగవంతుడిని వెతకాల్సింది బయట ఎక్కడో కాదు మన లోపలే ఉన్న కాంతిలో 10 మంది ఆకలి తీర్చడం ప్రాణుల పట్ల దయ కలిగి ఉండటం మన మనసును శుద్ధి చేస్తుంది.
(15:11) [సంగీతం] ఆ శుద్ధమైన మనసు యోగ సాధన ద్వారా పరమాత్మను జ్యోతి స్వరూపంగా దర్శిస్తుంది. దైవం అంటే ఒక రూపం కాదు అది అనంతమైన ప్రేమ అనంతమైన కాంతి ఈరోజుకి వడలూరు వెళితే అక్కడ రామలింగ స్వామి సజీవంగా ఉన్నారనే ప్రకంపనలు ఎంతోమంది యోగులు సాధకులు అనుభూతి చెందుతుంటారు. సనాతన ధర్మం ఎంత సైంటిఫిక్ గా ఎంత ఉన్నతంగా మానవ పరిణామాన్ని తీర్చిదిద్దిందో [సంగీతం] చెప్పడానికి రామలింగ స్వామి చరిత్ర ఒక సజీవ సాక్ష్యం.
(15:45) ఈ అద్భుతమైన మహాయోగి ప్రయాణం మీకు స్ఫూర్తిని ఇచ్చిందని ఆశిస్తూ మరో అద్భుతమైన ఆధ్యాత్మిక వైజ్ఞానిక రహస్యంతో మీ ముందుకు వస్తాను. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాల కోసం మన వాయిస్ ఆఫ్ మహీధర్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను అందరికీ షేర్ చేసి సనాతన ధర్మ గొప్పదనాన్ని తెలియజేయండి. ఓం శ్రీ గురుభ్యోం నమః [సంగీతం] మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.
(16:16) మరి ఆ వీడియోలు మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ [సంగీతం] చేసుకోండి. అలాగే వీడియోస్ ని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. మీకు తెలిసిన తెలుసుకోదలిచిన విషయాలను [సంగీతం] క్రింద కామెంట్ బాక్స్ లో తప్పక తెలియజేయండి. వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో పొందుపరిచిన మన సోషల్ మీడియా లింక్స్ కూడా ఫాలో అవుతారని ఆశిస్తున్నాను.

No comments:

Post a Comment