Monday, October 12, 2020

ఆ నలుగురు..

ఆ నలుగురు..


బ్రతుకు పోరులో ...
నునుపు దారిలో ..

దూరపు కొండలలో ..
"మనం" గుమ్మం దాటి..

"నేను" ..నుండి..
"మే మనే" మేడల చేరి.,

మనకున్న... వాళ్ళని..

'మనమే'... అనుకున్నవాళ్ళని..

మనతో... కలిసున్నవాళ్ళని..
దూరం చేస్తూ..
దూరం నుంచి చూస్తూ..

నాది...మాది..అనే.,
ఒంటరి ప్రపంచంలో..

తృప్తిలేని సంపాదన..
సుఖంలేని నిద్ర..

అవసరంలేని ఆకలి..
అక్కరకురాని...
పలుకుబడి..
గొప్పనుకుంటూ..

వెలివేయబడిన..
ఒంటరి పక్షుల్లా..
బతుకుతున్న..జీవుల్లారా..!

మనకి...
కష్టం వస్తే...
పంచుకునే నలుగురు...

సంతోషమొస్తే...
సంబరపడిపోయే నలుగురు..

ఓడిపోతే...
ఊరడించే నలుగురు...

మన చుట్టూ...
మన వాళ్ళై...
మనకోసం..పరితపిస్తుంటే...

ఒంటరే.. ఒంటరవుద్ది.

కష్టమే..ఇష్టమవుద్ది.

సంతోషం చుట్టమవుద్ది.

ప్రతి పరిచయం బంధమవుద్ది!!


Source - Whatsapp Message

No comments:

Post a Comment