Saturday, October 3, 2020

మంచి మాటలు

బుధవారం --: 09-09-2020 :--
నేటి AVB మంచి మాటలు
🌹 నీ చిరునవ్వుతో అందరూ బాగుండాలి అందలో మనము ఉండాలి ఒకరు నిన్ను ప్రతిరోజూ పలకరిస్తూన్నారంటే అర్థం వాళ్ళ చుట్టూ ఎంతమంది ఉన్నా వారి మనసులో మీ స్థానం చాలా ప్రత్యేకమైనది అని అర్థం🌹 .

💐నవ్వుతే కనబడేది అందం నవ్విస్తే కనబడేది ఆనందం నవ్వుతూ నవ్విస్తూ ఉంటే బలపడేది అనుబంధం జీవితంలో విలువఇవ్వని బంధాలను పెంచుకోవద్దు . అలాగే విలువనిచ్చే బంధాలను వదులుకోవద్దు 💐.

🕉️కాలికి తగిలిన ముల్లు ఎలా నడవాలో నేర్పిస్తుంది
మనసుకి తగిలిన గాయం హద్దుల్లో ఎలా ఉండాలో నేర్పిస్తుంది .
గుండెకు తగిలిన గాయం బాధలో ఎలా ముందుకు పోవాలో నేర్పిస్తుంది🕉️ .
🤝 మంచి పనికి మించిన పూజ లేదు . మానవత్వానికి మించిన సంపద లేదు.
మనిషికి మరణం ఉంటుంది కానీ మంచి తనానికి మరణం ఉండదు🤝.

😞 మనం కోల్పోయిన వాటి గురించే ఆలోచిస్తూ కూర్చుంటే ఉన్నవాటిని కూడా కోల్పోవాల్సి వస్తుంది . కొమ్మనుండి రాలిపోయిన పువ్వులు తిరిగి అంటుకోకపోవచ్చు కానీ !కొమ్మబలంగా ఉంటే మళ్ళీ పూయవచ్చు కదా😊
🦚మంచిమనసు ఉన్న వారు మన కోర్కెలనుమొత్తం తీర్చలే డేమో కానీ మన అవసరాలను తప్పక తీరుస్తాడు .🦚

సేకరణ 🖋️*మీ ..AVB సుబ్బారావు 🌹🕉️🤝💐

Source - Whatsapp Message

No comments:

Post a Comment