రండి అబద్ధాలు చెబుదాం !
కొందరికి అబద్ధం చెప్పడమంటే వెన్నతో పెట్టిన విద్య. వెన్న అత్యంతమృదువైన పదార్ధం. అది ఘన పదార్థమో లేక ద్రవపదార్థమో చెప్పడం వీలుకాదు. మెత్తనైన ఈ వెన్న కిందపడినా మీదపడినా శబ్దం చేయదు. కింద పడిందో మీద పడిందో, అసలుకు పడినట్టుగా కూడా సృహలోవుండదు. కొందరి బొంకు వెన్నలాగే వుంటుంది. అసత్యమాడినట్టుగా కూడా వుండదు.
ఇప్పుడేమోకాని పూర్వకాలంలో పసిపిల్లలో జ్ఞానవృద్ధి పెరగాలని చిన్ననాడే వెన్న తినిపించడం చేసేవారు. నిజంగా వెన్న జున్ను నేయి తినడం వలన మేధోసంపత్తి పెరుగుతుందని పెద్దలు తెలియచేశారు. కొంతమంది పసితనం నుండే అనృతం చెప్పడం సహజంగా అబ్బివుంటుంది. వీరికి చిన్నతనంనుండే అబద్ధాలాడడం వచ్చివుంటుంది.
ఎప్పుడూ నిజాలే చెప్పాలా అబద్ధాలెపుడు చెప్పకూడదా అంటే చెప్పవచ్చునని మన పురాణాలు చెపుతున్నాయి. ధర్మానికి గ్లానికలిగినపుడు, మానంప్రాణంవిత్తం పోతున్నపుడు తక్కులు చెప్పవచ్చని అవి సెలవిచ్చాయి. కులగురువులు, ధర్మజ్ఞులు ఇలాంటి సమయంలో అబద్ధాలు చెప్పవచ్చని ప్రోత్సహించారు కూడా!
ఉదా॥ మహభారత విరాటపర్వ ప్రారంభంలో పాండవులు తమ ఆయుధాలను శమీవృక్షం మీద భద్రపరచినపుడు, జమ్మిచెట్టు మీదున్నవి ఆయుధాలుకాదు తల్లి శవమని ధర్మజుడు చుట్టుపట్ల గోపాలురు వినేలా బిగ్గరగా అరచి చెప్పడం జరిగింది. అలా చెప్పకపోతే చూచినవారెవరైనా వాటిని తస్కరిస్తే ఆయుధాలు లేని పాండవులు కురుక్షేత్రయుద్ధంలో పాండవులు ఓడి అధర్మం గెలిచే అవకాశముంది.అలాగే ఇతను అశ్వత్థామ అత: కుంజర: అనే తక్కు చెప్పడం జరిగింది. ఎందుకంటే ధర్మరక్షణకే కదా !
తక్కు అంటే తప్పు, నిజంకాదు అనే అర్థాలున్నాయి. టక్కులాడి, టక్కులనే పదాలు తక్కునుండి పుట్టినవే.
అలాగే వామనుడు, బలిచక్రవర్తిని మూడడుగుల నేలకోరినపుడు వటువుగా వచ్చినవాడు సాక్షాత్తు శ్రీ విష్ణువేనని కనుక దానం చేయవద్దని శుక్రాచార్యుడు బలిని హెచ్చరిస్తాడు.
గురుదేవా గ్రహీతకు దానమిస్తానని మాట ఇచ్చేశాను మాటతప్పడం, అబద్ధాలాడటం నా వల్లకాదని బలి సమాధానమిచ్చినపుడు కొన్ని సందర్భాలలో అబద్ధాలు చెప్పడం తప్పేమికాదని బోధ చేస్తాడు.
ఈ విషయాన్నే పోతనామాత్యుడు భాగవతంలో క్రిందిపద్యంలో ఎంతచక్కగా చెప్పడం జరిగిందో చూడండి.
వారిజాక్షులందు, వైవాహికములందు
ప్రాణవిత్తమాన భంగమందు
చకిత గోకులాగ్ర జన్మరక్షణమందు
బొంకవచ్చు నఘము పొందదధిప!
స్త్రీలకోసం కొన్ని సందర్భాలలో అబద్ధాలు చెప్పాలి.లేకపోతే కొంపకొల్లేరైతుంది. ఉదాll నా పదవీవిరమణానంతరం వచ్చిన మొత్తంలో కొంత సొమ్ము మా అక్కకు ఇవ్వడం జరిగింది. ఆ సొమ్మైమైందని మా ఆవిడ అడిగినపుడు అవసరంలోవున్న మిత్రుడికి ఇచ్చానులే త్వరలో ఇచ్చేస్తాడని చెప్పడం జరిగింది. నిజమే చెప్పివుంటే.?
వైవాహికములందు అంటే ఒక పెండ్లిచేయటానికి బొంకినా తప్పేమిలేదట. అందుకే నూరబద్ధాలాడైనా ఓ పెండ్లి చేయాలని పెద్దలు అన్నారు కదా! అమ్మాయి గురించి, అబ్బాయి గురించి వారి కుటుంబాల నడవడికగురించి ఆర్థికస్తోమత ఉద్యోగసద్యోగాల, ఆరోగ్యం గురించి నిజాలు మాట్లాడితే ఈ భూప్రపంచంలో ఒట్టు ! ఓ పెండ్లికూడా జరగదనుకొంటా!
ప్రాణహాని జరగుతున్నపుడు ఒక అబద్ధం చెప్పడంవలన ఆ ప్రాణం నిలబడుతుందని, అబద్ధమాడితే
స్త్రీ పురుషుల మానాలు నిలబడుతాయని వారు అవమానాలనుండి రక్షింపబడతారని,
అలాగే విత్తం అంటే సంపదల నాశనం జరగదని తెలిస్తే అబద్ధం చెప్పినా తప్పు కాదంట.
అలాగే గోవధను తప్పించటానికి నిర్మూలించటానికి, బ్రాహ్మణహత్య నివారించటానికి అబద్ధాలాడినా తప్పుకాదట, తప్పులేదట.
👏👏👏
Source - Whatsapp Message

No comments:
Post a Comment