Tuesday, October 6, 2020

కాలం...

🍀🌸💖💚🧚‍♀️💚💖🌸🍀

🌸 కాలం... 🌸

🌸 రాత్రి పగలు లెక్కించడానికి ఏర్పడిన పదం... వాస్తవానికి... కాలానికి ఆది లేదు అంతం లేదు.. అది వస్తువు కాదు... కానీ మన లెక్కలన్ని కాలంతో ముడిపడిన్నాయి... దీనికి ప్రామాణికం లేదు.. ఉన్నది మనకోసం మనం ఏర్పరచుకున్న లెక్కలే అనేది వాస్తవం... ఇంతటితో ఊరుకున్నమా.. లేదు అన్ని విషయాలు కాలంతో ముడి పెట్టి... చివరకు మన సహజమైన జీవితాన్ని ఛిద్రం చేసుకోవడమే కాక.. మన తరువాత తరాన్ని ఆ వైపు నెట్టేస్తున్నాం... కలి అంటే ఇదేనేమో...

🌸 కాలం వచ్చిన తరువాత చిరంజీవత్వం వచ్చినదా... చిరంజీవత్వం వల్ల కాలం గమనంలోకి వచ్చినదా అనేది ప్రశ్న... కానీ సమాధానం ఏది నిర్థిష్టంగా లేదు... సగటు వ్యక్తి అర్ధం చేసుకోవడానికి.. ఉన్నది భావనే... దానిద్వారానే అన్ని..
ఉదాహరణకు ఆంజనేయ స్వామి ఇప్పటికి ధ్యానంలోనే ఉన్నాడు అని అంతా నమ్ముతాం.. వేంకటేశ్వరస్వామి తిరుమల లో ధ్యానంలోనే ఉన్నాడు... మహావతార్ బాబాజి ఇంకా జీవించే ఉన్నారు... ఆయన వయసు ఇంత అని చెప్పలేము... కానీ బ్రమణం ఉన్న ప్రతి వస్తువుకు కాలం ఉంది... ఎందుకంటే రాత్రి పగలు ఉన్నాయి... కానీ అక్కడ లెక్కవేసేవారు ఉంటేనే...

🌸 ఏదైతే అస్తికతలో లేదో దానిని మాయ అంటాం... కాలానికి లేదు...
మాయకు లేదు...
భయానికి లేదు..
ప్రేమకు లేదు.. ఇది లేకపోతే ఏది లేదు..
విశ్వాసం, నమ్మకాలకు లేదు..
ఇవి లేకపోతే అసలు ప్రయత్నం అనే ప్రసక్తే లేదు...
ఉన్నది మనకు ఉపయోగ పడుతుంది.. లేనిది భయపెడుతోంది... అంటే మనలో ఉన్నవి లేనివి సరిచేసుకుంటే... మిగిలేది సహజత్వం, చిరంజీవత్వం అనుకోవాలి... మళ్ళీ వీటికి ప్రామాణికం అంటే ధ్యానం చెసినప్పుడు మనలో ఏదైతే మిగులుతుందో అవే ప్రామాణికాలుగా లేక్కవేస్తే... వెళ్ళిపోయినవాటిని దరికి రాకుండా చూడటం మొదలుపెట్టాలి...

🌸 మనకు కాలo ఉంది అని నమ్మించడానికి చేసిన ప్రయత్నం మన మెదస్సే... అందులో ఎలాంటి సందేహం లేదు... బ్రహ్మ ఆయుష్షు లెక్కగట్టే మనం... మన ఆయుష్షు ఎంతైనా పెంచుకోగలం... . కానీ ఇంకో కారణం మనం ఇంకో వంద సంవత్సరాలు ఉన్నాం అనుకుంటే... మన ముని ముని మనుమలు మనల్ని ఎలా చుస్తారు అని ప్రశ్న లెవనెత్తె వారికి ... మొదటి పాతిక సంవత్సరాలు బాల్యం తరువాత యవ్వనం... మన పిల్లలకు25 సంవత్సరాలు ని0డగానే... మనం వానప్రస్తాం... తరువాత సన్యాసాశ్రమం... ఇక్కడ నుండి చిరంజీవత్వం వైపు పయనం.. ఇక్కడ మనకు మనమే మినహా ఎవరు మనం కాదు.. అంతా మనదే... అనే స్థితికి చేరటం... అప్పుడు ఎంత వయసు వచ్చిన అది శరీరనికే... అంటే మృతువును ఇచ్చతో పిలిచే స్తితి మనదౌతుంది... ఇంకా కాలం, మరణం, మాయలకు చోటు ఉంటుందా మనలో...

Thank you...🌸🌸🌸

🍀🌸💖💚🧚‍♀️💚💖🌸🍀

Source - Whatsapp Message

No comments:

Post a Comment