Sunday, October 11, 2020

వైరాగ్యం అంటే ఏమిటి?

వైరాగ్యం అంటే ఏమిటి?

వైరాగ్యం :- ఈ పదానికి కొందరు చెప్పే అర్థాల వల్ల చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు.
దానితో తమకు తామే ద్రోహం చేసుకుంటున్నారు.

వైరాగ్యం అంటే మనం అభిమానించే అన్నింటిని వదలిపెట్టి ఎక్కడికో - ఏ అరణ్యాలకో వెళ్ళిపోవటమని - అన్నింటినీ వదిలిపెట్టి హీనమైన - దయనీయమైన జీవితాన్ని గడపటం అని కొందరు భావిస్తారు. తిండి తినకుండా - బట్ట కట్టకుండా - ఇల్లు వాకిలీ లేకుండా ఉంటేనే వైరాగ్యమని కొందరు భావిస్తారు. జీవితంలో ఎదురయ్యే కష్ట నష్టాలను ఎదుర్కోలేక పిరికిపందల్లా పారిపోవటమే వైరాగ్యమని కొందరు తలపోస్తారు. ఇవన్నీ దురభిప్రాయాలు. అన్నింటిని వదలాల్సి వచ్చిందే అని విచారంతో - వాటినే తలచుకుంటూ జీవితాన్ని భారంగా - వేదనతో గడపటం - కోరిక ఉండీ అణచుకొని లోలోపలే కుమిలిపోవటం - తనకు కలిగిన దయనీయ పరిస్థితికి చింతిస్తూ సమాజాన్ని ద్వేషిస్తూ బ్రతకటం - ఇవి వైరాగ్యం కానేకాదు. ఇది రాగం. అన్నింటిపై బాగా రాగం ఉన్నదని తెలుస్తూనే ఉంటుంది. ఇలాంటి భావాలు - ఉద్దేశాలు ఎంతో హానిని కలిగిస్తాయి.

వైరాగ్యం అంటే వస్తువులపై - విషయాలపై - భోగాలపై రాగం - వ్యామోహం - ఆసక్తి తొలగిపోవటమే - లేకపోవటమే. అసలు అలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? ఆ వస్తువు - లేదా విషయం మనకు కావలసినంత ఆనందాన్నివ్వక పోయినా - లేదా దుఃఖాన్ని, బాధను కలిగిస్తుందనుకున్నా ఆ విషయం కోసం ప్రాకులాడం సరికదా వస్తున్నా వద్దనే అంటాం.

ఆ వస్తువు కోసం మరికొందరు ఎగబడవచ్చు. కాని మనకు మాత్రం దానిపై రాగం లేదు. వైరాగ్యమే ఉన్నది. ఉదా: చూడండి.

మనం శుద్ధ శాకాహారులం. Pure vegitarians.
మనం వెళ్ళే త్రోవలో సీమపంది మాంసం కోసం జనం వేలం వెర్రిగా ఎగబడుతున్నారు. కొందరు అయ్యో ఐపోయిందే - మనకు దొరక్కపోయెనే అని బాధపడుతున్నారు. మరి మనం కూడా బాధపడతామా? దానికై ప్రయత్నిస్తామా?
ఒకవేళ ఎవరైనా అంత ఖరీదు కలిగిన దానిని Free గా ఇస్తామంటే తీసుకుంటామా? ఎందుకని? అది మనకు సంతృప్తి నివ్వదుగనుక, మనకు అసహ్యకరమైనది గనుక.

అదే మనకు సంతృప్తి నిచ్చేదైతే మనమూ ఎగబడతాం. ఈ లోకంలోని వస్తువులు - విషయాల కోసం అందరం ఎగబడుతున్నాం - పోరాటాలు చేస్తున్నాం. ఎందుకు? అవి మనకు సంతృప్తి నిస్తాయనే భావనతోనే.
అయితే అవి మనకు సంతృప్తి నివ్వలేవు అని తెలుసుకుంటే - అసంతృప్తి కలుగుతున్నదీ అని తెలుసుకుంటే - ఎంతకాలం ఎన్ని భోగాలు అనుభవించినా,
ఇంకా ఇంకా ధనాన్ని ప్రోగుచేసినా, అన్నీ వదలిపోవాల్సిందేనని తెలిస్తే - ఇవి మనతో వచ్చేవి కాదని తెలిస్తే, అప్పుడు మన బుద్ధి మారుతుంది. మన బుద్ధిలో అట్టి వివేకం కలిగినప్పుడు మనం వాటిపై వైముఖ్యం కలిగి ఉంటాం. అదీ నిజమైన వైరాగ్యం
. ఇవి అనిత్యమైనవి, శాశ్వత సుఖాన్నివ్వలేవు, మనను సంతృప్తి పరచలేవు అనే వివేకం కలిగితేనే వైరాగ్యం కలుగుతుంది.
అలా వివేకంతో కలిగిన వైరాగ్యమే నిజమైన వైరాగ్యం. అట్టి వైరాగ్యం కలిగినందుకు బాధ - దుఃఖం ఉండవు. పైగా సంతృప్తి. ఎందుకంటే అవి మనకు ఇష్టంలేనివి గనుక.
👏👏👏

Source - Whatsapp Message

No comments:

Post a Comment