Tuesday, October 6, 2020

"ప్రకృతి అంటే అందరిదని, ప్రకృతి పరిరక్షణ అందరి బాధ్యత"

విశ్వాసానికి కుక్క.

వేగానికి గుర్రం.

మోయడానికి గాడిద.

బరువులెత్తడానికి ఏనుగు.

పంటలు పండించడానికి పశువులు.
కోళ్లు, పిచ్చుకలు ,పావురాలు ఇవన్నీ మన ఇంటి చుట్టూ, మరియు పరిసరాలలో ఉన్న క్రిమికీటకాలను భుజించి పర్యావరణాన్ని శుభ్రం చేయుటకు తోడ్పడతాయి.

ఇలా ఏ జంతువు, ఏ పక్షి ని చూసినా, వాటి వాటి ప్రత్యేకతలతో పర్యావరణ రక్షణకు ఎంతో దోహదం చేస్తున్నాయి.

మనుషుల అవసరాలకు. రక్షించడానికి తమ వంతు బాధ్యత నిర్వహిస్తూనే ఉన్నాయి.

కానీ మనిషి ఏం చేస్తున్నాడు?

విచక్షణ లేకుండా చెట్లను నరికి వేసి, పర్యావరణాన్ని పాడుచేసి నిత్యం రోగాలతో, అనారోగ్యాలతో తనకు తానే మరణశాసనం రాసు
కుంటున్నాడు. కనీస పర్యావరణ స్పృహ లేకుండా ప్రకృతిని నిర్లక్ష్యంగా భావిస్తూ ప్రకృతి తత్వం తెలుసుకోకుండా,

స్వార్థపూరితంగా "తాను సుఖ పడితే చాలు "అనుకొని జీవనం గడుపుతున్నాడు.

పర్యావరణం పరిరక్షణలో తన బాధ్యత కూడా ఉందని పర్యావరణం బాగుంటేనే ప్రజలందరూ బాగుంటారని అనుకోక పోవడం,

" ఒక్కడి కోసం అందరూ అందరి కోసం ఒకడు"

అని గొప్ప సూత్రాన్ని మరిచిపోయి నందువల్ల,పర్యావరణ
కాలుష్యానికి కారణమవుతోంది.

గాలి చెడిపోతుందంటే "నేను ఒక్కడినే చెడగొడుతున్నానా?"

అని ప్రతి ఒక్కరు అనుకోవడం వల్ల గాలి చెడిపోతుంది.పర్యావరణం చెడిపోతుంది.

ఎవరికి వారే "నా ఒక్కడి వల్లనే చెడిపోతుందా,నేను బాగుచేస్తే బాగుపడుతుందా?"

అని దురాలోచన చేయడం వలనే పర్యావరణం,రోజురోజుకు క్షీణించిపోతుంది.

ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ "ప్రకృతి అంటే అందరిదని, ప్రకృతి పరిరక్షణ అందరి బాధ్యత"

అని గుర్తించి కనీసం ఒక్కరు ఒక మొక్క నాటడానికి ప్రయత్నం చేయండి.
భూమి శోషించుకోలేని, వస్తువులను వాడడం తగ్గించుకోండి.

Source - Whatsapp Message

No comments:

Post a Comment