Saturday, October 3, 2020

మోక్షమార్గం

🌸మోక్షమార్గం🌸

500 రూ౹౹ నోటు ఓ చేత పట్టుకొని, చాక్లెట్ ఓ చేత పట్టుకొని చినబాబు దగ్గరికి వెళ్లి రెండు చేతుల్లో ఉన్న చాక్లెట్,500రూ చూపిస్తే ఏమి తీసుకుంటాడు? చాక్లెట్ మాత్రమే తీసుకుంటాడు. ఎందుకంటే అతడికి 500రూ౹౹ నోటుతో బోలెడు చాక్లెట్లు కొనవచ్చని తెలియదు గనుక..

అలానే జ్ఞానం ఓ ప్రక్క అర్థకామాలు ఓ ప్రక్క పెడితే అర్థకామాలు మాత్రమే కావాలని కోరుకుంటారు అజ్ఞానులు. ఎందుకంటే జ్ఞానం వల్ల సకలం మన సొంతం అవుతాయని తెలియక. 500రూ నోటు వంటి మోక్షం కోరుకోవడం లేదు. అందుకే ఎక్కువగా వృద్ధులు తప్ప యువకులు ఆధ్యాత్మిక ప్రభోదాల సభలలో ఉండరు.

శ్రీకృష్ణుడు కూడా చెప్పాడు. విద్యలలో నేను బ్రహ్మవిద్య అని. నన్ను తెలుసుకోగోరేవారు బ్రహ్మవిద్య అభ్యాసం చేయమని చెప్పాడు. పరమాత్మని వివిధ రూపాలలో కొలుస్తారు. కానీ పరమాత్మ చెప్పింది మాత్రం చేయరు.

ద్రౌపది శ్రీకృష్ణ పరమాత్మ మీద చూపిన అనన్య భక్తిని మనం చూపాలి. ద్రౌపది వేరే మార్గాలన్ని మూసుకుపోయాయని గ్రహించగానే రెండు చేతులు ఎత్తి శ్రీకృష్ణపరమాత్మ ను వేడుకుంది. దీన్నే సర్వస్య శరణాగతి అంటారు. శాస్త్రం మీద, గురువు మీద కూడా మనకి అంత భక్తి ఉండాలి. మోక్షమార్గం గురుశాస్త్ర ఉపదేశం మాత్రమే అని గ్రహించాలి. కేవలం బ్రహ్మ విద్య ఒక్కటే మోక్షాన్ని ఇస్తుంది. కర్మవల్ల మోక్షం రాదు.

ఆత్మ మదింపు లో చైతన్యం సంపూర్ణంగా వికసించి స్వాత్మానుభూతి చెంది అహంబ్రహ్మష్మి స్థితి చేరుకోవడమే లక్ష్యం. పరమేష్టి తానొచ్చిన ప్రతీసారి తనకో ఉపాధి కాగలందులకు, మానవున్ని తన ప్రతిరూపంగ, స్రృష్టి పరిణామక్రమంలో రాతి నుండి 7 దశల్లో తీర్చిదిద్దాడు, తన ఇఛ్ఛాశక్తిని బుధ్ధిని అందించి 84 లక్షల జన్మలతో, జన్మలో ఉత్కృష్టమైనది చేసాడు.

మోక్షమార్గంలోఆత్మానుభూతి పొందడానికి అనుభవమనె వాహనం ద్వంద్వం యొక్క రెండు పార్శ్వాలు రెండు చక్రాలుగ ఆత్మ ప్రయాణం చేస్తే గమ్యం చేరుతుంది. ఇహం పరం రెండు పరస్పర పూరకాలు .పరానికి కావలసిన మూలాలు ఇహం లోనే ఉందన్నారు రమణ మహర్షి. కనుక జ్ఞానం అర్ధకామాలు రెండూ కావాలి, అవి నాణేనికి రెండు పార్శ్వాలు. సాధారణ జీవితం భగవత్ ప్రసాదం అందులోంచే ఆధ్యాత్మికత పండాలి.

గీతలోకూడా: " జ్ఞాని కానివాడు సదా కర్మల నాచరించాలని చెప్పబడింది".


🙏

Source - Whatsapp Message

No comments:

Post a Comment