🌸మనస్సు పావనమైనప్పుడు సత్యం గోచరిస్తుంది.🌸
మనస్సుని ఎలా పావనం చేయడం అనేది వెంటనే ఉద్భవించే సందేహం.
నీరు నిర్మలంగా ఉన్నప్పుడు అందులో మనం ప్రతిభింబిస్తాం. అందులో విషం కలిపినా, పాలు కలిపినా నీరు కలుషితం అవుతాయి. బింబం అగోచరమౌతుంది. అలానే మనస్సులో మొదట చెడు తలంపులు తరిమేయడానికి మంచి తలంపులు చేయాలి. క్రమంగా మంచి తలంపులు కూడా తగ్గించాలి. అలా తగ్గించగా మనసు నిర్మాలమౌతుంది. అప్పుడు సత్యం గోచరిస్తుంది.
కాలులో ముల్లు గుచ్చుకున్నప్పుడు మరో ముల్లు తో తీసివేసి రెండు ముళ్ళు పారవేస్తాం. అలానే అజ్ఞానమనే ముల్లు తీసివేయడానికి జ్ఞానమనే ముల్లును వాడవలసి ఉంటుంది. అజ్ఞానం పోగానే జ్ఞానాన్ని విసిరివేయాలి. అంటూ శ్రీరామకృష్ణులు విపులీకరించారు.
ఈ రీతినే మనస్సు నిశితంగా గమనించే ఎవరికైనా ఒకవిషయం స్పష్టమౌతుంది. మనస్సు ఒక్కొక్క భాగము ఒక్కొక్క పనిని నేర్పడానికి తహతహలాడడం గ్రహించవచ్చు. ఒక రథానికి పూన్చిన గుఱ్ఱాలు ప్రతిఒక్కటీ ఒకొక్క దిశలో పోతుంటే రథికుడు గతి ఏమౌతుంది?
సాధన లేక పరివిధాల పోయే మనస్సు గల మనిషి గతీ అంతే.. అతడు దేనిని సక్రమంగా చేయలేడు. బాహ్య వ్యవహారాలనే సక్రమంగా చేయలేని అతడు ఆంతరంగిక జీవితం గురించి ఆలోచన కూడా చేయలేడు.
ఏకాగ్రమైన మనస్సే పావన మనస్సుగా విరాజిల్లుతుంది.
💚💚💚💚💚
Source - Whatsapp Message

No comments:
Post a Comment