Sunday, October 11, 2020

మన హిందూ ధర్మ జీవన శైలి, వైభవం ఎటువంటివో ఒకసారి పరిశీలిస్తే..

🤘🤘🤘🤘🤘🤘🤘🤘🤘

👌మన హిందూ ధర్మ జీవన శైలి, వైభవం ఎటువంటివో ఒకసారి పరిశీలిస్తే.. మన సంపాదన ధర్మ బద్ధంగా ఉండాలి. మన జీవన విధానం ధర్మ బద్ధంగా ఉండాలి అని ఇదే మన భారతీయ జీవన విధానం అని మనకు ఉపదేశిస్తుంది..👌

తల్లి గర్భము నుండి ! ధనము తేడెవ్వడు !
వెళ్ళి పోయెడి నాడు ! వెంట రాదు !
లక్షాధికారైన- లవణ మన్నమే కానీ !
మెరుగు బంగారంబు ! మింగ బోడు !
విత్తమార్జన జేసి ! విర్రవీగుటె కానీ !
కూడ బెట్టిన సొమ్ము ! కుడవ బోడు !
పొందుగా మరుగైన- భూమి లోపల బెట్టి !
దాన ధర్మము లేక ! దాచి దాచి !
తుదకు దొంగల కిత్తురో- దొరల కవునో !
తేనె జుంటీగ లియ్యవా- తెర వరులకు !
భూషణ వికాస ! శ్రీ ధర్మపురి నివాస !
దుష్ట సంహార ! నరసింహ ! దురిత దూర !!

అర్థం:- మనము తల్లి గర్భము నుండి ఈ లోకములోకి ఉత్త చేతులతోనే వచ్చాము, తిరిగి ఉత్త చేతులతోనే తిరిగి పోతాము. పుట్టిన వాడు గిట్టక తప్పదు. లక్షాధికారి అయినా ఎవరూ బంగారాన్ని తినరు కదా అందరూ ఉప్పు కారంతో కూడుకున్న అన్నమే తింటారు. అన్యాయంగా అక్రమంగా అధర్మంగా ధనాన్ని సంపాదించి ఎంత విర్ర వీగినా కూడ బెట్టిన సొమ్ము ఎవరైనా తిన గలుగుతారా, తినలేరుకదా.

దానము చేయక, ధర్మము లేక, దోచి దోచి దాచిన సొమ్ము చివరకు దొంగల కవుతుందో, దొరల కవుతుందో, ప్రభుత్వమే జప్తు చేసు కుంటుందో చెప్పటం కష్టం. మన కళ్ళ ముందర ఎంత మందిని చూడటం లేదు మనం, ఏంతో మంది అవినీతి మహారాజుల జీవితాలు తారు మారు కావటం లేదా. తేనెటీగలు జీవితాంతము కూడ బెట్టిన తేనెను అవి తినగలుగు తున్నాయా ? తినలేవు కదా.

మన హిందుత్వం ఆధ్యాత్మిక జీవన విధానం త్యాగమయమే కాని భౌతిక భోగలాలసత్వం కాదుకదా.
త్యాగేనైక అమృతత్వ మానుషుః!
న ధనేన న ప్రజేన" అని వేదం ఘోషిస్తుంది!!

అంటే త్యాగము చేయటం వలననే "అమృతత్వం" సిద్ధిస్తుంది! ధనం వలన గానీ, సంతానము వలన గానీ, ప్రజాబలం వలన గానీ లభించదు.

అందుకే ధర్మ బద్ధంగా సంపాదించండి. ధర్మ బద్ధంగా జీవించండి. ఇదే మన భారతీయ జీవన విధానం. ఇదే మన హిందూ ధర్మ జీవన వైభవం.. మనిషీ ఎప్పుడైతే సంపాదన మీద వ్యామోహం పోగొట్టు కుంటాడో, ఎప్పుడైతే అవసరాన్ని మించి ధనాన్ని కూడ బెట్టకూడదు అనుకుంటాడో‌‌, తన కుటుంబంలో వాళ్ళు మాత్రమే కాదు లోకంలో అందరూ తన వాళ్ళేనని గుర్తిస్తాడో, ఈ నేల మనకి శాశ్వతం కాదు అని, ఎప్పుడైతే అందరి శ్రేయస్సును గూర్చి తపన పడతాడో, అప్పుడు మనిషీ... ఓ మనసులేని మనిషి... ఓ డబ్బు మనిషీ... ఓ మర మనిషీ... చూడు, అప్పుడు అవుతుంది ఈ నేల సస్యశ్యామలం, అప్పుడొస్తుంది అసలైన సంతోషం మనిషికి, అప్పుడు పోతాయి ఈ కరువు కాటకాలు అన్నీ, అప్పుడు పోతాయి ఈ నేరాలూ, ఘోరాలూ, దోపిడీ, దొంగతనాలు అన్నీ, అప్పుడు పోతాయి ఈ ఆకలి చావులు అన్నీ, అప్పుడు పోతాయి ఈ కుట్రలూ కుతంత్రాలూ అన్నీ, అప్పుడొస్తాయి మనుషుల మధ్య ప్రేమలు, ఆప్యాయతలు, అదీ అసలైన సంతోషం, అదీ అసలైన ఆనందం.. శుభం భూయాత్.👌

🤘సర్వే జనా సుఖినోభవంతు🤘

👌ధర్మో రక్షతి రక్షతః 👌

For Every Action Equal &
Opposite Reaction*

Source - Whatsapp Message

No comments:

Post a Comment