Sunday, October 11, 2020

మరణం శరీరానికా, అంతరంగంకా, ఎవ్వరికి

🌹మరణం శరీరానికా, అంతరంగంకా, ఎవ్వరికి🌹

శరీరానికి పుట్టిన రోజు, మరణించే రోజు ఉంటాయి. ఈ శరీరం పుట్టడము మన తల్లితండ్రులకి తెలిస్తుంది. వారే దీనికి ఒక పేరు వారికి ఇష్టమైనది పెడతారు. ఈ శరీర మరణం మన పిల్లలకి తెలుస్తుంది. తరువాత వారు ఈ శరీరం మనం వదిలేసిన రోజున ప్రతి సంవత్సరం తద్దినాలు పెడతారు.

మన అందరిలో ఒక అంతరంగం ఉంది,

ఇది స్వభావలతో, అలవాట్లతో, సంస్కారాలతో, జ్ఞాపకాలతో అహంకారం తో ఉంటుంది.

ఇది మనము ఈ శరీరంలోకి ప్రవేశించక ముందు ఉంది, ప్రవేశకంచాక ఉంది, శరీరం వదిలిసికా కూడా ఉంటుంది.

ఇది ఎప్పుడు పుట్టిందో మనకి తెలియదు,

కాని ఈ అంతరంగాన్ని ఖాళీ చేసే పని మనదే, మనమే చేయగలం.

కాబట్టి దీన్ని చంపే పని మనదే.

ఎప్పుడు చేస్తుంది అంటే ఏమో,

దీనికి శరీరానికి ఉన్నట్టు, ఆయుర్దాయం లేదు.

ఇక ఈ శరీరం, దీనితో పాటు అంతరంగమే కాకుండా, పరమాత్మ దివ్య అంశ కూడా ఉంది.

అది మనమే, దానిని ఆత్మ అంటారు.

అయితే శరీర, అంతరంగ సాంగత్య దోషం చేత ఈ ఆత్మ జీవాత్మ గా మారింది.

తిరిగి ఈ జీవాత్మ ఆత్మగా మారాలి అంటే వీటిలో ఉంటూ వీటికి అంటుకోకుండా ఉండాలి.

ఇలా మన శరీరం మరణించడం మాత్రమే కాదు, అంతరంగం మరణించాలి, జీవాత్మ ఆత్మ గా మారాలి,
అప్పుడే ఈ ఆత్మ ఆ పరమాత్మలో లీనం అవుతుంది.

అంతరంగ మరణానికి, జీవాత్మ ఆత్మగా మారడానికి కొన్ని సాధనలు ఉన్నాయి.

వాటిని ఆద్యాత్మిక సాధనలు అంటారు.

వాటిని ఇంకోసారి వేరే పోస్టులో చూద్దాము.

🌹🌹🌹🌹🌹🌹

Source - Whatsapp Message

No comments:

Post a Comment