కృషి ఉంటే....
కృషి ఉంటే మనుషులు ఋషులవుతారని' అంటారు!
ఋషి అంటే తపస్వి అనగా తపించేవాడు. జీవితంలో ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని, ఆ లక్ష్య సాధనలో అమితమైన ఆసక్తిని కలిగి ఉండి, త్రికరణ శుద్ధిగా(మనసా, వాచా, కర్మణా) ప్రయత్నిస్తూ, దారి పొడవునా ఎదురయ్యే అనేక విఘ్నాలను సునాయాశంగా దాటుకుంటూ, ఎటువంటి ఆకర్షణలు, ప్రలోభాలు, అల్పకాలిక సిద్ధులకు లొంగక స్థిర చిత్తుడై నిలిచేవాడే ఋషి(తపస్వి)!
ఇటువంటి ఋషిగా అవ్వాలంటే కృషి (ఎఫర్ట్) ఉండాలి.
ఉదాహరణకు... సోమరిగా నిరుపయోగంగా ఉన్న ఒక వ్యక్తిని ఎందరు ప్రోత్సహించిన తనలో మార్పు ఉండదు, ఎవరు విమర్శించి అవమానించిన బాధకు లోనవుతాడే కానీ మార్పుకై ప్రయత్నించలేడు. కానీ, తనకు తానుగా 'నేను ఎలా అయినా మారాలి, నేనేమిటో నిరూపించుకోవాలి' అనే సంకల్పం ఎప్పుడైతే చేసుకుంటాడో, తపిస్తాడో అటుపై తనలో చాలా త్వరితగతిన మార్పు సంభవిస్తుంది.
అందుకే తండ్రీ శివ పరమాత్మ చెబుతున్నారు...
'నేను ఎవ్వరినీ మార్చను కానీ నేను మారాలి అని తపించేవారికి పూర్తి సహయోగాన్ని ఇస్తాను. వారు ధైర్యంగా ఒక అడుగు వేస్తే నేను వారిచే అనేక అడుగులు వేయిస్తాను అని' - ఆ ఒక్క అడుగే తపన (కృషి/ తీవ్ర సంకల్పం)ఎవరు చేస్తారో వారే పొందుతారు!
వీరు మారాలి, వారు మారాలి, పరిస్థితులు మారాలి, ప్రపంచం మారాలి అని తలంచే కంటే నేను మారాలి అని తపించాలి. ఆ తపనయె తపస్సు. ఇటువంటి తపస్విలే పరమాత్మకు, స్వయానికి, సర్వులకు సత్యమైన సహయోగులు.
ఓం శాంతి🙏🏻
Source - Whatsapp Message

No comments:
Post a Comment