Monday, October 12, 2020

సానుకూల దృక్పథం..

సానుకూల దృక్పథం.. 🌸

🌸 సానుకూల దృక్పథం అనేది అన్ని విషయాలలో చాలా అవసరం... ఎందుకంటే మనం పరిస్థితిని అంచనా వేయటానికి మూడు రకాలైన దారులలో చూస్తాం.. సమాధానం కూడా అలాగే వెదుకుతాం.. అవి సాధారణంగా, అసాధారణ0గా మరియు మధ్యేమార్గంలో చూస్తాం... సమాధానం ఎప్పుడు సాధారణ ఆలోచన నుండి అసాధారణ వైపు నడిచి మద్యేమార్గంలో బయటకు వస్తుంది... అనేది నిత్యం మన జీవితంలో జరిగే ప్రక్రియ.. ఈ దారిలోనే ఎక్కువగా నడిచేది..

🌸 సానుకూల దృక్పథం వల్ల మనం ఒక వరవడిని సృష్టించటమే మన జీవితంలో... అది ఎలా అంటే విషయం మన దృష్టిలోకి వచ్చింది దానిని మన సాధారణ దృష్టితో కంటే సానుకూలంగా చూడటం వల్ల అనవసరపు ఆలోచనలు చెయ్యము... అంటే విషయానికి బలం మన అనవసరపు ఆలోచనే... ఎప్పుడైతే బలం ఇవ్వటం ఆపేస్తామో అక్కడ అది చిన్నగానే ఉంటుంది... అంటే మన దృక్పథం ఎంత బలంగా ఉంటే విషయ0 అంత స్పష్టంగా చూడగలుగుతాం... స్పష్టత రానంతవరకె దేనికైనా బలం ఉండేది... అంటే మనదగ్గరకు వచ్చే విషయలను మనకు నేర్పే గురువుగా చూడటం అలవాటైతే జీవితం లో కష్టం అనేది ఉండదు గాక ఉండదు..
అసలు కష్టం అంటే ఇష్టం లేకపోవడం... కష్టం అనే మాటను పదే పదే అనుకోవడం వల్లే మనకు విశ్వం ఇచ్చే బహుమతులు రావడం ఆలస్యం అవుతుంది..

🌸 మనం మన జీవితంలో ప్రతి విషయాన్ని సానుకూలంగా చూడటం అలవాటుగా మార్చుకుంటే..
ఏమి జరిగిద్ధో చూద్దాం...

విషయాన్ని(సమస్య) సానుకూలంగా చూడటం మొదలైతే విషయం పరోక్ష
గురువుగా మారుతుంది..

ప్రయాణాన్ని సానుకూలంగా చూస్తే విహారాయత్ర అవుతుంది..

ఇంట్లో బంధువుల గోలను సానుకూలంగా చూస్తే సందడి అవుతుంది..

శత్రువును సానుకూలంగా చూస్తే గురువు అవుతాడు..

అందరితో సానుకూలంగా మాట్లాడితే మనమే అందరికి బంధువవుతాం...

ప్రతి రోజును సానుకూలంగా మొదలు పెడితే ఆ రోజు పండగే అవుతుంది...

🌸 సానుకూలంగా చూడటం అనేది అలవాటుగా చేసుకుంటే మనం చాలా విషయాలను ఉన్నది ఉన్నట్లుగా చూస్తాం.. అక్కడనుంచి ఎదగడమే ఉంటుంది... సానుకూలంగా మాటలు పదాలు విరివిగా వాడితే సరైన బహుమతులు వస్తాయి.. సానుకూలంగా దృక్పథం మన జీవితంలో అడ్డంకులు రానివ్వదు వచ్చేవి ఏవైనా నేర్పడానికే.. ఏదైనా వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా బహుమతులు ఇచ్చి వెళుతుంది..

యధః ధ్యాసః తథా యోగః..

Thank you...🌸🌸🌸

Source - Whatsapp Message

No comments:

Post a Comment