Monday, November 16, 2020

మనం గెలుస్తూ.. విలువలను కూడా మహోన్నతంగా గెలిపిస్తేనే నిజమైన విజయం సాధించినట్లు!

గెలవాలని కోరుకో లేదు
ప్రత్యర్థి ఓడాలనీ కోరలేదు!
కోరిందల్లా ….
అన్యాయంపై.. న్యాయం
శక్తిమంతుడుపై.. బలహీనుడు
కులోన్మాదంపై.. సమసమాజం
మతమౌడ్యంపై.. మతసామరస్యం
దోపిడీపై.. సమన్యాయం
అహంకారంపై.. సంస్కారం
అహంభావంపై.. అభిమానం
పదవీకాంక్షపై.. ప్రజల ఆకాంక్ష
మోహంపై ..మోక్షకాంక్ష
సొమ్ములపై.. సంబంధాలు
భౌతికతపై.. ఆధ్యాత్మికత
నిరాశావాదంపై.. ఆశావాదం
"నేను"పై.."మనం"
నాస్తికతపై.. దైవభక్తి
అవినీతిపై.. నీతి
అసత్యంపై ..సత్యం
అలసత్వంపై.. జాగరూకత
జడత్వంపై.. చైతన్యం
క్రోధంపై.. శాంతం
హింసపై.. కారుణ్యం
నిర్లిప్తతపై.. ఆసక్తి
వికారాలపై.. వివేకం
విద్యపై.. జ్ఞానం
చట్టంపై.. న్యాయం
మూర్ఖత్వంపై.. మంచితనం
విశృంఖలతపై.. విచక్షణ
వార్తలపై.. వాస్తవాలు
ఆర్థికబంధాలపై.. అనుబంధాలు
రాజకీయంపై.. ప్రజాస్వామ్యం
పాలకులపై.. ప్రజాభిప్రాయం
విజయం సాధించాలని!

మనం గెలిచి.. విలువలు ఓడితే
మనం ఓడిపోయినట్లే !
మనం ఓడి.. విలువలు గెలిస్తే
మనం గెలిచినట్లే !
మనం గెలుస్తూ.. విలువలను కూడా
మహోన్నతంగా గెలిపిస్తేనే
నిజమైన విజయం సాధించినట్లు!
✍🏻 సత్యమూర్తి

Source - Whatsapp Message

No comments:

Post a Comment