Wednesday, November 18, 2020

మనం స్వతంత్రులం....

మనం స్వతంత్రులం.....

సాధారణంగా మన జపతపాదులు, యోగ సాధనాలన్నీ దేని కొరకు? భవ బంధనాల నుండి విడుదల కోసమే కదా?! వాటి నుండి విడిపించమనే కదా ఆ భగవంతుని ఆశ్రయిస్తాము!

అయితే, ఆ భగవంతుడు తానే స్వయంగా చెబుతున్నారూ... "నీవు స్వతంత్రుడవు, నీ ఆలోచనలే ( మనోభావాలే) నిన్ను బంధీని చేశాయి, వాటి నుండి నేను కూడా మిమ్మల్ని విడుదల చేయను, కేవలం మార్గాన్ని చూపుతాను...ఎవరికి వారే బంధనముక్తులు కావాలి" అని!

అతను చూపిన మార్గం ఏమిటో తెలుసా? 'నేను' 'నాది' అనే భావాన్ని మరచి అంతా 'నీది'గా (భగవంతునిదిగా) తలంచుతూ...ఈ దేహంలో ఒక అతిధి మాదిరి వ్యవహరించమంటున్నారు!

ఇంత సహజమైన మార్గం మనకు ఎందుకు కష్టం అనిపిస్తుంది? 'నేనే' అన్న అహం మనకెందుకు? ఈ క్షణం ఈ శరీరాన్ని వీడితే నాది అనేదంతా నాది కాదే.... నేనే చేయాలి అనుకునేదంతా నేను లేకున్నా జరిగిపోతుందే....ఏదీ కూడా నాతో పాటు అంతరించిపోదే....క్షణకాలం ఆడే ఆట కదా ఈ జీవితం...!

'మరణం కాదు మనకు ముక్తినివ్వాల్సింది....మనలో ఇటువంటి ఆలోచనల జననమే మనల్ని స్వతంత్రులను చేస్తుంది'.....బంధన ముక్తున్ని చేసి పరమాత్ముని సామీప్యతను అనుభవం చేయిస్తుంది.....సదా ఆనందానుభూతిని అనుభవం చేయిస్తుంది.

మరి, అజ్ఞాన జనిత ఆలోచనల నుండి మరణించి స్వతంత్రులం అయ్యేందుకు సంసిద్ధం ఔదామా....??!!

ఓం శాంతి🙏🏻

Source - Whatsapp Message

No comments:

Post a Comment