🌹సాధన తెలుసుకోవడం🌹
ఏదైనా మనకన్నా భిన్నంగా ఉంది అనుకుంటే అది మనకి కావాలి అనిపిస్తుంది,
దానికై వెతుకులాట,
ఎక్కడ ఉందో,
ఎలా ఉందో,
ఎవ్వరి దగ్గర ఉందొ,
దాన్ని ఎలా సంపాధించాలో అన్న ఆలోచనలు మొదలు అవుతాయి.
ఆ భిన్నంగా ఉండే వస్తువు మనకి సాద్యం గా ఉంటుంది.
దాన్ని సంపాదించే ప్రయత్నం చేసే మనం సాధకులం, ఆ ప్రయత్నం సాధన,
సంపాదించాక మనని సిద్దుడు అంటారు.
ఉదాహరణకి
మనకి భోజనం కావాలి ఆకలి వేస్తోంది, బయట ఎక్కడో ఊర్లో ఉన్నాము.
అప్పుడు భోజనము సాధ్యం,
భోజనము కై మనం చేసే ప్రయత్నం సాధనా (హోటల్ వెతుక్కొని వెళ్తాము గా)
వెతికే మనము సాధకులం,
భోజనము చేయడం సిద్ది.
ఇలా అన్నమాట
ఈ విదంగా సాధ్యం, సాధకుడు, సాధన, సిద్ది ఉన్నాయి.
అలానే ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే,
అది జ్ఞాతము,
తెలుసు కునే ప్రయత్నం సాధన,
తెలుసుకునే వాడు జిజ్ఞాసి అయిన సాధకుడు, తెలుసుకున్నది జ్ఞానం.
అయితే కొన్ని లోపలే ఉంటాయి,
బయట ఉండవు,
ఆ విషయం మనకి తెలియదు.
తెలియక బయట వెతుకుతూ ఉంటాము.
ఇక్కడ సాధ్యం పై స్పష్టత లేదు,
సాధకుడు ఉన్నాడు,
సాధన ఉంది,
సిద్ది మాత్రం లేదు.
ఉదాహరణకి మనకి మనశాంతి లేదు,
మనస్సు లోపల ఉంది అని దాని శాంతి కోసం ప్రయత్నం లోపల చెయ్యాలని తెలియదు,
ఈ మనశాంతి కోసం సినిమాలకి వెళ్తాం,
లేదు,
మందు కొట్టి పడుకుంటాం.
కానీ సినిమా అయి పోగానే,లేదా మందు ప్రభావం తగ్గగానే మళ్ళీ మనశాంతి కోసం వెతకడం ప్రారంభం అవుతుంది.
ఆనందం ఎదో ఒక వస్తువు ఉంటే ఉంటుంది అనిపిస్తుంది,
ఆ వస్తువు పొందడానికి తీవ్ర ప్రయత్నం ఉంటుంది. ఆ వస్తువు దొరుకుతుంది,
కానీ కావాల్సిన ఆనందము మాత్రము దొరకదు.
ఉదాహరణకి కాలి నడకతో ప్రయాణం చేసే వాడికి ఒక సైకిల్ ఉంటె బాగుండు అనుకోని ఎదో విధంగా దాన్ని సంపాదించి వాడుతూ ఉన్నాడు అనుకొండి, వాడి ఆనందం ఆ సైకిల్ తో పూర్తి అవ్వదు,
ఇప్పుడు వాడికి సైకిల్ తొక్కాలి అంటే కాళ్ళ నెప్పులు అంటాడు,
వాడికి ఒక మోటార్ సైకిల్ కావలి.
కొన్ని రోజులకు పెరుగుతున్న తన కుటుంబ సభ్యుల కోసం నాలుగు చక్రాల వాహనం కావాలి,
తరువాత ఎక్కువ హార్స్ పవర్ ఉన్న వాహనం కావాలి,
ఇలా వస్తువులు మారుతున్నాయి,
అవి వస్తున్నాయి,
కానీ ఆనందం రావడంలేదు,
ఎందుకని అంటే,
ఆనందం ఆ వస్తువులలో లేదు,
తనకున్న దానిలో తృప్తి పడటం లో ఉంది.
ఇలా మనకి కావాల్సింది బయట ఉంటే,
దానికి ప్రయత్నం ఉండాలి,
సాధన కావాలి,
సిద్ది పొందాలి.
అదే మనకి కావాల్సింది మన లోపలే ఉంటే దానిని తెలుసుకోవాలి,
ఎందుకంటే
అది మనకు తెలియదు కనక,
దాన్ని తెలుసుకొని,
దాని సానిధ్యాన్ని అనుభవించాలి.🌹
Source - Whatsapp Message

No comments:
Post a Comment