Wednesday, November 18, 2020

కర్మ - ఫలితం - ధ్యానం

🧘‍♂️కర్మ- ఫలితం - ధ్యానం🧘‍♀️
తెలిసి చేసినా తెలియక చేసినా మన ప్రతి కర్మలకు ఫలితం ఉంటుంది, ఒకరిని దూషించినా లేక ఒకసారి భగవంతుడు కి నమస్కారం చేసుకున్న రెండింటికి ఫలితం ఉంటుంది..


భగవంతుడు పై ప్రగాఢ మైన విశ్వాసం లేకుండా కేవలం నామజపం చేయడం వలన ప్రయోజనముంటుందా అని కొంతమంది అనుకుంటుంటారు..


అయితే..... మనం కోరి నీళ్లలోకి దిగినా, ఎవరైనా మనల్ని పట్టుకుని నీళ్లలోకి తోసేసినా మన బట్టలు తడవక తప్పదు కదా!


అలాగే మనం క్రమపద్ధతిలో నిత్యం ధ్యానం చేస్తుంటే మన మనస్సులో ప్రగాఢ విశ్వాసం ఎప్పుడో ఒకప్పుడు కలుగుతుంది, ధ్యానం చేస్తున్న మనకు కూడా రోజూ చేస్తుంటే క్రమేణా మనసు నిలకడ చెందుతుంది. ఎల్లప్పుడూ విచారణ చేస్తే మన మనస్సు కోరుకునే లౌకిక వస్తువులన్నీ అనిత్యాలని ఎరిగి మనస్సును భగవంతునికి సమర్పించుకోవాలి.


ఉదాహరణకు ఒకరు చేపలు పడుతూవున్నారు... అటు వైపుగా మేళతాళాలతో పెద్ద ఊరేగింపు వెళ్లింది. ఆ శబ్దాలు హోరుగా వినిపించినా కానీ, అతని మనస్సు గాలం మీదే లగ్నమై ఉంటుంది.... మన మనస్సు లో ఎన్ని ఆలోచనలు వున్నా ఎల్లప్పుడూ భగవంతుని పై మనస్సు నుంచి ఎల్లప్పుడూ ఆయన స్మరణలో మునిగివుండడమే ధ్యానసాధన.


నిత్య ధ్యాన సాధన వల్ల కర్మ ప్రక్షాళనం జరుగుతుందని గురువులు అందరూ చెప్తున్నారు. శ్రీకృష్ణుడు ఉద్ధవగీత లో కూడా చెప్పారు.

పూజ కోటి సమం స్తోత్రం!స్తోత్ర కోటి సమో జపః! జపః కోటి సమం ధ్యానం!ధ్యాన కోటి సమో లయః!!*

🕉️🌞🌍🌙🌟🚩

Source - Whatsapp Message

No comments:

Post a Comment