శ్రీరమణీయం - (734)
🕉🌞🌎🌙🌟🚩
✍️ మురళీ మోహన్
🤔 'నేనెవరు' అన్న ప్రశ్న ద్వారా సాధన ముందుకు ఏ విధంగా కొనసాగుతుంది !?"
భగవాన్ శ్రీరమణమహర్షి బోధించిన నేనెవరు అన్న ప్రశ్నకు సులభోపాయం ఆత్మను శోధించటమే. అయితే అంతకన్నా ముందు అసలు మన వ్యక్తిత్వం ఏమిటో చూసుకోవాలి. నేను, వ్యక్తిత్వం, అహంకారం అనే పదాలు మనసుకు పర్యాయ పదాలే. వేదాంత పరిభాషలో దేన్నైతే అహంకారం అంటారో దాన్నే గ్రాంధిక భాషలో వ్యక్తిత్వమని, వాడుక భాషలో నేను అని వాడుతుంటాం. నేనెవరు అన్నప్రశ్నతో మన వ్యక్తిత్వానికి సంబంధించిన ఆత్మపరిశీలన పుట్టాలి. దానివల్ల మన వ్యక్తిత్వం ఏమిటో, అందులోని లోపాలు ఏమిటో తెలుస్తాయి. వ్యక్తిత్వంలో లోపాలన్నీ ప్రవర్తన ద్వారా వ్యక్తమవుతాయి. ఆ లోపాలను సవరించుకుంటే వ్యక్తిత్వం బాగుపడుతుంది. చెడ్డ వ్యక్తిత్వం వల్ల దురహంకారం వస్తుంది మంచి వ్యక్తిత్వం నిరహంకారానికి దారి తీస్తుంది. నిష్కలమైన వ్యక్తిత్వంతో ఉండటమే అహంకార రహితస్థితి. నిరహంకార స్థితికి మరో పేరే శాంతి. మంచి వ్యక్తిత్వానికి ప్రతీక మంచి ప్రవర్తనే కాబట్టి ఒక సత్ప్రవర్తన ద్వారా మనం దుఃఖాన్ని దూరం చేసే శాంతిని సంపాదించుకోవచ్చు !
{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం}"
"దైవదర్శనం.. దుఃఖనాశనం.. శాంతితోనే సాధ్యం !''- (అధ్యాయం -90)
🕉🌞🌎🌙🌟🚩
Source - Whatsapp Message

No comments:
Post a Comment