Saturday, December 12, 2020

అసలైన వైరాగ్యం అంటే ఏమిటి?

🍁 అసలైన వైరాగ్యం అంటే ఏమిటి?🍁

✍️ మురళీ మోహన్

🤘 భగవద్గీత 5వ అధ్యాయం లో కృష్ణుడు వైరాగ్యం గురించి చెపుతారు... చాలా స్పష్ఠంగా చెపుతారు....వైరాగ్యం అని ఏదైతే ఉన్నదో అది వాస్తవంగా యోగము.

ఎందుకంటే నీవు ఒకదానికి జత అవ్వనిదే వేరొకదానినుండి విడిపోలేవు.నీవు భగవంతునితో సంబంధం ఏర్పర్చుకుంటే అప్పుడు వైరాగి అవ్వగలవు . భగవంతునితో సంబంధం లేకపొతే వైరాగ్యం అనే సమస్యనే లేదు. అలాంటి ఆలోచన విధంగా ఉన్న వైరాగ్యం సరి కాదు. భగవంతుని సంబంధం లేకుండా వైరాగ్యం కుదరదు. ఎందుకంటే ఆ యొక్క వైరాగ్య భావం మనోవైఫల్యంలోను లేదా మనోద్వేగంలోను పుట్టింది. ఆ వైరాగ్య భావం శాశ్వతం కాదు.
నీవు ఆ వైరాగ్య భావంలో ఉన్నపుడు, ఈ భౌతిక ప్రపంచంయొక్క తాత్కాలిక నైజం గురించి కానీ లేదా కష్టాలు తెచ్చే ఈ ప్రకృతి నైజం గురించి తెలుసుకొనవచ్చును కానీ ఆ పరిజ్ఞానం ఎంత వరకును సరిపోదు.

తాత్కాలికంగా కలిగే వైరాగ్యాలు పురాణ వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం అని మనకి కలిగే వైరాగ్యాలు మూడు రకాలు.


పురాణ ప్రవచనం వింటున్నత వరకు గొప్ప వైరాగ్య భావాలు ఉంటాయి. బయటికి రాగానే ,చెట్టు మీద పక్షులు ఎగిరి నట్టులు వైరాగ్యభావాలు ఎగిరి పోతాయి.
ప్రసూతి వైరాగ్యం బిడ్డని కనే టప్పుడు ప్రతీ స్త్రీ కి కలుగుతుంది. కానీ బిడ్డను కనగానే
అది గాలికి ఎగిరి పోతోంది.
ఎవ్వరైనా చనిపోయినప్పుడు ఆ శవం శ్మశానములో కాలిపోతుంటే
మనసుకి వచ్చే ఆలోచనల తో శ్మశానవైరాగ్యం కలుగుతుంది. కానీ పక్కనే ఉన్న చెరువులో స్నానాలు చేయగానే ఆ వైరాగ్యం నీళ్లలో తుడుచుకుని పోతుంది.
ఇలా బయటి విషయాలకి కలిగె వైరాగ్యాలు తాత్కాలికం.


మన అంతరంగం లో కలిగే వైరాగ్యపు మార్పు నిజమైన వైరాగ్యాన్ని కలిగిస్తుంది.


పూర్వం రత్నాకరుడు అనే బోయవాడి విషయం లో జరిగింది. సప్త ఋషులు రత్నాకరు డిని, వాడి పాపాలు వాడి కుటుంబ సభ్యులు పంచుకుంటారా అని అడగమంటారు. వారు ఎవ్వరూ పంచుకోరు అన్న విషయం తెలుసుకున్న తరువాత వాడికి వైరాగ్యం కలుగుతుంది.

తులసి దాసు కి కూడా ఇలాగే వైరాగ్యం కలుగుతుంది.

ఒక నాడు గొప్ప వాన లో ఈదుకుంటు తన భార్య ని చూడటానికి వస్తాడు. అప్పుడు అతని భార్య, నా పై చూపే ప్రేమ ఆ రాముడి పై చూపితే బాగుపడతావు అంటుంది. ఈ మాట తులసీదాసులో మార్పు తెస్తుంది.

ఇది అసలైన వైరాగ్యం అంటే.

మనిషికి ఈ ప్రకృతిని తనివి తీరా ఆనందించాలి అనే కోరిక చాలా బలమైనది కాబట్టి, అసలైన ఆశ్రయము లేక పోతే తిరిగి ఆ బింబ ప్రపంచానికి లేదా ఎండమావి లాంటి స్థితులకు లేదా ఆనందం లేని చోటకు ఆనందం కోసం వెతుకుంటూ వెళ్ళిపోతాడు.

…ఎక్కడైతే ఏమైనా ఆనందం ఉన్నాకానీ అది కేవలం తాత్కాలికము మాత్రమే .

ఒక్క భగవత్బాంధవ్యమే శాశ్వతానందం.అదే అసలైన వైరాగ్యం.🙏

🍁🍁🍁🍁🍁

Source - Whatsapp Message

No comments:

Post a Comment