ఫ్రెండ్స్ తల్లి గర్భములో జీవుడు రక్త మాంసాల
మధ్య "మావి మాయ "లో వుండలేక ఎప్పుడెప్పుడు బయటికి వస్తాన అని ఎదురుచూస్తూ ఉంటాడు.
తల్లి ప్రసవ సమయంలో గర్భస్తమాయ నుండి బయటకు వచ్చాక జీవుడు అమ్మయ్య మాయ నుంచి బయట పడ్డాను అని ఆనందం గా అనుకుంటుంది. పాపం అప్పుడు తెలియదు
ఆ జీవుడికి ప్రకృతిలోని అంతకన్నా నీచమైన అనేకమైన మాయల మాయాజాలంలో తుది శ్వాస వరకు దుఃఖానికి బందీ గా ఉండాలి అని.
ఫ్రెండ్స్ ఒకటి చెప్పనా మన దుఃఖానికి కారణం మనమే మరెవరో కాదు కాలేరు కూడ.
పాపం ఎవరి నిందించకండి.ఎలా మనమే కారణం అంటారా. తెలియని మాయ కమ్మి పొరపాట్లు చేస్తాం వాటి ద్వారా కష్టాలను కొని తెచ్చుకుంటాం
ఆ కష్టాలు ఎవరివలనో వచ్చాయి అనుకుంటూ మరో మాయలో పడతాం. మన పొరపాటు గ్రహించకుండా మాయలో మునిగి తేలుతూ ఎదుటివారి మీద నిందలు వేస్తూ కర్మలు పెంచుకుంటూ పోతుంటాం వామ్మో మాయ
మనలను ఎంతలా ఆడిస్తుంది.
సోద్యం గా అసలు మాయ ఎలా మనలను ఆవహించినదో కూడా తెలియదు.మాయ యొక్క గొప్ప విశేషం ఏమిటంటే అది వచ్చినది అని కూడ మనం కనిపెట్టలేం. ఇప్పుడున్న కరోనా కంటే భయంకరమైనది.ప్రతి క్షణం మనం ఎంతో జాగ్రత్తగా వుండాలి.మాయ గురించి అలోచించినప్పుడు
నాకు ఒక విషయం గుర్తుకి వస్తుంది.
అదేంటంటే ఒక భట్రాజు ఉంటాడు అతను పొగుడుతూ ఎదుటి వారిని ఇట్టే మాయలో పడేస్తాడు. అతను ఒక రాజు వద్దకు రావడానికి ప్రయత్నము చేస్తూ వుంటాడు.
అది తెలిసినా మంత్రులు రాజుకు భట్రాజుని రానివ్వదని సలహా ఇస్తారు. కానీ రాజు అతనిని రానిస్తాడు. వాడు వచ్చి రాజుని పొగడడం మొదలు పెడతాడు. అది చూసి వాళ్ళు
రాజుని హెచ్చరిస్తారు. అప్పుడు రాజు అంటాడు, " వీడు ఇంకా నిజమే చెప్పుతున్నాడు
కదా. వీడు పొగడడం మొదలు పెట్టాక చూద్దాము. వీడు పోగుడుతున్నాడు అని గూడ రాజు
గుర్తించ లేకపోయాడు." మాయ అటువంటిది.
అది మనలను కప్పుతోంది అని తెలుసుకోవడం
మొదటి మెట్టు. అను క్షణం జాగరూకతతో వుండాలి. అది తెలిస్తే సగం సమస్య
అయిపోయినట్టే.మాయ కప్పినది అని తెలుసుకున్నాక ప్రవర్తించే జ్ఞానం తెలుసుకొనడం లేదా కలిగి ఉండడము.ఆ జ్ఞానాని ఆచరించడం.
ఇవన్నీ గూడ చెప్పినంత సులభం కాదు.
మరి ఎలా ఈ మాయను దాటటం అంటారా
ఈ మాయని దాటాలి అంటే భక్తి మాత్రమే నేడు మనకు తరుణోపాయం. మనం భగవంతుడి సేవకులం అని ఆయన ఆదేశం మేరకు కర్మను
చేయు ఆటగాళ్ళం అనే భావం నిరంతరం మన స్మరణలో ఉంటూ ఆ భగవన్నామస్మరణలో ఉండుటచేత మాత్రమే ఈ మాయ బారిన పడకుండా ఉండగలం పడిన త్వరగా బయటికి రాగలం 🙏
శివయ్య అందరిని చల్లగా చూడు తండ్రి 🙏
Source - Whatsapp Message

No comments:
Post a Comment