Tuesday, December 8, 2020

మంచి మాటలు

ఆత్మీయ బంధుమిత్రులైన మీకు కార్తీక ఆదివారపు శుభోదయ శుభాకాంక్షలు ,మీకు మీ కుటుంబసభ్యులకు ప్రత్యక్ష నారాయణుడు సూర్యభగవానుడి అనుగ్రహం తో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆనందంతో జీవించాలని కోరుకుంటూ తల్లితండ్రులను గౌరవించండి ,సోదర సోదరీమణులను ప్రేమతో ఆదరించండి గురువదేవులను స్మరించుకోండి ,అన్నార్తులను ఆదుకోండి ,ధర్మాన్ని కాపాడండి అప్పుడు భగవంతుడు మిమ్మల్ని ఆదరిస్తాడు 🌹🌷🤝🕉️💐🙏
ఆదివారం --: 06-12-2020 :--
ఈ రోజు AVB మంచి మాటలు
నీ మనసు బాధతో ఉన్నప్పుడు నవ్వడం తెలుసుకో. ఇతరుల మనసు బాధతో ఉన్నప్పుడు నవ్వించడం నేర్చుకో...

మనం కళ్లతో చూసింది క్షణికం మనసుతో చూసింది శాశ్వతం అందుకే కళ్లతో చూసిన దాన్ని కనుమరుగైతే మరచిపోవచ్చు కానీ ! మనసుతో చూసినదాన్ని మనం ఉన్నంత వరకు మరచిపోలేము అది వస్తువు అయినా మనిషి అయినా .

మనతో ఎవరు ఎంత కాలం కలిసుంటాం అనేది ఎవ్వరూ చెప్పలేం కానీ ! మనం దూరం గా ఉన్నంత మాత్రాన బంధాలు తెగిపోవు అర్థం చేసుకునే మనసు ఉంటే దూరం అనేది సమస్య కాదు బంధం పెరగడం తగ్గడం అనేది మన మనసుకు సంభందించింది మనల్ని అర్థం చేసుకొనే మనషుల్ని బట్టి ఉంటుంది .

మనకు కావల్సిన వారి కండ్లు చూస్తే కష్టాలు తెలిసిపోతాయి అంటారు పెద్దలు,, కానీ నేటి సమాజంలో కష్టాలు చెప్పుకుంటే కనికరించకుండా ఎత్తిపొడుస్తున్నారు ,, హేళన చేస్తున్నారు,,

ఎండాకాలంలో సూర్యుడిని తిట్టిన వాళ్లే చలికాలంలో సూర్యుడి రాకకోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తారు,, అలాగే ఈరోజు మనల్ని కాదనుకొని వెళ్లిన వాళ్లే ఏదో ఒకరోజు మనల్ని వెతుక్కుంటూ వస్తారు కావాల్సింది కొద్దిగా ఓపీక ,సహనం మాత్రమే

సేకరణ ✒️ *మీ ...AVB సుబ్బారావు 🕉️🤝🌹🌷💐🙏

Source - Whatsapp Message

No comments:

Post a Comment