Tuesday, December 1, 2020

మంచి మాటలు ...

సోమవారం --: 12-10-2020 :--
ఈ రోజు AVB మంచి మాటలు ...

మనం ఇతరులకి సాయపడే విషయంలో పండ్లనిచ్చే చెట్టులా ఉండాలి . చెట్టుకి ఇవ్వడమే తెలుసు మంచి మనుషులు కూడా అంతే ఇతరులకి సాయం చేయ్యడం తప్ప వారి స్వార్థం కోసం ఎప్పుడు ఏమి ఆశించరు .

ఒక మంచి మాట మనిషిలో ధైర్యాన్ని నింపుతుంది అదే మాట మనిషిని పిరికివాన్ని చేస్తుంది మన మాట పడిపోయిన వాడికి లేచి నడిచే ఉత్సాహాన్ని ఇవ్వాలి కానీ పరిగెత్తే వాడిని పడేసేలా ఉండొద్దు . సాయం చేసే చెయ్యి ఎంత గొప్పదో మంచి మాట మంచి సాయంతో సమానం .

నీ జీవితం నీకు గమ్మం తెలియని ప్రయాణం అయినపుడు నీ మనసు చెప్పిన దాన్ని మాత్రమే మీరు వినండి ఎందుకంటే అది నిన్ను ఎప్పటికి మోసం చేయ్యదు అబద్దం చెప్పదు .

మనకు మనశ్శాంతి లేని సంపద మనకు ఆరోగ్యం లేని ఆయుష్షు మనల్ని అర్థం చేసుకోలేని బంధం మనకు అవసరానికి కానరాని స్నేహం ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే.

సేకరణ ✒️ *మీ ...AVB సుబ్బారావు 🌹🕉️💐🤝

Source - Whatsapp Message

No comments:

Post a Comment