అసలైన అందం
ప్రతి మనిషిలో ఒక అందం ఉంటుంది. ఆ అందానికి మెరుగులు దిద్దేది అలంకారం.
కానీ నిజమైన అందం అంటే ఇతరులను ఆకర్షించే విధంగా ఉండేది కాదు. అలాగే అలంకారం అంటే శరీరానికి రంగుల మెరుగులు అద్దడం కాదు.
మనిషికి నిజమైన అందాన్ని ఇచ్చేది ఏమిటంటే అతడు మాట్లాడే మాటతీరు.
దానికి మెరుగులు దిద్దడం అంటే మాట్లాడే ప్రతి మాటను ఆలోచించి ఎదుటి వారి మనసును ఆకర్షించే విధంగా మాట్లాడటం.
అలా ఆలోచించకుండా, అర్థం లేకుండా మాట్లాడడం అంటే "గురి చూడకుండా బాణం వదలడం లాంటిది ".
ఏదైనా ఒక మాట మాట్లాడితే, ఆ మాట మాట్లాడిన తరవాత తిరిగి ఆలోచించాల్సిన అవసరం రానే రాకూడదు. కాబట్టి ఏది మాట్లాడినా ఆలోచించి ఆచి తూచి మాట్లాడాలి.
నిజానికి మాట్లాడడం ఒక కళ. ఏది, ఎప్పుడు, ఎక్కడ, ఎలా, మాట్లాడాలి అనేది కూడా ఒక అద్భుతమైన విద్య. నాలుకను అదుపు చేసుకోగల విద్య తెలిస్తే, అనేక విద్యలు అవలీలగా ఒంట పడతాయి. నోటిని అదుపులో పెట్టుకుని అందరితో మర్యాదగా మాట్లాడుతూ, పద్ధతిగా నడుచు కుంటూ ఉంటే అలాంటి వాడికి ఎక్కడైనా, ఎప్పుడైనా మంచే జరుగుతుంది.
చెట్టు యొక్క సారం పండులో వ్యక్తం అయినట్లుగా, మనిషి యొక్క సారం అతడి మాటలో తొంగి చూస్తు ఉండాలి.
ఎవరయితే మంగళ కరమైన మాట తీరు కలిగి ఉంటాడో , అది మనిషి సంస్కారానికి గీటు రాయిగా నిలుస్తుంది .
ఎవరైతే తమ మాటల వల్ల చేతల వల్ల , ఇతరులకు బాధ కలిగించ కుండా ఉంటారో వారే ఉత్తములు.
మన మాటే సంపదలకు మూలం.ఆ సంపదలే మానవ సంభంధాలకు మూలం.మన మాటలే మనకు స్నేహితులని సంపాదించి పెడతాయి .మన మాటలే మనకు శత్రువులని కూడా తయారు చేస్తాయి.
కటువైన మాటలు ఇతరుల హృదయాలను గాయపరుచగలవు, అలాగే కమ్మనైన మాటలు మనసులోని గాయాలను నయంచేయగలవు .
అలాగే తియ్యటి మాటలతో నమ్మించి మోసం చేసేవారు ఉన్నారు..అలాంటి వారి పట్ల జాగ్రత్తలు తీసుకోవలసిన బాధ్యత మనపైనే ఉంటుంది .
మన హావభావ వ్యక్తీకరణ ఎంత గొప్పగా ఉంటుందో దాని ఫలితం కూడా అంత మహత్తరంగా ఉంటుంది
ఆకట్టుకునేలా మాట్లాడటం ఓ కళ. ఆమాటలను ఎప్పుడు ఎలా మొదలు పెట్టాలో ఎప్పుడు ఎలా ఆపాలో తెలియటం మరీ గొప్ప కళ. ఈ మాటలు మనసుపై ఒత్తిడి తెచ్చేవి కనుక సున్నితంగా వాడాలి.
🍁🍁🍁🍁
Source - Whatsapp Message

No comments:
Post a Comment