Tuesday, October 12, 2021

నేటి మంచిమాట. నేడు ప్రతీ సమస్య భాషణం అంటే మాటల ద్వారానే వస్తుంది.

🙏నేటి మంచిమాట.

ఈ సమాజంలో గౌరవంగా బ్రతకాలంటే గర్వాన్ని వదలాలి. విచిత్రం ఏమంటే అందరూ గౌరవంగా బ్రతకాలనే కోరుకుంటారు.కానీ గర్వాన్ని వదలటానికి ఎవరూఇష్టపడరు. ఇగోని,అహాన్ని వదిలితే ఆపదలు రమ్మన్నా రావు. ఇవ్వడం ఇష్టం లేనపుడు పొందటానికి అంటే అందుకోడానికి అర్హత ఎలా వస్తుంది.

ఇది అర్దం చేసుకోలేక పోవడమే అజ్ఞానం. అజ్ఞానాన్ని పోగొట్టుకోవటానికి చేయాల్సింది ధ్యానం. తీసుకోవాల్సింది అంటే తినాల్సింది శాకాహారం.వేరే మార్గం లేదు కాక లేదు.ఇవి రెండూ కూడా చాలా చవక మరియు తేలిక.

కాస్త గమనిస్తే తెలుస్తుంది.మన ఇరుగు పొరుగు వారిని కానీ బంధుమిత్రులను కానీ తెలిసిన వారిని కానీ గమనించండి అర్దం అవుతుంది.ఏ ఒక్కరైనా గర్వంగా వుండి గౌరవం పొందిన వారిని చూసామా?అసలు మనం గౌరవిస్తామా.

బాషణం భూషణం అయితే బాధలే వుండవు మనిషికి జీవితంలో.కానీ నేడు ప్రతీ సమస్య భాషణం అంటే మాటల ద్వారానే వస్తుంది.మళ్ళీ ఆ సమస్య నుంచి బయటపడటానికి మరో సమస్య.అలా సమస్యలనుండి బయట పడటానికే ఎంతో విలువైన సమయం సంపద ఖర్చు అవుతుంది. కానీ నేడు సమాజంలో చాలా మంది పరిస్తితి అలానే వుంది మరి.అడుసు తొక్కనేల కాలు కడగనేల అలావుంది పరిస్థితి.చదవ గలిగితే మంచి మంచి పుస్తకాలు చదవాలి.చదవలేని వారు వినాలి.విని ఆకళింపు చేసుకోవాలి.ఆచరించాలి.నలుగురికి చెప్పాలి.అపుడు అందంగా,ఆహ్లాదంగా,హాయిగా ఆనందంగా వుంటుంది జీవితం.

ఇవి నిత్యసత్యాలు.ఈ వయసులో ఇవి సాధ్యం కావేమో అనిపిస్తుంది. కానీ అసలు సాధ్యం అయ్యేది ఈ వయసులోనే .కాస్తా చొరవ తీసుకోవాలి అంతే.ఇది సత్యం కాదండి,నిత్య సత్యం, పరమ సత్యం.మహా మహా గొప్ప సత్యం.
ధ్యానం ధన్యం. మౌనం శాకాహారం పరమ పవిత్రం,సత్యం.

ఉషోదయం తో మానస సరోవరం 👏👏

సేకరణ

No comments:

Post a Comment