Friday, October 15, 2021

నిజమైన సంపదలు

నిజమైన సంపదలు
₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹

వెంటరాని బంధాలకై
ఎందుకింత తపన?

నాది నావాళ్లు అని
ఎనలేని స్వార్ధ చింతన..

నీతో కొనిపోలేని సిరులకై
ఎందుకింత మోహం ?

మందిని ముంచి ఆర్జించాలను
ఏల ఈ మోస గుణం...

బూడిదయ్యే మేనుకై
ఎందుకింత వ్యామోహం?

అందాన్ని కాపాడుకొను
అలంకారాల ఎలా ఆర్భాటం...

తప్పని మరణానికై
ఎందుకింత భయం?

ఆశాపాశాలు వదలలేని అంతులేని ఈ ఆరాటం...

నమ్మికలేని బతుకున
ఎందుకింత ఆందోళన?

మనసున శాంతి కరువైన
విపరీత సంఘర్షణ...

ఒనర్చిన పాపపుణ్యాలే
నీ వెంటొచ్చు బంధాలు

నిలుపుకొన్న మంచితనమే నిజమైన సంపదలు

చూపించిన మానవతే చెదరిపోని సౌందర్యము

కాలమైనా కలకాలంనిల్చే
ఇట్టి జన్మేగా ధన్యము.*

🙏🏻🙏🏻

సేకరణ

No comments:

Post a Comment