Monday, October 25, 2021

నేటి మంచిమాట. జీవితం...

నేటి మంచిమాట.

ఏముకల గూడు పైన కప్ప బడిన ( అల్లబడిన ) మాంసపు ముద్దే ఈ శరీరం. ఈ దేహం.ఇది అర్దం అయితే ఆహా..ఏమి భాగ్యమో!

ఏదో చుట్టపు చూపుగా వచ్చి ఓ నాలుగు రోజులు ఉండి పోయే ఈ శరీరమే అంత గొప్పదైతే అనంతంగా శాశ్వతంగా అసలు మరణమే లేని కనిపించని ఆ ఆత్మ ఎంత ఎంత ఎంత గొప్పదో కదా!.

ఆత్మశక్తి జీవశక్తి ప్రాణశక్తి చైతన్యశక్తి ఎంత గొప్పదో కదా! అందుకే నేను దేవుడ్ని , మీరు దేవుడు మనమంతా దేవుళ్ళం. అవును మీరు చదివేది నిజంగా నిజమే.

సాక్షాత్తూ భగవంతుడే సృష్టించిన పుట్టించిన మనం దేవుళ్ళం మహాదేవుళ్ళం నిజమైన దేవుళ్ళం.

కాదంటే మనం ( మనిషి ) సృష్టించిన,నెలకొల్పిన,కట్టించిన విగ్రహం బొమ్మ ఫోటో దేవుడెలా అవుతాడు మన అజ్ఞానం కాకపోతే.

ఎండకు ఎండి వానకు తడిసి చలికి వణికి దుమ్ము కొట్టుకుని సిగరెట్ ముక్కలు చుట్టముక్కలు బీడీ పీకలు వేయించుకుని రెట్టలు వేయించుకుని మురికి కొట్టుకుని నడి రోడ్డు పై మురుగు కాలువ పక్కన రణగొణ ధ్వనులతో దేవుడా! హే భగవాన్....ఏమిటో ..... ఎప్పటికో...ఈ సత్యం తెలుసుకునేది.

ఇందుకు ధ్యానం చేస్తే వస్తుంది జవాబు. నీవు అవుతావు నవాబు. ఇక వుండరు ఎవరూ గరీబు. ఇదే జీవితం. I T I S L I F E
శుభోదయం తో మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment