Tuesday, October 19, 2021

నేటి మంచిమాట. మంచీ చెడు.

నేటి మంచిమాట. మంచీ చెడు.

చెడు చేస్తేనే చెడు కాదు. చెడు ఆలోచన కూడా చెడే. ఇది చెడు అని తెలిసి కూడా చెడు చేస్తే శిక్షలు కటినంగా దుర్భరంగా వుంటాయి.
తెలియక చెడు చేస్తే శిక్షలు సరళంగా ఉంటాయి.

చెడు పనులు స్థూలం చెడు ఆలోచనలు సూక్ష్మం.చేసిన చెడు నుండి బయటపడే ఏకైక మార్గం శిక్ష అనుభవించడమే తప్ప మరోటి లేదు వుండదు.

అలాగే చెడు వలన వచ్చే శిక్షలు కటినంగానే కాదు భరించలేనంత బాధాకరంగా వుంటాయి ఉంటుంది కూడా.

ఎందుకంటే సృష్టిలో అటువంటి నియమాలు వున్నాయి మరి. అందుకే మాట చేత తలపు అంటే ఆలోచన అత్యంత జాగ్రత్తతో కూడి వుండాలి. ప్రతీ మాట ఆచితూచి మాట్లాడాలి.అవసరం అయితేనే మాట్లాడాలి క్లుప్తంగా మాట్లాడాలి అర్థవంతంగా మాట్లాడాలి.

వాక్ స్వాతంత్ర్యం వుంది కదాని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఇబ్బందులు వస్తాయి వస్తున్నాయి చూస్తున్నాం.

మళ్ళీ ఆ ఇబ్బందుల నుండి బయట పడాలంటే ఎంతో విలువైన సమయం సంపద శ్రమ అంతా వృదా అవుతుంది.

సమాజంలో చాలామంది అనవసరంగా మాట్లాడే మాటలన్నీ వృదా మాటలే.ఎంతో ఉన్నత స్థానాల్లో వున్నవారు కూడా ఒకోసారి చెడుగా మాట్లాడి చెడ్డవారిగా పేరు తెచ్చు కుంటున్నారు. మాటలు చెడుగా వుండి పనులు ప్రయోజనకరం అయినా ఫలితం నిష్ప్రయోజనమే.

అందుకే మౌనంగా ఉందాం మౌనాన్ని అలవాటు చేసుకుందాం.ధ్యానం చేద్దాం.శ్వాస మీద ద్యాస పెడదాం.శాకాహారం తిందాం.శాంతంగా ఉందాం.🙊🙉🙈

ఉషోదయం తో మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment