Sunday, October 10, 2021

మనుషులలో ఇవే ఉన్నాయి అరిషడ్వర్గాలు

99% మనుషులలో ( మనిషి ) లేడు

మనుషులలో ఇవే ఉన్నాయి అరిషడ్వర్గాలు

1 కామం వల్ల క్రోధం పుడుతుంది
2 మోహం వల్ల లోభం పుడుతుంది
3 మదం వల్ల మాత్సర్యం పుడుతుంది

కామ,
క్రోధ,
లోభ,
మహ,
మద
మాత్సర్యాలు అనే ఆరింటిని కలిపి అరిషడ్వర్గాలు అని అంటారు.

ఈ అరిషడ్వర్గాలు అనేవి మనషిని ఎంతటి క్రింది స్థాయికైన దిగాజారుస్తాయి. మనిషి పతనానికి మరియు ప్రకృతి వినాశనానికి కూడా ముఖ్య కారణం ఈ అరిషడ్వర్గాలె. ఈ అరిషడ్వర్గాలు ఎవరైతే కలిగి ఉంటారో వారి మనసు ఎప్పుడు స్వార్ధం మరియు సంకుచిత భావాలే ఎక్కువగా కలిగి ఉంటాయి. దుఃఖానికి ఇవి మొదటి హేతువులు. ఈ అరిషడ్వర్గాల గురించి వివరంగా తెలుసుకుందాం.

1.కామము – కామము అంటే కోరిక. ఇది కావాలి. అది కావాలి అని తాపత్రయ పడటం, అవసరాలకు మించిన కోరికలు కలిగి యుండడము.

2. క్రోధము – క్రోధము అంటే కోపము. ఇది కోరిన కోరికలు నెరవేరనందుకు చింతించుతూ, తన కోరికలు నెరవేరనందుకు ఇతరులే కారకులని వారిపై ప్రతీకారము తీర్చుకోవాలని ఉధ్రేకముతో నిర్ణయాలు తీసుకోవడము.

3. లోభము – లోభము అంటే కోరికతో తాను సంపాదించుకున్నది, పొందినది తనకే కావాలని పూచిక పుల్ల కూడా అందులోనుండి ఇతరులకు చెందగూడదని దానములు, ధర్మకార్యములు చేయకపోవడము.

4. మోహము - తాను కోరినది కచ్చితముగా తనకే కావాలని, ఇతరులు పొందకూడదని అతి వ్యామోహము కలిగి యుండడము, తాను కోరినది ఇతరులు పొందితే భరించలేకపోవడము.

5. మదము – మదము అంటే అహంకారం. ఇది తాను కోరిన కోరికలన్ని తీరుట వల్ల తన గొప్పతనమేనని గర్వించుతూ మరియెవ్వరికి ఈ బలము లేదని ఇతరులను లెక్కచేయక పోవడము.

6. మాత్సర్యము - తాను గలిగియున్న సంపదలు ఇతరులకు ఉండగూడదని తనకు దక్కనిది ఇతరులకు దక్కకూడదని, ఒకవేళ తను పొందలేని పరిస్థితిలో ఆ వస్తువు ఇతరులకు కూడా దక్కకూడదనే ఈర్ష్య కలిగి యుండడము.

అరిషడ్వర్గాలను అంటే ఏమిటో తెలుసుకున్నారు. వీటిని మనం అదుపులో ఉంచితేనే ఎవరైన అనుకున్న స్థాయికి చేరుతాము లేకపోతే వీటి బారిన పడి ఎవరైన పతనం అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. వీటిని జయించాలి

(లేక అదుపులో ఉంచడం) అంటే ముఖ్యమైన ఆయుధం భగవంతుని సత్యమైన దివ్యమైన జ్ఞానం మాత్రమే. ఆ దేవదేవుని జ్ఞానం ఎపుడు పొందుతామో (తెలుసుకుంటామో), అప్పుడు అరిషడ్వర్గాలు అన్నియు సమస్తము మన మనసు నుండి సర్వం నశించిపోతాయి.
.

సేకరణ

No comments:

Post a Comment