జీవితంలో రెండు రకాలు మనస్తత్వాలు గల మనుషులు వుంటారు . లక్ష్యం కోసం పరిగెట్టేవారుంటారు , కోరిక కోసం పరిగెట్టేవారుంటారు . కోరిక తీరాలని పరిగెడితే తగిలేది ఎదురు దెబ్బలే , లక్ష్యం కోసం పరిగెడుతే ఎదురొచ్చేదల్లా విజయాలే . మనకు తెలిసో తెలియకో కొన్ని తప్పులు చేస్తుంటాం . మళ్ళీ మళ్ళీ తప్పులు చేసే వాడు మూర్ఖుడు . కానీ చేసిన తప్పును తెలుసుకొని సరిదిద్దుకునే వాడు నిజమైన మనిషి . ప్రతీకారం తీర్చుకునే వారు మానసికంగా బలహీనులు , మౌనంగా వుండే వారు మానసికంగా బలవంతులు , కానీ జరిగినవి మరచిపోయి ప్రశాంతంగా వుండే వారు బుద్ధిమంతులు . అయితే ఏమన్నా ఓర్చుకుంటున్నారు కదా అని పిరికి వారీగా భావించకూడదు . ఓర్చుకొనే మనసున్న చోటే ప్రేమాభిమానాలు వుంటాయి అని తెలుసుకోండి . ఎదుటి వారి తప్పొప్పులు నవ్వుతూ భరించినంత కాలం మనం మంచి వాళ్ళమే . ఎప్పుడైతే తప్పుని తప్పు అని చెప్పి సరిచేయ్యాలని చూస్తామో అప్పుడే మనలో మనకి తెలియని లోపాలని వెతికి మరీ ప్రపంచానికి మరో రకంగా పరిచయం చేస్తారు . అప్పటి వరకు మనం చూపిన ప్రేమాభమానాలూ , మనం చేసిన ఉపకారాలు అన్నీ మరుగున పడిపోతాయి . ఇదే నేటి మనుషుల తీరు . అయితే మనం ఎదురు తిరగపోయినా దేవుడు వారిని క్షమించడు . ఇంతకు పది రెట్లు నష్ట పరిచి మనశ్శాంతిని కోల్పోయేలా చేస్తాడు . మనం చేసే ప్రతి మంచి పని గానీ , చెడ్డ పని గానీ దాని ప్రతిఫలం మనకు తెలియకుండానే మనకు చేరేలా చేస్తాడు . పూర్వం క్రిందటి జన్మ ఫలితం ఈ జన్మలో , ఈ జన్మ ఫలితం వచ్చే జన్మలో అనుభవంలోకి వస్తుంది అనేవారు కానీ ప్రస్తుతం మాత్రం ఈ జన్మలో చేసిన దాని ఫలితం ఈ జన్మలోనే అనుభవం లోకి వచ్చేస్తుంది . కాబట్టి మనం చేసిన తప్పులను తెలుసుకొని సరిదిద్దుకుంటే పాప ప్రక్షాళన జరిగి మంచి భవిష్యత్తు , ఆనందకరమైన , ప్రశాంత జీవితం లభిస్తుంది . ఈ రోజుల్లో బంధం అనేది తామరాకు మీద నీటి బిందువులు లాంటివి . అవి ఎప్పుడు జారిపోతాయో ఎవరికీ తెలియదు . అందుకే ఎవరి మీద ఎక్కువ నమ్మకం పెంచుకోకూడదు . జరిగిపోయిన దాని గురించి ఎక్కువ ఆలోచించి మనసు పాడు చేసుకోకుండా జరగవలసిన దాని గురించి అలోచించి మన మీద మనం నమ్మకం పెట్టుకొని ముందుకు సాగితే తప్పక విజయం లభిస్తుంది . మనతో మాట్లాడడానికి సమయం లేదు , చాలా బిజీగా వున్నాను అంటే వారికి కావలసిన వారి జాబితాలో మనం లేము అన్న నిజాన్ని గ్రహించాలి . ఎందుకంటే ఎప్పటి వరకు మనం వారికి నచ్చినట్లు బ్రతుకుతామో అప్పటి వరకు మనం చాలా మంచి వాళ్ళం కానీ ఒక్కసారి మన మనసుకి నచ్చినట్లు బ్రతకడం ఎప్పుడు మొదలు పెడతామో క్షణాలలో చెడ్డవారం అయిపోతాం . ఇదీ నేటి సమాజం . చచ్చాక వచ్చి మట్టి వేసే బంధాల కన్నా బ్రతికి ఉన్నప్పుడు వచ్చి పలకరించే బంధాలు గొప్పవి . వారిని మనం ఎప్పుడూ గౌరవించాలి . కోపంతో అన్నీ కోల్పోతాం , శాంతంగా వుంటేనే ఏదైనా సాధించగలం . కష్టాల్ని ఎదిరించే దమ్మూ , బాధలని భరించే ఓర్పు ఎప్పుడైతే మనలో వుంటాయో అప్పుడు జీవితంలో మనం గెలవబోతున్నామని అర్థం . ఇదే జీవిత సత్యం . సర్వే జనా సుఖినోభవంతు . *శుభోదయం ...Ss
సేకరణ
సేకరణ
No comments:
Post a Comment