Tuesday, December 14, 2021

🍁సుఖ దుఃఖాలు🍁

🍁సుఖ దుఃఖాలు🍁

✍️మురళీమోహన్

🤘మనిషి జీవితంలో సుఖదుఃఖాలు కలిసే ఉంటాయి. జీవితమంతా దుఃఖమయమంటారు కొందరు.
దుఃఖం సుఖానికి భూమికలాంటిది.

పూలవద్ద ఉన్న ముళ్లు పూల రక్షణ కోసమే. దట్టమైన చీకట్లో దీపకాంతి లభించినట్లుగా ముందుగా కష్టాలను అనుభవించాకనే సుఖానుభవం పొందడం ఆనందకరమంటాడు భాసమహాకవి. మనిషికి కష్టాలు, దుఃఖభావనలు, అలసట, ఆందోళన లేకపోతే లౌకిక జీవితం నిస్సారమవుతుంది.

కుంతీదేవి కృష్ణ భగవానుడితో ‘స్వామీ! మళ్ళీ మళ్ళీ విపత్తులే కలిగేలా చెయ్యి, విపత్తుల్లోనే నిన్ను శరణు వేడుకుంటాం. నువ్వొక్కడివే దుఃఖాన్ని దూరం చేసేవాడివని విపత్తులు మాకు బోధించాయి. సుఖాల్లో ఉన్నవారిని నువ్వు పట్టించుకోవు... నీ సంపర్కం కలిగించే విపత్తులే మాకు సంపదలతో సమానం’ అంటుంది.

బొమ్మలతో ఆడుకుంటున్న పిల్లవాణ్ని తల్లి పట్టించుకోదు. కడుపు నొప్పనో, కాలు నొప్పనో ఏడుస్తుంటే పరుగెత్తుకొస్తుంది.

దుఃఖంనుంచి
పారిపోకూడదు. ఒక సవాలుగా స్వీకరించాలి.

బంగారం శుద్ధం కావాలంటే నిప్పుల్లో పడాలి.

వెదురును విరిస్తేనే వేణువవుతుంది.

శిలను చెక్కితేనే దేవతామూర్తి ఉద్భవిస్తుంది.🤘

సేకరణ

No comments:

Post a Comment